విష్ణుప్రియ గాంధీ

విష్ణుప్రియ గాంధీ (జననం 1989 డిసెంబరు 13) భారతీయ నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె దివంగత నటి సిల్క్ స్మితతో తన విశేషమైన సారూప్యత కారణంగా జూనియర్ సిల్క్ స్మితగా ప్రసిద్ధి చెందింది.

విష్ణుప్రియ గాంధీ
జననం (1989-12-13) 1989 డిసెంబరు 13 (వయసు 34)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2023 - ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • గాంధీ వల్లువర్ (తండ్రి)

2023లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన యాక్ష‌న్ డ్రామా సినిమా మార్క్ ఆంటోనిలో ఆమె సిల్క్ స్మిత పాత్రను పోషించింది.[1] దీనికి ప్రధాన కారణం ఆమె సిల్క్ స్మిత పోలికలతో ఉండడమే. అయితే ఈ చిత్రంలో ఆ పాత్రను మరింత మెరుగుపరచడానికి మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉపయోగించబడ్డాయి.[2][3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

విష్ణు ప్రియ 1989 డిసెంబరు 13న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించింది. ఆమె శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

కెరీర్

మార్చు

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఆమె బోల్డ్, గ్లామరస్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన దివంగత దక్షిణ భారత నటి సిల్క్ స్మితతో అసాధారణమైన పోలికతో అకస్మాత్తుగా పలువురి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, ఆమెను మే 2022లో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తన మార్క్ ఆంటోనీ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. ఇది 2023 సెప్టెంబరు 15న పాన్ ఇండియా చిత్రంగా విడుదలై చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త తార అరంగేట్రం చేసింది. మార్క్ ఆంటోనీ, ఆమెకు మొదటి చిత్రంతోనే ప్రముఖ తారలు విశాల్, ఎస్.జె.సూర్యలతో కలిసి నటించే అవకాశం దక్కింది. సిల్క్ స్మిత పాత్రలో ఆమె జి.వి. ప్రకాష్ రీమిక్స్ చేసిన స్పెషల్ సాంగ్ తో రాత్రికి రాత్రే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని స్టార్‌డమ్‌ని పొందింది.

మూలాలు

మార్చు
  1. A. B. P. Desam (15 August 2023). "విశాల్ 'మార్క్ ఆంథోని' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
  2. "Recreation of late Silk Smitha; Vishal-starrer Mark Antony's trailer goes viral". Mathrubhumi. 5 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 14 September 2023.
  3. "Vishal Shares Recreating Silk Smitha in Mark Antony Cost a Bomb: 'Didn't Want to Misuse...' | Exclusive". News18. 6 September 2023. Archived from the original on 14 September 2023. Retrieved 14 September 2023.