విశ్వనాథపల్లి (కోడూరు)

భారతదేశంలోని గ్రామం

విశ్వనాథపల్లి, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 121., ఎస్.టి.డి.కోడ్ = 08671.

విశ్వనాథపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
విశ్వనాథపల్లి is located in Andhra Pradesh
విశ్వనాథపల్లి
విశ్వనాథపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°02′36″N 80°59′53″E / 16.043256°N 80.997981°E / 16.043256; 80.997981
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి తోట నాగేశ్వరమ్మ
జనాభా (2001)
 - మొత్తం 5,908
 - పురుషులు 3,021
 - స్త్రీలు 2,887
 - గృహాల సంఖ్య 1,803
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ పూర్వీకులు తరతరాల నాడు ఎప్పుడో కాశీకి వెళ్ళి అక్కడి నుంచి శివలింగం తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించడంతో ఈ ప్రాంతంలో ఏర్పడ్డ ఊరికి విశ్వనాథపల్లి అని పేరు, ఆ వంశస్థులకు "విశ్వనాథ" అని ఇంటిపేరు ఏర్పడింది.[1]

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుదివాడ

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కొత్తమాజేరు, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 79 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కుమ్మరిపాలెం

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. కుమ్మరిపాలెం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తోట నాగేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

ఈ గ్రామంలో కృష్ణానదీ తీరంలో కొలువైయున్న శ్రీ బీబీనాంచారమ్మ తల్లి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో, 15 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆ సమయంలో కృష్ణా జిల్లా నుండే గాక చుట్టుప్రక్కల జిల్లాల నుండి గూడా భక్తులుఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. [3] శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయ 20వ వార్షికోత్సవాల సందర్భంగా, 2016, ఫిబ్రవరి-22, మాఘ పౌర్ణమి, సోమవారంనాడు, అమ్మవారి కళ్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించెదరు. [6]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ తోట వెంకటసుబ్బారావు, సీత దంపతుల కుమారుడు శ్రీ కృష్ణసుమంత్, ఆగస్టు-2015లో ఎన్.టి.అర్.వైద్య, అరోగ్య విశ్వవిద్యాలయం, ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన సూపర్ స్పెషలిటీ యురాలజీ ప్రవేశపరీక్షలో, అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమస్థానాన్నీ, ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయస్థానాన్నీ సాధించాడు. [5]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6384.[3] ఇందులో పురుషుల సంఖ్య 3207, స్త్రీల సంఖ్య 3177, గ్రామంలో నివాస గృహాలు 1685 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1739 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. గంగప్ప, ఎస్. (మే 1987). వేయిపడగలు - విశ్లేషణాత్మక విమర్శ.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Viswanathapalli". Retrieved 27 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులుసవరించు

[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013, మార్చి-27; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-1; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-16; 42వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-18; 1వపేజీ.