వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ చరిత్ర/వలస పాలన యుగం

భారతదేశ చరిత్ర-వలస పాలన యుగం అన్న ప్రాజెక్టు ఉపపేజీ భారతదేశ చరిత్రలో భాగంగా వలస పాలన యుగానికి సంబంధించిన అంశాలను అభివృద్ధి చేయడానికి మార్గసూచిగా, ప్రగతి నమోదుకు, ఇతర ఆసక్తి కలిగిన సభ్యులతో సమన్వయానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.

ప్రాధాన్యత మార్చు

18 శతాబ్ది మలి అర్థభాగం నుంచి 20 శతాబ్ది తొలి అర్థభాగం వరకూ రెండు శతాబ్దాల సుదీర్ఘకాలం విస్తరించిన వలసపాలన యుగాన్నే ఆధునిక భారతదేశ చరిత్రగానూ చెప్పుకోవచ్చు. ఈ కాలం భారతదేశ చరిత్ర అధ్యయనంలో చాలా కీలకమైన కాలం. స్వాతంత్ర భారత చరిత్రకు సరిగా ముందు యుగం కావడంతో ప్రస్తుత భారతదేశ స్థితిగతులపై ఈ యుగం ప్రభావం అపారం. కనుక పలువురు చరిత్ర అధ్యయనకారులు, విద్యార్థులు, పోటీపరీక్షల అభ్యర్థులు వగైరా ఎందరికో ఇది ముఖ్యమైన అధ్యయన భాగం. తెలుగు వికీపీడియాలో ఈ సమాచారం లభ్యం కావడం వల్ల పలు పోటీపరీక్షలకు తయారయ్యే లక్షలాది మంది విద్యార్థులకు వికీపీడియా చేరువకావడం కూడా సాధ్యమవుతుంది. పాఠకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కనుక సమాచార విస్తరణతో పాటుగా నాణ్యత చాలా ముఖ్యం.

ప్రాజెక్టు సభ్యులు మార్చు

లక్ష్యాలు మార్చు

  • భారతదేశ చరిత్రలో వలసపాలన యుగానికి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించిన వ్యాసాలకు తగిన సూచనలు, అవసరమైన మార్గదర్శకాలు పంచుకునేందుకు.
  • వలసపాలన యుగానికి సంబంధించిన వ్యాసాల సృష్టి, విస్తరణ, నిర్వహణ, నాణ్యతాభివృద్ధి పనులను అభివృద్ధి చేయడానికి, సంబంధిత ప్రగతిని సభ్యులు నమోదుచేయడానికి.

వ్యాసాలు మార్చు

ఈ కింది జాబితా అసంపూర్ణం, అసమగ్రం. దాని విస్తరణకు కృషిచేయండి

ప్రధాన అంశాలు
ప్రధానమైన వ్యక్తులు
ప్రధానమైన సంఘటనలు, యుద్ధాలు