శకుంతల (1966 సినిమా)

శకుంతల, మార్చి, 23,1966లో విడుదలైన ఒక తెలుగు సినిమా.[1]పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నందమూరి తారకరామారావు, బి. సరోజా దేవి, నాగయ్య ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

శకుంతల
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం శ్రీధరరావు,
లక్ష్మీరాజ్యం
తారాగణం నందమూరి తారక రామారావు (దుష్యంతుడు),
బి.సరోజాదేవి (శకుంతల),
నాగయ్య (కణ్వుడు),
పద్మనాభం (మాదవ్వ),
రేలంగి (బెస్తవాడు),
రమణారెడ్డి (బెస్తవాడు),
గీతాంజలి (అనసూయ),
శారద (ప్రియంవద),
బేబి పద్మిని (భరతుడు),
ముక్కామల (విశ్వామిత్రుడు)
సంగీతం ఘంటసాల
గీతరచన సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, దాశరథి, కొసరాజు
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం ఎం.ఎ.రహ్మాన్
నిర్మాణ సంస్థ రాజ్యం పిక్చర్స్
భాష తెలుగు

ప్రసిద్ధమైన కాళిదాసు సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. నర్తనశాల, హరిశ్చంద్ర సినిమాలు ఘన విజయం సాధించిన వెంటనే రాజ్యం పిక్చర్స్ వారు ఎన్.టి.ఆర్.తో మరొక సినిమా నిర్మాణానికి పూనుకొన్నారు. ముందుగా "నల దమయంతి" సినిమా తీద్దామని అనుకొన్నారు కాని ఆ కథలో "శని ప్రభావం" అధికంగా ఉన్నదని భావించి ఆ ప్రయత్నం విరమించుకొన్నారట. సినిమా భారీ తారాగణంతో, అన్ని హంగులతో తీశారు. విమర్శకులు మెచ్చుకొన్నారు. భరతునిగా బేబీ పద్మిని అభినయం, వన్యమృగాలతో నిర్భీతిగా నటించిన తీరు అందరినీ ఆకట్టుకొంది. కాని సామాన్య ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

పాటలు

మార్చు
  1. అనాఘ్రాతం పుష్పం సిసలైమనోనం (కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
  2. అమ్మా శరణమ్మా ఇకనైన కరుణ గనవమ్మా ఓ అమ్మా - సుశీల , రచన: సముద్రాల సీనియర్
  3. అమ్మా శకుంతలా ఎందుకీ శోకము - పి.లీల , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
  4. ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మ అత్తవారింటికి - ఘంటసాల,సుశీల బృందం - రచన: సముద్రాల
  5. కనరా మునిశేఖరా నినుకోరి దరిచేరినానురా కనరా మునిశేఖరా - సుశీల, రచన: సముద్రాల సీనియర్
  6. చల్లనివై శ్రమంబుడుపజాలిన తామర (పద్యం) - ఘంటసాల - రచన: కందుకూరి వీరేశలింగం
  7. చెలియ నీమేను తపియింపజేయుగాను పంచబాణుడు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
  8. చెలులారా శకుంతల శ్రీమంతము సేయరే - పి. లీల బృందం , రచన: సముద్రాల సీనియర్
  9. తరతమ భేదంబు తలపక ధర్మము ముద్గాటించు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
  10. నమ్మి నీమాట తన మనమ్మున - ఘంటసాల - రచన: సముద్రాల
  11. నాకంటి పాపవైనా నా ఇంటిదీపమైనా నీవే సుకుమార రారా ఓ వీరా - సుశీల, రచన: దాశరథి
  12. నిర్దయా నిదయా నీమనంబేమో నేనెరుంగ (పద్యం) - సుశీల , రచన: సముద్రాల సీనియర్
  13. నీవు నేనూ కలసిననాడే నింగి నేల కలిసెనులే - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
  14. పాతకాలపు నాటి బ్రహ్మదేవుడు మా జాతకాలు - పిఠాపురం,మాధవపెద్ది బృందం , రచన:కొసరాజు
  15. మధుర మధుర సుమసీమ సుధలు కురియ వనసీమ - సుశీల బృందం, రచన: ఆరుద్ర
  16. మదిలో మౌనముగా కదలె మధుర వీణా మదిలో - ఘంటసాల - రచన: డా॥ సినారె
  17. యశ్శివోనామరూపాభ్యాం (శ్లోకం) ఘంటసాల , రచన:కాళిదాస కృతం
  18. యా స్సత్సద్వే శకుంతలేసి హృదయం ( కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
  19. శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు ఉన్నది మనసు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  20. సదా శివ శిరోరత్నం శ్వేతవర్ణం నిశాకరం ( కాళీదాసు శ్లోకం) - ఘంటసాల
  21. సరసన నీవుంటే జాబిలి నాకేల మనసున నీవుంటే - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె

ఈ చిత్రంలో కాళిదాసు శ్లోకాలతో పాటు కందుకూరి వీరేశలింగం వ్రాసిన "చల్లనివై శ్రమింపుడు" అన్న పద్యాన్ని వాడారు.

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సూర్య దినపత్రిక - 28 డిసెంబరు 2007లో "సూర్య చిత్ర" అనుబంధం వ్యాసం - వినాయకరావు రచన
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.