శాస్త్రీయ వర్గీకరణ

శాస్త్రీయ వర్గీకరణ జంతువులకు, మొక్కలకు చాలా ముఖ్యమైనది.

నవీన వర్గీకరణ.

వృక్ష వర్గీకరణసవరించు

వర్గీకరణ ఆవశ్యకతసవరించు

  1. ప్రపంచంలోని మొక్కల జాతులన్నింటి గురించి తెలుసుకోవడం.
  2. మొక్కల మధ్యగల సహజ బాంధవ్యాలను వ్యక్తీకరించే వర్గీకరణ వ్యవస్థలను రూపొందించడం.
  3. మొక్కలలోని వైవిధ్యాన్ని బయలు పరచి, పరిణామ శాస్త్రరీత్యా దాన్ని అర్ధవంతంగా అవగాహన చేసుకోవడం.
  4. వివిధ ప్రాంతాలలోని వృక్ష సంపదకు సంబంధించిన వివరాలను సేకరించడం.
  5. వృక్షశాస్త్ర విద్యార్థులకు ఈ దిశగా సరియైన అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం.

వర్గీకరణలోని ప్రమాణాలుసవరించు

  1. రాజ్యము (Kingdom)
  2. విభాగము (Division)
  3. ఉపవిభాగము (Subdivision)
  4. తరగతి (Class)
  5. ఉపతరగతి (Subclass)
  6. శ్రేణి (Series)
  7. క్రమము (Order)
  8. కుటుంబము (Family)
  9. ఉపకుటుంబము (Subfamily)
  10. తెగ (Tribe)
  11. ప్రజాతి (Genus)
  12. జాతి (Species)

వర్గీకరణలో రకాలుసవరించు

  • కృతక వర్గీకరణ: మొక్కలను సులువుగా పోల్చుకోదగిన స్థూలమైన లక్షణాల ఆధారంగా మొక్కలను వర్గీకరించడాన్ని కృతక వర్గీకరణ అంటారు. ఉదా1: మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించుట. ఉదా2: లిన్నేయస్ ప్రతిపాదించిన లైంగిక వర్గీకరణ విధానం.
  • సహజ వర్గీకరణ: మొక్కల మధ్యనున్న సహజ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మొక్కలను వర్గీకరించడాన్ని సహజ వర్గీకరణ అంటారు. ఉదా: బెంథామ్-హుకర్ వర్గీకరణ.
  • వర్గవికాస వర్గీకరణ: మొక్కల పుట్టుక, వాటి పరిణామ రీతులను ఆధారంగా తీసుకొని మొక్కలను వర్గీకరించడాన్ని వర్గవికాస వర్గీకరణ అంటారు. ఉదా: ఎంగ్లర్-ప్రాంటల్ విధానము.

జంతువుల వర్గీకరణసవరించు

ఏనిమేలియా రాజ్యాన్ని కణజాలాల అభివృద్ధిని బట్టి రెండు ఉపరాజ్యాలుగా వర్గీకరించారు.

మూలాలుసవరించు