వీరారెడ్డి పల్లి

(వీరారెడ్డి పల్లె నుండి దారిమార్పు చెందింది)

వీరారెడ్డి పల్లి, కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. వీరారెడ్ది పల్లె ఇది ఆళ్లగడ్ద తాలూకా లోని శిరివెల్ల మండలంలోని ఒక చిన్న గ్రామం ఇక్కడి ప్రజలందరు వేరు వేరు జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని అందరూ కలసి కట్టుగా జీవిస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా గుంటూరు జిల్లా నుండి వలస వచి స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్నారు.

వీరారెడ్డి పల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
వీరారెడ్డి పల్లి is located in Andhra Pradesh
వీరారెడ్డి పల్లి
వీరారెడ్డి పల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°19′00″N 78°32′00″E / 15.3167°N 78.5333°E / 15.3167; 78.5333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం శిరివెళ్ళ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 518502
ఎస్.టి.డి కోడ్

చరిత్ర, విశేషాలు మార్చు

ఇక్కడికి సుమారు 70 సంవత్సరాల క్రితం వీరారెడ్డి అనే రైతు వలస వచ్చి నివాసం ఏర్పరచుకొని ఇక్కడి బీడు భూమిని సాగు చేసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతని తరువాత క్రమేణా చాలా మంది ఎక్కడికి వచ్చి పొలాలు కొనుగోలు చేసి వాటిని సాగు చేస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. ఇక్కడికి కొత్తగా వలస వచ్చిన వారికి వీరారెడ్డి వారికి ఆవాసం కల్పించి వారు ఇక్కడ స్థిరపడే వరకు వారికి ఆసరాగా ఉండేవాడు.అతని పేరు మీదనే ఈ గ్రామానికి " వీరారెడ్డి పల్లి " అను పేరు వచ్చింది. ఈ గ్రామానికి గ్రామ పంచాయతి లేకపోయినప్పటికి గ్రామ ప్రజలందరు కలసి కట్టుగా గ్రామాన్ని క్రమేణా అభివృద్ధి చేసుకుంటూ వారికి కావలసిన సదుపాయాల్ని వారే సమకూర్చుకుంటు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ చుట్టుప్రక్కల గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామం 2 గ్రామపంచాయతీలకు అనుబంధంగా వుంది. అవి కూడా ఒకటి శిరివెళ్ళ మండల పంచాయతి క్రింద సగభాగం, కోటపాడు గ్రామ పంచాయతికి సగభాగంగా ఉంటున్నప్పటికి ప్రజలంతా ఏక తాటి పై వుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ గ్రామంలో సుమారు 1500 మంది నివసిస్తున్నారు. వారిలో సుమారు 1250 మంది పెద్దలు కాగా సుమారు 250 మంది పిల్లలు ఉన్నారు.

పంటలు మార్చు

ఇక్కడి ప్రధాన పంట వరి ఈ గ్రామ ప్రజలు సుమారు 1300 ఎకరాలలో వరి పంటను సాగు చేసి సుమారు ఒక్క ఎకరాకు 35 క్వింటాళ్ళ ప్రకారం 4500 టన్నుల దిగుమతిని సాధిస్తున్నారు. ఇక్కడి రైతులు ఎక్కువగ సన్న రకాలైన కర్నూలు సోన వంటి రకాలు ఎక్కువగా సాగు చేస్తూ వుంటారు. ఇక్కడ కర్నూలు-కడప కాలువ ద్వారా సాగు నీటి సదుపాయము ఉంది. ఈ నీటితో పాటు భూగర్బ జల సంపద కూడా పుష్కలంగా వుండటం వలన. బోర్లు, బావుల ద్వారా కూడా పంటలు సాగుచేసుకునే అవకాశం వుండటం వలన ఇక్కడి రైతులు ఖరీఫ్, రబి రెండు పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులను సాదిస్తున్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

బస్సు సౌకర్యం మార్చు

ఈ గ్రామంనకు నంద్యాల, కోవెలకుంట్ల నుండి బస్సు సౌకర్యం ఉంది. నంద్యాల నుండి లేదా ఆళ్ళగడ్డ నుండి బస్ లేదా ఆటోలలో శిరివెళ్ళ మెట్ట వద్దకు చేరుకుని అక్కడి నుండి యాళ్ళూరు వెళ్ళే అటోలలో కుడా ఈ గ్రామానికి చేరుకోవచ్చు.

దేవాలయాలు మార్చు

ఈ గ్రామంలో కళ్యాణ రామాలయము, కోదండ రామాలయము, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయము, గీతామందిరము, దత్తసాయి మందిరము ఉన్నాయి.

విద్యాసంస్థలు మార్చు

ఈ గ్రామంలో మండల పరిషత్తు పాథశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, ఒక ప్రైవేటు పాఠశాల కూడా ఉంది.

పసు సంపద మార్చు

ఈ గ్రామంలో పసు సంపద సంవ్రుద్దిగా ఉంది. ఎక్కడి రైతులు పశువులను పెంచి పోశించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామం నుండి నంద్యాలలోని పాలసేకరణ కేంద్రానికి పాలు చేరవేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు.

నీటీ సంపద మార్చు

ఈ గ్రామంలో భూగర్బ జల సంపద అధికంగా వుండటమే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాలతో పొల్చితే ఫ్లోరిన్ శాతం చాలా తక్కువగా వుండడం వలన ప్రజలు ఆరోగ్యంగా వుంటున్నారు. ఐనా స్థానిక యం.పి. యస్. పి.వ్య్.రెడ్డి గారి సహాయంతో 2,50,000 ఖర్చుతో శుద్ధ జల కర్మాగారాన్ని ఏర్పాటు చెసుకుని అతి థక్కువ ఖర్చుతో ఈ గ్రామ ప్రజలకే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకి కూడా సురక్క్షితమైన త్రాగు నీటిని అందిస్తున్నారు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు