వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి

వేదుల లక్ష్మీగణపతి శాస్త్రి కవి, అవధాని, కథా రచయిత, నాటక రచయిత, నటుడు. అతని తండ్రి వేదుల సూర్యనారాయణ శాస్త్రి సోమయాజి పీఠికాపుర ఆస్థాన విధ్వాంసుడు, సామవేద పండితుడు, నేత్రావధాని, తర్క వ్యాకరణ విజ్ఞాని[1].

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1929, జనవరి 18వ తేదీన పిఠాపురంలో వేదుల సూర్యనారాయణశాస్త్రి, సత్యసోమిదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు పిఠాపురం రాజా వారి కళాశాలలో గణిత శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్‌మెంట్ (ఐ.ఎల్.టి.డి.) సంస్థలో 1951లో ఉద్యోగిగా చేరి 37 సంవత్సరాలు ఆంధ్ర, మైసూరు, కర్ణాటక రాష్ట్రాలలో పనిచేశాడు.

ఇతడు 1942 నుండి వివిధ పత్రికలలో పద్యాలను, వ్యాసాలను, కథలను, నవలలను ప్రకటించాడు. "అశ్వని", "సత్యపుత్ర", "గన్‌పిట్" ఇతని కలం పేర్లు. "ఆదికవి నన్నయ్య అక్షర నీరాజనం", "శరణాగతి" ఇతని ముద్రిత గ్రంథాలు. ఇతనికి సాహితీ సింధువు, వేదోపనిషత్ సుధార్ణవ అనే బిరుదులు ఉన్నాయి.

ఇతడు 8వ యేట నుండే రంగస్థలంపై నటించడం ప్రారంభించాడు. అనేక చారిత్రక, పౌరాణిక, సాంఘిక నాటకాలలో నటించాడు. శారద, అల్లూరి సీతారామరాజు మొదలైన సినిమాలలో చిన్నచిన్న పాత్రలను ధరించాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో బి-గ్రేడ్ ఆర్టిస్టుగా ఉన్నాడు.

మూలాలుసవరించు

  1. "Aaramadravidulu". Aaramadravidulu. Retrieved 2020-04-15.[permanent dead link]