విక్రం బాత్రా
కెప్టెన్ విక్రం బాత్రా (పరమవీరచక్ర) (1974 సెప్టెంబరు 9 – 1999 జూలై 7) భారతీయ సైనికాధికారి. అతని మరణానంతరం భారత అత్యున్నత పురస్కారం పరమవీరచక్ర లభించింది.[2] అతను 1999లో భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాశ్మీర్ లోని కార్గిల్ లోజరిగిన యుద్ధంలో దేశానికి చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది.భారతదేశ చరిత్రలో క్లిష్టమైన పర్వతాలపై జరిపిన యుద్ధానికి నాయకత్వం వహించాడు.అతను కొన్నిసార్లు "షేర్ షా" గా పిలువబడేవాడు.[3]
కెప్టెన్ విక్రం బాత్రా పరమ వీర చక్ర | |
---|---|
మారుపేరు | షేర్ షా[1] |
జననం | పాలంపూర్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1974 సెప్టెంబరు 9
మరణం | 1999 జూలై 7 పాయింట్. 4875, కార్గిల్, జమ్ము & కాశ్మీర్, భారతదేశం | (వయసు 24)
రాజభక్తి | Republic of India |
సేవలు/శాఖ | Indian Army |
సేవా కాలం | 1996–1999 |
ర్యాంకు | Captain |
సర్వీసు సంఖ్య | IC 57556 |
యూనిట్ | 13 JAK RIF |
పోరాటాలు / యుద్ధాలు | కార్గిల్ యుద్ధం ఆపరేషన్ విజయ్ (1999) Battle of Tiger Hill |
పురస్కారాలు | పరమ వీర చక్ర |
ప్రారంభ జీవితం, వృత్తి
మార్చువిక్రం బాత్రా హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ కు సమీపంలోని గుగ్గర్ గ్రామంలో 1974 సెప్టెంబరు 9న జన్మించాడు. అతని ప్రాథమిక విద్యను ఉపాధ్యాయురాలైన తన తల్లి వద్ద అభ్యసించాడు. మాధ్యమిక విద్యను పాలంపూర్ లోని డి.ఎ.వి పబ్లిక్ స్కూలులోనూ, ఉన్నత విద్యను పాలంపూర్ లోని సెంట్రల్ స్కూల్ లోనూ అభ్యసించాడు. తరువాత అతను పాలంపూర్ లోని సెంట్రల్ స్కూలులో 1992లో 10+2 విద్యను అభ్యసించాడు. తరువాత డి.ఎ.వి కళాశాల, చండీఘర్ లో బి.ఎస్సీ చదివాడు. అక్కడ అతను రెండు జోన్లలో ఉత్తమ ఎన్.సి.సి. కాడెడ్ గా గుర్తింపబడ్డాడు.
తరువాత అతను భారత సైనిక దళం , డెహ్రాడూన్ లో 1996లో చేరాడు. జెస్సోర్ కంపెనీ ఆఫ్ మానేక్షా బెటాలియన్ లో చేరాడు. జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ నందుగల 13 జమ్మూ కాశ్మీర్ రైఫిస్ భారత దళానికి లెప్ట్ నెంట్ గా పనిచేసాడు. అతను కెప్టెన్ గా పదోన్నతి పొందాడు. [4]
ఉల్లేఖనలు
మార్చు- "Either I will come back after hoisting the Tricolour (Indian flag), or I will come back wrapped in it, but I will be back for sure."
- "Yeh Dil Maange More! (My heart asks for more!)"
- "Don't worry about us, Pray for your safety."
- Batra's last words were the battle-cry "Jai Mata Di!" ("Victory to Mother Durga!" in Dogri/ Punjabi)"[5]
మూలాలు
మార్చు- ↑ 'Yeh Dil Maange More'..Remembering Captain Vikram Batra, NDTV, retrieved 9 September 2014
- ↑ "Kargil Update: Indian Army". Param Vir Chakra. Ministry of Defence, Government of India. Archived from the original on 25 జనవరి 2010. Retrieved 26 July 2010.
- ↑ Gandhi, Anshul (7 July 2015). "The Story Of Vikram Batra Aka Sher Shah Who Gave His Life In Kargil War For The Nation". MensXP.com. Retrieved 9 June 2016.
- ↑ Archana Masih; Dominic Xavier; Rajesh Karkera (17 June 2004). "The soldier who became a legend". Rediff.com. Retrieved 26 July 2010.
- ↑ http://m.youtube.com/watch?v=H23SvcJQ7Ps