వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలంగాణ
తాజా వ్యాఖ్య: సెప్టెంబరు 2014 మాసంలో ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
జనవరి 2014 మాసంలో ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ
మార్చు- జనవరి 11, 2014న ప్రారంభమైన తెలంగాణ ప్రాజెక్టు మాసాంతానికి అంటే 20 రోజులలో 26 వ్యాసాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇందులో 22 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి, 2 కోటలకు, 2 రైల్వేస్టేషన్లకు సంబంధించినవి.
- జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాకు చెందిన 7 వ్యాసాలు, మహబూబ్‌నగర్ జిల్లా, హైదరాబాదు జిల్లా మరియు ఆదిలాబాదు జిల్లాకు చెందిన వ్యాసాలు 4 చొప్పున, కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాకు చెందిన వ్యాసాలు 3 చొప్పున, నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక వ్యాసం కొత్తగా ప్రాజెక్టు పరిధిలో చేరాయి. రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒక్క వ్యాసంకూడా కొత్తగా చేరలేదు.
- సభ్యులవారీగా పరిశీలిస్తే అత్యధికంగా ప్రణయ్‌రాజ్ 9 వ్యాసాలను సృష్టించగా, నేను (సి.చంద్రకాంతరావు) 7 వ్యాసాలను, నాయుడిగారి జయన్న 3 వ్యాసాలు, వైజాసత్య 2 వ్యాసాలు, భాస్కరనాయుడు 2 వ్యాసాలు, వెంకటరమణ, రహంతుల్లా, ఈగల్ ఒక్కో వ్యాసాన్ని సృష్టించారు.
- 26 వ్యాసాలలో 19 వ్యాసాలు ప్రాజెక్టు సభ్యులు సృష్టించగా, మరో 7 వ్యాసాలు ప్రాజెక్టులో సభ్యులు కాని వారిచే సృష్టించబడ్డాయి.
- జిల్లా వ్యాసాల చర్చాపేజీలలో మరియు ప్రముఖుల వ్యాసాల చర్చాపేజీలలో నాణ్యత బేరీజు మూసలు ఉంచబడినవి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:03, 1 ఫిబ్రవరి 2014 (UTC)
ఫిబ్రవరి 2014 మాసంలో ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ
మార్చు- ఫిబ్రవరి మాసంలో ఈ ప్రాజెక్టులో భాగంగా 22 వ్యాసాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇందులో 18 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి, 4 వ్యక్తేతరులకు సంబంధించినవి.
- జిల్లాల వారీగా చూస్తే హైదరాబాదు జిల్లాకు చెందిన వ్యాసాలు అత్యధికంగా 7 సృష్టించబడగా, ఆదిలాబాదు జిల్లాకు చెందిన 5, మహబూబ్‌నగర్ 4, ఖమ్మం 2, మెదక్, కరీంనగర్, నిజామాబాదు, నల్గొండ జిల్లాలకు చెందిన ఒక్కో వ్యాసం కొత్తగా ఈ మాసంలో సృష్టించబడింది. వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొత్త వ్యాసాలు రాలేవు.
- సభ్యుల వారీగా చూస్తే నేను (సి.చంద్రకాంతరావు) 15 వ్యాసాలను సృష్టించగా, ప్రణయ్‌రాజ్ 2, మల్లాది విద్యారణ్య, ప్రవీణ్, వైజాసత్య, రాజశేఖర్, సుల్తాన్ ఖాదర్ ఒక్కో వ్యాసాన్ని సృష్టించారు.
- 22 వ్యాసాలలో 20 వ్యాసాలు ప్రాజెక్టు సభ్యులు సృష్టించగా, మరో 2 వ్యాసాలు ప్రాజెక్టులో సభ్యులు కాని వారిచే సృష్టించబడ్డాయి.
- ఈ మాసంలో తెలంగాణకు చెందిన పలు మూసలు సృష్టించబడి వాటిని సంబంధిత వ్యాసాలలో అతికించబడినవి.
