వైకుంఠపాళి (సినిమా)
వైకుంఠపాళి 1975సెప్టెంబర్ 20 లో విడుదలైన తెలుగుసినిమా. మాధవీ ఆర్ట్స్ కంబైన్స్ నిర్మించిన ఈ చిత్రం లో శారద,రంగనాథ్,సత్యనారాయణ, రాజాబాబు,ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కె. బాపయ్య దర్శకుడు కాగా, సంగీతం కె వి మహదేవన్ అందించారు.
వైకుంఠపాళి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
నిర్మాణం | ఎం.రామకృష్ణారెడ్డి |
తారాగణం | శారద, రంగనాథ్, గుమ్మడి |
నిర్మాణ సంస్థ | మాధవీ ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శారద
- కె.విజయ
- జ్యోతిలక్ష్మి
- పుష్పలత
- శాంతాదేవి
- అరుణ
- రంగనాథ్
- గుమ్మడి
- నాగభూషణం
- కైకాల సత్యనారాయణ
- రాజబాబు
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య
- కె.వి.చలం
- సాక్షి రంగారావు
- రామదాసు
- రంజిత్ ప్రసాద్
- గోకిన రామారావు
సాంకేతికవర్గం
మార్చు- కథ, మాటలు, చిత్రానువాదం: పాలగుమ్మి పద్మరాజు
- పాటలు: ఆత్రేయ
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: పి.భాస్కరరావు
- కళ: భాస్కరరాజు
- నృత్యం: సుందరం, తార
- కూర్పు: నరసింహరావు
- దర్శకత్వం: కె.బాపయ్య
- నిర్మాత: ఎం.రామకృష్ణారెడ్డి
కథాసంగ్రహం
మార్చుసిరిపురం జమీందారు రాజాగారి భార్య జానకీదేవి ప్రసవవేదనతో మంచంపడితే వారి దూరపు బంధువు గౌరి ఆదుకొంది. అది మొదలు జానకీదేవికి సహాయంగా ఉంటూ వారి ఇంటిలోనే ఉంటూ వచ్చింది. గౌరి బి.ఎ. చదివింది. జమీందారు గారి ఏకైక వారసుడు బాబుకు తల్లి కంటే గౌరి దగ్గర చనువు ఎక్కువ. గౌరికి వేరే ఎక్కడో ఉద్యోగం వచ్చినా రాజా, జానకీదేవి మందలించి తమ వద్దే ఉండమన్నారు.
పట్నంలో ఉంటున్న రాజాగారి తమ్ముడు రాయుడు, వ్యాపారంలో నష్టపోయి అన్నగారి అండకోసం మళ్ళీ వచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు సహాయం అందజేసిన రాజా ఈ సారి తన లాయరు సోమసుందరం సలహా లేనిదే ఎటువంటి సహాయం చేయనని తమ్ముడితో ఖండితంగా చెప్పేశాడు. అన్న నిర్ణయంతో నిరాశ చెందిన రాయుడు మనసంతా ద్వేషంతో నిండిపోయింది.
వేటకని తన అన్నను అడవిలోకి తీసుకెళ్ళి పట్నం నుండి వచ్చిన తన మిత్రులు చిన్ని, కన్నలతో కలిసి అర్ధ్తరాత్రి వేళ రాజాను అతిదారుణంగా హత్యచేస్తాడు రాయుడు. ఇదంతా గమనించిన జీప్ డ్రైవర్ ముసలయ్యను కూడా హతమారుస్తాడు. ముసలయ్య కొన ఊపిరితో జమీందారు గారి ఇల్లు చేరి చినబాబును రక్షించమని, లాయర్ సహాయం అవసరమని ఇంకా ఏదో చెప్పబోతూ వాచీ వాచీ అంటూ ప్రాణం వదిలాడు. గౌరి విధిలేని పరిస్థితిలో స్పృహలేని జానకీదేవిని వదిలి బాబును రక్షించేందుకు బాబుతోపాటు పారిపోయింది.
