విజయనగర జిల్లా

దక్షిణ భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా.

విజయనగర జిల్లా, దక్షిణ భారతదేశం, కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా.ఇది కల్యాణ-కర్ణాటక ప్రాంతంలో ఉంది.[1][2] విజయనగర నగరం దీని ప్రధాన కార్యాలయం. విజయనగర అధికారికంగా బళ్లారి నుండి 2021 అక్టోబరు 2న అధికారికంగా రూపొందించబడింది. విజయనగర జిల్లా కేంద్రంగా రాష్ట్రంలో 31వ జిల్లాగా అవతరించింది.[3][4] ఇది ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్యం పూర్వ రాజధాని హంపికి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, అనేక చారిత్రక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి.[5]

Vijayanagara district
Hampi Bazaar from Matanga Hill, Kalleshwara Temple Temple at Bagali, Temples on Hemakuta Hill, Tungabhadra Dam, Kalleshwara Temple at Hirehadagalli
Location in Karnataka
Location in Karnataka
Country India
StateKarnataka
DivisionKalaburagi
Formation2 అక్టోబరు 2021
(3 సంవత్సరాల క్రితం)
 (2021-10-02)
Named forVijayanagara Empire
HeadquartersVijayanagara
Taluks
Government
 • BodyVijayanagara Zilla Panchayat
 • Deputy CommissionerVenkatesh T, IAS
 • Superintendent of PoliceShrihari Babu B L, IPS
 • Chief Executive OfficerSadashiva Prabhu B
విస్తీర్ణం
 • Total4,252 కి.మీ2 (642 చ. మై)
Elevation
449 మీ (1,473 అ.)
జనాభా
 (2011)
 • Total13,53,628
 • జనసాంద్రత320/కి.మీ2 (2,100/చ. మై.)
Language
 • OfficialKannada
Time zoneUTC+౦5:30 (IST)
Telephone codeHospet 08394
Vehicle registrationKA-35

చరిత్ర

మార్చు

చివరి మధ్యయుగ భారతదేశంలో, ప్రస్తుత విజయనగర జిల్లాతో కూడిన ప్రాంతం విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా ఉంది. బ్రిటిష్ పాలనలో ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాష్ట్రాల ఏర్పాటు సమయంలో,1953లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో,విజయనగర ప్రాంతం కొత్తగా ఏర్పడిన మైసూర్ రాష్ట్రం లోని బళ్లారి జిల్లాలో భాగమైంది. 2020లో బళ్లారి నుంచి ఆరు ఉప పరిపాలనా విభాగాలను విభజించి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.2020లో బి.ఎస్.యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో, కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రణాళికను ఆమోదించింది. 2020 నవంబరు 18న విజయనగర జిల్లా ఏర్పాటుకు ప్రకటనను వెలువరించింది. తద్వారా ఇది కర్ణాటకలోని 31వ జిల్లాగా మారింది. ప్రస్తుతం విజయనగర జిల్లా కల్యాణ కర్ణాటక ప్రాంతంలో ఒక భాగంగా ఉంది.

పరిపాలన

మార్చు

విజయనగర జిల్లాలో ఆరు ఉపపరిపాలనా విభాగాలు ఉన్నాయి. రెండు ఉపవిభాగాలు,18 గ్రామ సమూహాలు ఉన్నాయి.హోసపేట జిల్లా పరిపాలనా కేంద్రంగా ఉంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం,విజయనగర శాసనసభ సభ్యుడు ఆనంద్‌సింగ్‌ను విజయనగర జిల్లా వ్యవహారాల బాభ్యతలు పర్వేక్షణ మంత్రిగా నియమించింది.

లోక్‌సభ, శాసనసభ స్థానాలు

మార్చు

జాతీయ శాసనసభ లోక్‌సభలో,దావణగెరె నియోజకవర్గంలో భాగమైన హరపనహళ్లి మినహా విజయనగర జిల్లా బళ్లారి లోక్‌సభ నియోజకవర్గంలో ( షెడ్యూల్డ్ తెగలకు కేటాయింపు) భాగం.