- ఈ ప్రాజెక్టు పరిధిలో కీలకమైన తెలంగాణ వ్యాసం వీక్షణలలో రికార్డు సృష్టించింది. రెండు రోజులు తెవికీలోనే అత్యధిక వీక్షణలు జరిగిన వ్యాసంగానూ, ఫిబ్రవరి చివరివారంలో అత్యధిక వీక్షణలు జరిగిన వ్యాసంగానూ రికార్డులు సృష్టించింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:50, 2 మార్చి 2014 (UTC)
మార్చి 2014 మాసంలో ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ
మార్చు- మార్చి మాసంలో ఈ ప్రాజెక్టులో భాగంగా 35 వ్యాసాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇందులో 17 పురపాలక.నగర పంచాయతీలకు సంబంధించి కాగా, 16 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి. మరో 2 వ్యాసాలలో ఒకటి దేవాలయానికి మరొకటి పుస్తకానికి సంబంధించిన వ్యాసం. (ఏకవాక్య వ్యాసాలు, గ్రామ వ్యాసాలు మినహాయించి)
- జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యాసాలు అత్యధికంగా 12 వ్యాసాలు కొత్తగా చేరగా, కరీంనగర్ జిల్లా 6 వ్యాసాలతో రెండోస్థానంలో ఉంది. మెదక్ జిల్లా వ్యాసాలు 4, రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యాసాలు 3 చేరగా, వరంగల్, ఖమ్మం, నిజామాబాదు, హైదరాబాదు జిల్లా వ్యాసాలు 2 చొప్పున, ఆదిలాబాదు మరియు నల్గొండ జిల్లా వ్యాసాలు ఒక్కొక్కటి చొప్పున కొత్తగా చేరాయి. మొత్తంపై తెలంగాణకు చెందిన మొత్తం 10 జిల్లా వ్యాసాలు ఈ మాసంలో ప్రాజెక్టు పరిధిలో చేరాయి.
- సభ్యుల వారీగా చూస్తే నేను (సి.చంద్రకాంతరావు) 24 వ్యాసాలను సృష్టించగా, నాయుడుగారి జయన్న 6 వ్యాసాలు, పవన్ సంతోష్ 3 వ్యాసాలు, Mudigonda senapati మరియు సుల్తాన్ ఖాదర్ లు ఒక్కో వ్యాసాన్ని సృష్టించారు.
- 35 వ్యాసాలలో 25 వ్యాసాలు ప్రాజెక్టు సభ్యులు సృష్టించగా, మరో 10 వ్యాసాలు ప్రాజెక్టులో సభ్యులు కాని వారిచే సృష్టించబడ్డాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:02, 3 ఏప్రిల్ 2014 (UTC)
ఏప్రిల్ 2014 మాసంలో ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ
మార్చు- ఏప్రిల్ మాసంలో తెలంగాణ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా 13 వ్యాసాలు చేరాయి. ఇందులో 10 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి కాగా పుస్తకానికి, కోటకు, పురపాలక సంఘానికి చెందిన ఒక్కో వ్యాసం ఉంది.
- జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలకు చెందిన వ్యాసాలు మూడింటితో సంయుక్తంగా తొలి స్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా రెండు వ్యాసాలతో తర్వాతి స్థానంలో ఉంది. మెదక్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్గొండ జిల్లాలకు సంబంధించి ఒక్కో వ్యాసం సృష్టించబడ్డాయి. వరంగల్, ఖమ్మం, నిజామాబాదు జిల్లాకు చెందిన వ్యాసాలు ఈ మాసంలో రాలేవు.
- సభ్యుల వారీగా చూస్తే నేను (చంద్రకాంతరావు) 4 వ్యాసాలు సృష్టించగా, Pranayraj1985 3 వ్యాసాలు, పవన్ సంతోష్, సుల్తాన్ ఖాదర్, Kumarbittuyadav007, Chinnareddy435, Utoor , ఐపీ అడ్రస్/ అజ్ఞాత సభ్యుడు ఒక్కో కొత్త వ్యాసాన్ని ఆరంభించారు.
- 13 కొత్తవ్యాసాలలో 8 వ్యాసాలను ప్రాజెక్టు సభ్యులు సృష్టించగా, మరో 5 వ్యాసాలు ప్రాజెక్టులో సభ్యులు కానివారిచే సృష్టించబడ్డాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:32, 24 మే 2014 (UTC)
సెప్టెంబరు 2014 మాసంలో ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ
మార్చు- సెప్టెంబరు 2014 మాసంలో తెలంగాణ ప్రాజెక్టు పరిధిలో కొత్తగా 10 వ్యాసాలు సృష్టించబడ్డాయి. ఇందులో 4 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి కాగా 2 వ్యాసాలు అభయారణ్యాలకు చెందినవి.
- జిల్లాల వారీగా పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లా, వరంగల్ జిల్లాకు చెందిన చెరో 3 వ్యాసాలు, మెదక్, నిజామాబాదు, హైదరాబాదుకు చెందిన ఒక్కో వ్యాసము, మరో ఇతర వ్యాసం సృష్టించబడ్డాయి.
- సభ్యుల వారీగా చూస్తే R.Karthika Raju చే 4 వ్యాసాలు, Naidugari Jayanna మరియు వైజాసత్య లచే చెరో 3 వ్యాసాలు సృష్టించబడ్డాయి.
- మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన వందలాది గ్రామ వ్యాసాలలో ఖాళీవిభాగాలు తొలగించడం, వ్యాసాలను శుద్ధిచేయడం, సమాచారం చేర్చడం జరిగింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:42, 4 అక్టోబరు 2014 (UTC)