గౌరి బాబుతో సహా అతికష్టం మీద లాయరుగారి ఇల్లు చేరుకుంది. అప్పటికే అక్కడ చేరుకున్న రాయుడి అనుచరులతో మాట్లాడుతున్న లాయర్, రాజా మరణం పట్ల సంతోషం వ్యక్తం చేయడం గౌరికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడ కూడా తనకు చుక్కెదురయ్యేసరికి, గత్యంతరం లేక ఆశ్రయం కోసం అదే లాయర్ ఇంటిలో తనెవరో చెప్పకుండా పనిమనిషిగా చేరింది.
కాని లాయరుగారి అబ్బాయి వాసు, తనకు రైల్లో తారసపడ్డ గౌరి, తన ఇంట్లోనే పనిమనిషిగా ఎదురయ్యేసరికి అనుమానించాడు. కొన్నాళ్ళకు గౌరి మీద సదభిప్రాయం ఏర్పడడంతో ఆమె కష్టాల్లో వున్నదని గ్రహించి, సహాయం చేస్తానన్నాడు. కాని గౌరి అతని సహకారాన్ని తిరస్కరిస్తుంది.
రాయుడి అనుచరుల వల్ల ఒకసారి ప్రాణాపాయస్థితిలో వున్న గౌరిని వాసు ఆదుకొన్నాడు. వాసు మంచితనాన్ని అర్థం చేసుకొంది గౌరి. వాసు గౌరికి అండగా నిలిచాడు.
వాసు కూడా తన తండ్రిని అనుమానించసాగాడు. జమీందారు హత్యలో తన తండ్రికి కూడా భాగం ఉందని నిశ్చయించుకొన్నాడు. అసలు విషయం తెలుసుకునేందుకు రాయుడు కూతురు చిట్టిని ప్రేమించినట్లు నటించసాగాడు. మెజిష్ట్రేటుగారి అమ్మాయి బుజ్జి, వాసుకు అండగా నిలిచింది.
రాజా హత్య రహస్యం తెలుసుకుందామని గౌరి చేసిన ప్రయత్నాలు ఫలించకుండానే ఆమె బాబుతో సహా రాయుడి చేతుల్లో చిక్కుకు పోయింది.
లాయరు సోమసుందరం ఒక్కసారిగా తన నిజస్వరూపం చూపించాడు. రాజా పాకెట్ వాచ్ సంపాదించి అందులో రాజా చనిపోయేటప్పుడు వ్రాసిన కాగితం పోలీసులకు చూపించాడు.
బాబును లోయలో విసరబోతున్న రాయుడిని ఎదిరించి వాసు తన ధైరసాహసాలతో గౌరిని బాబును రక్షించాడు. లాయరు మంచితనం వల్ల రాయుడు అనుచరులతో సహా పట్టుబడ్డాడు.[1]
పాటలు
మార్చుఈ సినిమాలో ఈ క్రింది పాటలున్నాయి[2].
- గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు నాకు తెలిసిందే గౌరమ్మా- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- జాగరత్త జాగరత్త జాగరత్తరోయి జాగరత్త కొండ శివర - ఎల్.ఆర్.ఈశ్వరి
- ట్వింకిల్ ట్వింకిల్ సింపుల్ డింపుల్ బ్యూటిఫుల్ - మాధవపెద్ది రమేష్, సావిత్రి
- దాక్కో దాక్కో దాక్కో కౌగిల్లో దాక్కో కళ్ళల్లో దాక్కో - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- నారాయణ నారాయణ నక్కతోక నామొగుడు తెచ్చాడు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- నిదురపో బాబు నిదురపో కుదురులేని లోకమందు నిదుర ఒకటే - పి. సుశీల
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 August 1975). "వైకుంఠపాళి". విజయచిత్ర. 10 (2): 53–55.
- ↑ కొల్లూరి, భాస్కరరావు. "వైకుంఠపాళి". ఘంటసాల గళామృతము. Retrieved 3 June 2017.[permanent dead link]