తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త జులై 1, 2010న ప్రారంభమైంది.
గూగుల్ వేతన వికీపీడియన్లకృషి వలన 665 పైగా వ్యాసాలు చేరి సగటు వ్యాస పరిమాణాన్ని పెంచాయి. అయితే ఔత్సాహికులు కృషి తగ్గిపోవటంతో వికీ అభివృద్ధి తగినంతగాలేదు.
నెలలో రోజుకు 4 నుండి 22 వ్యాసాలు సృష్టించబడుతున్నాయి.
నెలకు 5 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 27 నుండి 42 మధ్య వుంది.
నెలకు 100 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 2 నుండి 10 మధ్య వుంది.
నెలకు కొత్త గా వికీపీడియన్లుగా చేరే వారి సంఖ్య 3 నుండి 10 మధ్య వుంది.
పేజీ వీక్షణలు పిభ్రవరి 2010 లో అత్యధిక స్థాయియైన 4.5 మిలియన్లుకు చేరి ఆ తర్వాత చాలా తగ్గి డిసెంబరు చివరికి 2.1 మిలియన్లకి చేరుకున్నాయి.
డిసెంబరు 2010 పేజి వీక్షణలు డిసెంబరు 2009 తో పోల్చితే, -48 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 23వ స్థానంలో వుంది.