రాష్ట్ర శాసనసభ దిగువ సభలో, విజయనగర జిల్లాకు చెందిన హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి (షెడ్యూల్డ్ కులాలు), విజయనగర, కుడ్లిగి (షెడ్యూల్డ్ తెగలు), హడగల్లి (షెడ్యూల్డ్ కులాలు) అనే ఐదు శాసనసభ స్థానాలు ఉన్నాయి:

జనాభా శాస్త్రం

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు విజయనగర జిల్లా పరిధిలో మొత్తం 13,53,628 మంది జనాభాను కలిగి ఉంది.అందులో 3,59,694 (26.57%) మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. విజయనగర జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 976 మంది స్త్రీల లింగ నిష్పత్తిని కలిగి ఉంది. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 3,22,603 (23.83%) మంది, 2,35,724 (17.41%) మంది ఉన్నారు.[6][7]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 78.09% కన్నడ, 9.37% ఉర్దూ, 5.82% లంబాడీ, 3.97% తెలుగు, 1.07% శాతం మంది ఉన్నారు. మొదటి భాషగా తమిళం మాట్లాడతారు.[8]

పర్యాటక

మార్చు
  • తుంగభద్ర అనకట్ట, హోస్పేట్ లో, తుంగభద్ర నది మీదుగా
  • హంపి:విజయనగర శిథిలాలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రజలను ఆకర్షించే ప్రపంచ వారసత్వ ప్రదేశం ఈ జిల్లాలో ఉంది. ఇది అనేక శిథిలమైన నిర్మాణాలకు నిలయం.
  • మైలార: మైలార లింగేశ్వర దేవాలయం మైలార దేవుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం.ఇది శ్రీకృష్ణుని రూపంగా నమ్ముతారు. ఇది విజయనగర జిల్లాలోని హూవినా హడగలి తీవ్ర నైరుతి మూలలో ఉంది.
  • తుంగభద్ర నది: పర్యాటకుల వీక్షణ ప్రదేశం
  • మకనడకు కుడ్లిగి తాలూకాలో ఉన్న మారుమూల గ్రామం, విజయనగర సామ్రాజ్య కాలంలో వివిధ పాలెగాళ్లకు అధిష్టానం చేసిన విశిష్టమైన ఉగ్ర నరసింహుడు, కంచబాలేశ్వర ఆలయానికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఇది అద్భుతమైన ఆలయం విజయనగర ఆలయ శైలి గోపురాలతో అందరినీ ఆకర్షిస్తుంది.
  • కొత్తూరు: శ్రీ గురు కొత్తూరుబసవేశ్వర దేవాలయం, శ్రీ గురు బసవేశ్వరునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. విజయనగర జిల్లా, కొత్తూరు పట్టణంలో ఉంది.
  • బగలి, హరపనహళ్లి: బగలి బసవేశ్వరుడు పురాతన కాలం నుంచి హిందూ దేవాలయం. ఇది చాలా ఆకర్షణీయమైన ప్రదేశం. విజయనగరం జిల్లా హరపనహళ్లి నగరానికి 8 కి.మీ దూరంలో హోస్పేట్ ప్రధాన మార్గం లోని రాష్ట్ర రహదారి -25 సమీపంలో ఉంది.

చదువు

మార్చు

కన్నడ విశ్వవిద్యాలయం,పరిశోధన-ఆధారిత ప్రభుత్వ విశ్వవిద్యాలయం, హంపిలో ఉంది.ఈ విశ్వవిద్యాలయం కన్నడ భాషను అభివృద్ధి చేయడం, దాని సాహిత్యం, సంప్రదాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎస్. బంగారప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వంచే స్థాపించబడింది.

మూలాలు

మార్చు
  1. "Vijayanagar to be Karnataka's 31st district, BSY Cabinet gives in-principle nod". The New Indian Express. 19 November 2020. Retrieved 24 January 2021.
  2. "Cabinet approves boundaries of Vijayanagara district". The Hindu. 28 November 2020. Retrieved 24 January 2021.
  3. "Bommai to declare Vijayanagara as 31st district in Karnataka on Saturday". The New Indian Express. 2 October 2021. Retrieved 1 April 2022.
  4. "Karnataka formalises creation of new Vijayanagara district". The Economic Times. 27 November 2020. Retrieved 24 January 2021.
  5. Buradikatti, Kumar (19 November 2020). "Ballari set to lose Hampi and more". The Hindu. Retrieved 24 January 2021.
  6. "District Census Handbook: Bellary" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  7. "District Census Handbook: Davanagere" (PDF). censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. 2011.
  8. "Table C-16 Population by Mother Tongue: Karnataka". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.

వెలుపలి లంకెలు

మార్చు