శిఖామణి
శిఖామణి (కర్రి సంజీవరావు) ప్రముఖ కవి, రచయిత. [1] కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డారు.[2]
శిఖామణి | |
---|---|
జననం | కర్రి సంజీవరావు 1957 అక్టోబరు 30 యానాం , పాండిచ్చేరి |
ఇతర పేర్లు | కర్రి సంజీవరావు |
వృత్తి | అధ్యాపకుడు రచయిత |
ప్రసిద్ధి | శిఖామణి |
పదవి పేరు | అసిస్టెంట్ ప్రొఫెసర్ |
మతం | హిందూ |
భార్య / భర్త | కృష్ణవేణి |
పిల్లలు | దుర్గేశ నందిని, సూర్యతేజ |
తండ్రి | సూర్యనారాయణ |
తల్లి | ఆదిలక్ష్మి |
వెబ్‌సైటు | |
http://www.sikhamani.com/ |
జననం
మార్చుఈయన కాకినాడ సమీపంలోని యానాంలో 1957, అక్టోబర్ 30న జన్మించాడు.
విద్యాభ్యాసం - ఉద్యోగం
మార్చుయానాం, విశాఖపట్నం లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉన్నాడు.
రచనా ప్రస్థానం
మార్చుమొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లోకి తర్జుమా అయ్యింది.
రచనలు
మార్చు- మువ్వలచేతికర్ర
- చిలక్కొయ్య
- గిజిగాడు
- హోరుగాలి
- ప్రయోగవాది పఠాభి (పి.హెచ్.డి సిద్ధాంతగ్రంథం)
- సమాంతర (ఆధునిక కవిత్వ వ్యాసాలు)
- కిర్రుచెప్పుల భాష
- నల్లగేటూ నందివర్ధనంచెట్టు
- తవ్వకం
- వివిధ
- దళిత సాహిత్య తత్వం
- The Black Rainbow
- అమ్మ (సంపాదకత్వం)
- తులనాత్మక వ్యాసాలు (సంపాదకత్వం)
- అర్ధ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం (సంపాదకత్వం)
- తెలుగు ఏకాంక నాటక పరిచయం (సంపాదకత్వం)
పురస్కారాలు
మార్చు- మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1987లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
- మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1987లో సమతా రచయితల సంఘం (అమలాపురం) అవార్డు
- మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1988లో తెలుగువిశ్వవిద్యాలయం కవితా పురస్కారం
- మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1989లో ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
- మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1991లో విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి స్మారక పురస్కారం
- గరికపాటి సాహితీ పురస్కారం- 1996
- అధికార భాషా సంఘం అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి భాషా పురస్కారం- 2004
- రీజెన్సీ -కళావాణి- యానాం వారి పురస్కారం- 1997
- 2015 ఉగాది పురస్కారం [3]
- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[4][5]
పదవులు - గుర్తింపులు
మార్చు- కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారులు[2]
మూలాలు
మార్చు- ↑ పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం
- ↑ 2.0 2.1 ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (24 March 2018). "ఐదుగురికి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యత్వం". Retrieved 24 March 2018.[permanent dead link]
- ↑ "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Published On:20-03-2015". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.
- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.