వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/కోవిడ్-19

తాజా వ్యాఖ్య: సమస్య టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Ch Maheswara Raju

కోవిడ్-19 బ్యానరు

మార్చు

కరోనా వైరస్ పట్ల ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చూపిస్తూ మలయాళ వికీలో ఒక బ్యానరు పెట్టారు. మనమూ అలా పెట్టవచ్చేమో ప్రాజెక్టు సభ్యులు పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 05:49, 26 మార్చి 2020 (UTC)Reply

తప్పకుండా చేద్దామండి. మంచి ఆలోచన. --పవన్ సంతోష్ (చర్చ) 15:40, 2 ఏప్రిల్ 2020 (UTC)Reply

ఐరోపా ఖండం

మార్చు

చైనా, ఇటలీ లతో బాటుగా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలు, తాకిడి ఎక్కువగా ఉన్న ఇరాన్, దుబాయ్, సౌదీ వంటి మధ్య ప్రాచ్య దేశాలు, వైరస్ ను సమర్థవంతంగా తిప్పి కొట్టిన దక్షిణ కొరియా, రష్యా దేశాలను కూడా ప్రాజెక్టులో చేర్చగలరు.

ప్రస్తుతానికి ఛైనా లో వైరస్ వ్యాసం నేను మొదలు పెడతాను. తర్వాత ఇటలీ పైన దృష్టి సారిస్తాను. మిగతా దేశాల గురించి ఈ లోపు ప్రాజెక్టు లో చేర్చే నిర్ణయం ఈ లోపు తీసుకొని తెలుపగలరు.

నేను వ్యాసం, మూలాలు, కొన్ని చిత్రాలు మాత్రమే చేర్చగలను. గ్రాఫులు వంటి వాటిని, ఇతరులు జత చేర్చవలసిందిగా మనవి. శశి (చర్చ) 14:09, 30 మార్చి 2020 (UTC)Reply

శశి గారూ, అవీ ఉండవలసిన వ్యాసాలే. మీరే చేర్చేయండి. కరోనావైరస్ మహమ్మారికి సంబంధించినదై ఉండి, నోటబిలిటీ ఉన్న ప్రతీ వ్యాసమూ ఈ పరిధిలో చేర్చుకోవచ్చు. ప్రాజెక్టు వరకూ చూస్తే మూడో ప్రాధాన్యత ఉన్న వ్యాసాలే కావచ్చు, మీ అభిరుచికి నచ్చితే మీరు వాటీ మీదే పనిచేయవచ్చు. ఇక్కడ మనం స్వచ్ఛందంగా రాస్తున్నాం, ఇదేమీ ఆఫీసు కాదు, కనీసం ఇక్కడైనా మన మనసుకు నచ్చేది రాయాలి కదా. ఆ విధంగా ముందుకు పోదాం. --పవన్ సంతోష్ (చర్చ) 15:54, 2 ఏప్రిల్ 2020 (UTC)Reply

భారతదేశ గణాంకాలకు మూస ఏర్పాటు

మార్చు

@Ch Maheswara Raju: మూస:2020 భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి వివరాలు పేరిట ఓ మూస తయారుచేసి అందులో మీరు అప్‌డేట్‌ చేస్తున్న భారతదేశంలో కోవిడ్-19 గణాంకాలు అన్నిటినీ తరలించాను. కాబట్టి, ఇకపై ఆ మూసలోనే మార్పుచేర్పులు చెయ్యండి. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 06:02, 4 ఏప్రిల్ 2020 (UTC)Reply

పవన్ సంతోష్ గారు ఈ మూస:2020 భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి వివరాలు ఓపెన్ చేయడం అర్దం కావడం లేదు అండి.అంతా గందగోళంగా ఉంది అండి. మూసను ఓపెన్ చేసే విధానం చెప్పండి.Ch Maheswara Raju (చర్చ) 06:15, 4 ఏప్రిల్ 2020 (UTC)Reply

పవన్ సంతోష్ గారు ఓపెన్ చేసే విధానం అర్ధం అయ్యింది అండి. ఇప్పటి నుండి మూస లో మార్పులు చేస్తా అండి.Ch Maheswara Raju (చర్చ) 08:36, 4 ఏప్రిల్ 2020 (UTC)Reply

సమస్య

మార్చు

పవన్ సంతోష్ గారు ఆంగ్ల వ్యాసం లో ఉన్న కరోనా వైరస్ కాలక్రమం లో ఈ డేటా ఉంది.

Major events of COVID19 pandemic in India till February
30 January First confirmed case
1 February First airlift from Wuhan, China
27 February Final airlift from Wuhan, China (Total of 759 Indians and 43 foreign nationals)
airlift from Japan (119 Indians and 5 foreign nationals)

ఇది మన తెలుగు వ్యాసంలో పెడితే మూస అని వచ్చి ఎరుపు రంగులో వస్తుంది. ఎందుకలా వస్తుంది ? మన తెలుగు వ్యాసం లో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం Ch Maheswara Raju (చర్చ) 11:08, 26 ఏప్రిల్ 2020 (UTC)Reply

Return to the project page "వికీప్రాజెక్టు/కోవిడ్-19".