వి.ఎస్. విజయరాఘవన్

వి.ఎస్. విజయరాఘవన్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలక్కాడ్ నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

వి.ఎస్. విజయరాఘవన్‌

పదవీ కాలం
1991 - 1996
ముందు ఎ. విజయరాఘవన్
తరువాత ఎన్.ఎన్. కృష్ణదాస్
నియోజకవర్గం పాలక్కాడ్

పదవీ కాలం
1980 - 1989
ముందు ఎ. సున్నాసాహిబ్
తరువాత ఎ. విజయరాఘవన్
నియోజకవర్గం పాలక్కాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1941-11-22) 1941 నవంబరు 22 (వయసు 82)
ఎరిమయూర్, పాలక్కాడ్, కేరళ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు విజి సుకుమారన్, రుగ్మిణి
జీవిత భాగస్వామి సౌమిని విజయరాఘవన్
సంతానం ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు
నివాసం ఎరిమయూర్
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

విజయరాఘవన్‌ కోజికోడ్‌లోని దేవగిరి హైస్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నప్పుడు కేరళలో ఓరానా సమ్మె ద్వారా ప్రజా రంగలోకి అడుగుపెట్టి 1956లో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బూత్ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1969లో కాంగ్రెస్ పార్టీ అఖిల భారత ప్రాతిపదికన చీలిపోయినప్పుడు, ఇందిరా గాంధీతో (ఐ) గ్రూపులో ఉన్న కేరళలో నాయకుడు కె. కరుణాకరన్‌కు విధేయుడిగా ఉన్నాడు.

విజయరాఘవన్‌ 1977లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌పై అలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 1980, 1984 & 1991లో పాలక్కాడ్ నుండి మూడుసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 25 సంవత్సరాల పాటు పాలక్కాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుడిగా , కొబ్బరిబోర్డు ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు. విజయరాఘవన్‌ 1989, 1996, 1998 & 2004లో పాలక్కాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

నిర్వహించిన పాడవులు

మార్చు
  • 1956 : కాంగ్రెస్ పార్టీ సభ్యుడు
  • 1965 : కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు
  • 1969-1978 : పాలక్కాడ్ జిల్లా ఉపాధ్యక్షుడు
  • 1980 : లో‍క్‍సభ సభ్యుడు
  • 1980-1983 : పాలక్కాడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
  • 1984 : లో‍క్‍సభ సభ్యుడు & కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
  • 1984-1987 : కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు
  • 1987-2007 : పాలక్కాడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
  • 1991: లో‍క్‍సభ సభ్యుడు

మూలాలు

మార్చు
  1. The Hindu (1 April 2024). "A triangular fight for supremacy in Palakkad" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
  2. The Times of India (22 November 2021). "Kerala CM, senior leaders greet Congress veteran VS Vijayaraghavan". Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.