వినరో భాగ్యము విష్ణుకథ

వినరో భాగ్యము విష్ణుకథ 2023లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహించాడు.[1] కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 29న విడుదల చేయగా, సినిమా ఫిబ్రవరి 17న విడుదలైంది.[2]

వినరో భాగ్యము విష్ణుకథ
Vinaro Bhagyamu Vishnu Katha film.jpg
దర్శకత్వంమురళీ కిషోర్‌ అబ్బురూ
నిర్మాతబన్నీవాసు
నటవర్గంకిరణ్ అబ్బవరం
కాశ్మీరా పరదేశి
మురళి శర్మ
ఛాయాగ్రహణండానియెల్ విశ్వాస్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంచైత‌న్య భ‌ర‌ద్వాజ్
నిర్మాణ
సంస్థ
జీఏ2 పిక్చర్స్‌
విడుదల తేదీలు
2023 ఫిబ్రవరి 17 (2023-02-17)(థియేటర్)
2023 మార్చి 25 (2023-03-25)(నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

విష్ణు (కిర‌ణ్ అబ్బవ‌రం) తిరుప‌తి కుర్రాడు. చాలా మంచోడు. ద‌ర్శన (క‌శ్మీరా) ఓ యూట్యూబ‌ర్‌. సెలబ్రిటీ కావాలని తపించే దర్శన నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్ ద్వారా విష్ణు, మార్కేండేయ శ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ)ల‌ని క‌లిసి వీడియోలు చేస్తుంది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితిలో దర్శన ఓ హత్య కేసులో దోషిగా జైలుకి వెళుతుంది. ఆ కేసుని నుంచి దర్శనని విష్ణు ఎలా బయటికి తెస్తాడు ? సరదాగా యూట్యూబ్ వీడియోలో చేసుకునే దర్శన అసలు మర్డర్ కేసులో ఎలా ఇరుక్కుంటుంది ? ఆ తరువాత ఏమి జరిగింది అనేది మిగతా కథ.[3]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: జీఏ2 పిక్చర్స్‌
  • నిర్మాత: బన్నీవాసు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీ కిషోర్‌ అబ్బురూ
  • సంగీతం: చైత‌న్య భ‌ర‌ద్వాజ్
  • సినిమాటోగ్రఫీ: డానియెల్ విశ్వాస్
  • ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
  • ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్

మూలాలుసవరించు

  1. Eenadu (15 July 2022). "చూడరో భాగ్యము.. విష్ణుకథ". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. Namasthe Telangana (30 October 2022). "ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము విష్ణుకథ'". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. Eenadu (18 February 2023). "రివ్యూ: వినరో భాగ్యము విష్ణు కథ". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  4. The New Indian Express (14 April 2022). "Yash Shetty makes his Tollywood entry with Vinaro Bhagyamu Vishnukatha" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.

బయటి లింకులుసవరించు