వేములూరిపాడు

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కుగ్రామం

వేములూరిపాడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వేములూరిపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
వేములూరిపాడు is located in Andhra Pradesh
వేములూరిపాడు
వేములూరిపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°17′55″N 80°17′59″E / 16.298715°N 80.299721°E / 16.298715; 80.299721
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ఫిరంగిపురం
ప్రభుత్వం
 - సర్పంచి దేవసోత్ గోవిందమ్మబాయి
పిన్ కోడ్ 522529
ఎస్.టి.డి కోడ్ 08641

ప్రముఖులు

మార్చు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ జలపాలేశ్వరస్వామివారి ఆలయం:-

  1. ఈ ఆలయం, వెలనాటి చోళులు కట్టించారని ఒక శాసనం ఆలయంలో ఉంది.
  2. ఈ ఆలయంలో 2014, డిసెంబరు-30న, విజయనగర రాజు అచ్యుతరాయల కాలం నాటి శిలాశాసనం బయట పడింది. అది ఐదు అడుగుల పొడవు, 20" వెడల్పు, 13"దళసరితో ఉంది. దానిమీద విజయనగరం రాజుల కాలం నాటి అక్షరాలు 27 పంక్తులతో చెక్కబడి ఉన్నాయి. ఆ కాలంలో ఒక సామంతరాజు తన తల్లిదండ్రులకోసం ఈ శాసనం వేయించినాడని ఉంది. అందులో కొండవీడుకు ఉత్తరాన ఉన్న ఒక వనం కోసం వేయించిన శాసనం అనుకుంటున్నారు. ఈ ఆలయం మాత్రం, వెలనాటి చోళులు కట్టించారని ఇంకొక శాసనం ఆలయంలో ఉంది.