ఈ చిత్రం మే 21,1966లో విడుదలైయింది.[1] ఈ సినిమాని సుజాత చిత్ర బ్యానర్‌పై కనకమేడల నిర్మించాడు.

విజయశంఖం
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.వి.నందనరావు
నిర్మాణ సంస్థ సుజాత చిత్ర
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

భీము బందిపోటు. పచ్చినెత్తురు తాగే మనిషి. కత్తియుద్ధంలో సాటిలేని వీరుడు. మంత్రి ప్రోత్సాహంతో మహారాజునే హత్యచేసి రాజభవనాన్ని కొల్లగొడతాడు. ఆ అదనులో చిన్నపిల్ల రాకుమారి భీము గూడెం చేరుతుంది. భీమూ కొడుకు విజయ్ ఆ పిల్ల తండ్రిని తీసుకువస్తానని బయలుదేరి అడవిలో పడిపోయి అన్నీ మరచిపోయి మహారాణి ఆశ్రయం పొందుతాడు. తన సౌభాగ్యాన్ని కొల్లగొట్టిన దుర్మార్గుని మీద పగతీర్చుకోవాలని మహారాణి తన వద్ద చేరిన విజయ్‌ను పెంచి మహావీరుణ్ణి చేస్తుంది. తాను పొందుదామనుకున్న సింహాసనం ఆ వీరుడికి పోతుందేమోనని భయపడి మంత్రి మోసంతో రాణిని, విజయ్‌ను బంధిస్తాడు. కానీ విజయ్ ఖైదు నుండి తప్పించుకుంటాడు. కొడుకు తప్పిపోయిన బెంగతో భీమూ రాకుమారి కళ్యాణినే కన్నకూతురిలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పిల్ల భీమూతో దోపిడీలు, హత్యలు మాన్పించి అతణ్ణి మంచివాడిగా చేస్తుంది. అడవిలో అకస్మాత్తుగా కలిసిన విజయ్, కళ్యాణిలు పరస్పరం ప్రేమించుకుంటారు. మంచివాడుగా మారిన భీమూ ద్వారా విజయ్‌ను చంపించడానికి మంత్రి ప్రయత్నిస్తాడు. కానీ విజయ్ మహావీరుడని గ్రహించిన భీమూ అతడికి కళ్యాణిని ఇచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరిస్తాడు. ఈ సంగతి తెలిసిన మంత్రి భీమూని కోటకు రప్పించి బంధిస్తాడు. కోటను ముట్టడించి విజయ్, కళ్యాణి భీమును, మహారాణిని చెర నుండి విడిపిస్తారు. అక్కడే విజయ్ చేతిలో మంత్రి మరణిస్తాడు. మహారాజ హంతకుడిని బంధించి తీసుకురమ్మని మహారాణి విజయ్‌ను కోరుతుంది. భీమూయే ఆ వ్యక్తి అని విజయ్‌కు తెలుస్తుంది. విజయ్, భీమూల మధ్య భీకరమైన కత్తియుద్ధం జరుగుతుంది. ఆ పోరాటంలో ఏదో ఒక గుర్తు ద్వారా విజయ్ తన కొడుకేనని గుర్తుపడతాడు భీమూ. తనకు లొంగిపోయిన భీమూను తీసుకుని మహారాణి వద్దకు వెళతాడు విజయ్. మహారాణి అతడికి మరణశిక్ష విధిస్తుంది. భీమూ మహారాణికి కళ్యాణి ఆమె కూతురే అనే రహస్యాన్ని వెల్లడిస్తాడు. భీమూ మరణశిక్షను రద్దు చేయించడానికి కళ్యాణి ప్రయత్నిస్తుంది. కానీ మహారాణి అంగీకరించదు. భీమూ తన తండ్రే అని తెలిసి విజయ్ బాధపడతాడు. చివరకు ఉరికంబానికి భీమూను తీసుకువెళతారు. భీమూ ఉరితీయబడ్డాడా లేదా అనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది.[2]

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు బి.గోపాలం సంగీతం సమకూర్చాడు.[2]

క్ర.సం పాట గాయకులు రచయిత
1 ఇంద్రజాలం మహేంద్రజాలం ఇంద్రజాలం మహేంద్రజాలం బి.గోపాలం, ఎస్.జానకి కనకమేడల
2 వచ్చావులే నచ్చావులే మా యింటికీ వన్నె తెచ్చావులే మా కంటికీ వెలుగు నిచ్చావులే పి.సుశీల కనకమేడల
3 దారికాచి వేచినానురా రేయిబవలు చూచినానురా పి.సుశీల కె.జి.వసంతాదేవి
4 తుంటరి చిన్నవాడా ఈ కొంటెతనమ్మేలా కన్నెను నన్నూ విడకున్నా తగదనినా పి.బి.శ్రీనివాస్, పి.సుశీల కనకమేడల
5 అదే అదే వద్దంటా పదే పదే చెబుతుంటా అందాల నా గుంటా ఆశలా నా పంటా మాధవపెద్ది సత్యం శంకరంబాడి సుందరాచారి
6 పరవళ్లు తొక్కేను నా మనసూ పరవశమందేను నా ఒళ్లూ పి.సుశీల కనకమేడల

విశేషాలు

మార్చు

ఈ చిత్రంలో ఒక పాటను రచించడం ద్వారా కె.జి.వసంతాదేవి "తొలి తెలుగు సినీ గేయరచయిత్రి"గా గుర్తింపు పొందింది.

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
  2. 2.0 2.1 కనకమేడల (1966). Vijaya Sankam (1966)-Song_Booklet (1 ed.). మద్రాసు: సుజాత చిత్ర. p. 10. Retrieved 23 July 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=విజయశంఖం&oldid=4209812" నుండి వెలికితీశారు