శివుని వేయి నామములు- 1-100
శివ సహస్రనామ స్తోత్రములోని మొదటి నూరు నామాలకు అర్ధాలు:
శ్లోకం 1
మార్చుస్థిరః = సర్వకాలములందు నిలకడగా నుండువాడు,
స్థాణుః = చలనం లేనివాడు అనగా తాను చలించుటకు మరియెక స్థానంలేక అంతటా తానై విస్తరించినవాడు.
ప్రభుః = సమస్తమునకు అధిపతి,
భీమః = ప్రళయకాల భయమును కలుగజేయువాడు,
ప్రవరః = సర్వశ్రేష్టుడు,
వరదః = వరములనిచ్చువాడు,
సర్వాత్మా = సమస్తమైన ఆత్మలుతానే అయినవాడు,
సర్వవిఖ్యాతః = సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు,
సర్వః = సమస్తము తానేఅయినవాడు,
సర్వకరః = సమస్తజగత్తులను చేయువాడు,
భవః = శివుని రూపంలో పుట్టినవాడు,
జటీ = జడలు ధరించినవాడు,
చర్మీ = వ్యాఘ్ర చర్మనును ధరించినవాడు,
శిఖండీ = శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు,
సర్వాంగః = సమస్తమైన అవయవములతో పూర్ణమైనవాడు,
సర్వభావనః = సమస్త భావనల రూపమును తానే అయినవాడు.
శ్లోకం 2
మార్చుహరః = సమస్త పాపములను హరించువాడు,
హరిణాక్షః = లేడికన్నులు వంటి కన్నులు కలవాడు,
సర్వభూతహరః = సమస్తప్రాణికోటిని హరించువాడు,
ప్రభుః = అధిపతి,
ప్రవృత్తిః = జీవనవిధానము తానే అయినవాడు,
నివృత్తిః = జీవనవిధాన నివారణము తానే అయినవాడు,
నియతః = నియమము యొక్క రూపము తానే అయినవాడు,
శాశ్వతః = నిత్యమైనవాడు
ధ్రువః = నిశ్వయ రూపము తానే అయినవాడు.
శ్లోకం 3
మార్చుశ్మశానవాసీ = శ్మశానమునందు నివసించువాడు,
భగవాన్ = షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు,
ఖచరః = ఆకాశమునందు సంచరించువాడు,
అగోచరః = కంటికి కనిపించనివాడు,
అర్దనః = తనలోనికి తీసుకొనువాడు,
అభివాద్యః = నమస్కరింప తగినవాడు,
మహాకర్మా = గొప్పదైన కర్మానుభవం తానేఅయినవాడు,
తపస్వీ = తపస్సుచేయువాడు,
భూతభావనః = ప్రాణికోటి భావన తానే అయినవాడు.
శ్లోకం 4
మార్చుఉన్మత్తవేష ప్రచ్ఛన్నః = పిచ్చివాని వేషంలో దాగియున్నవాడు,
సర్వలోక ప్రజాపతిః = సమస్తలోకములందలి ప్రజలను పాలించువాడు,
మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు,
మహాకాయః = గొప్పదైన శరీరము కలవాడు,
వృష రూపః = పుణ్య స్వరూపుడు,
మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు.
శ్లోకం 5
మార్చుమహాత్మా = గొప్పదైన ఆత్మయే తానైయున్నవాడు,
సర్వభూతాత్మా = సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు,
విశ్వరూపః = సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు,
మహాహనుః = గొప్ప దవడలు గలవాడు,
లోకపాలః = లోకములను పరిపాలించువాడు,
అంతర్హితాత్మా = అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు,
ప్రసాదః = అనుగ్రహించువాడు,
నీల లోహితః = నీలమైన కంఠము, ఎరుపు వర్ణము జటలు కలవాడు.
శ్లోకం 6
మార్చుపవిత్రం = పరిశుద్ధమైన,
మహాన్ = గొప్పవాడు,
నియమః = నియమం తన స్వరూపమైనవాడు,
నియమాశ్రితః = నియమములను ఆశ్రయించియుండువాడు,
సర్వకర్మా = సమస్తమైన కర్మములు తానే అయినవాడు,
స్వయం భూతః = తనంతట తానుగా పుట్టినవాడు,
ఆదిః = సృష్టికి అంతటికీ మొదటివాడు,
నిధిః = అన్నిటికి మూలస్థానమైనవాడు.
శ్లోకం 7
మార్చుసహస్రాక్షః = అనేకమైన కన్నులు కలవాడు,
విశాలాక్షః = విశాలమైన కన్నులు కలవాడు,
సోమః = చంద్రుని వంటివాడు,
నక్షత్రసాధకః = నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు,
చంద్రః = చంద్రుని వంటివాడు,
సూర్యః = సుర్యుని వంటివాడు,
శనిః = సూర్యుని కుమారుడైన శని వంటివాడు,
కేతుః = కేతుగ్రహరూపం తానేఅయినవాడు,
గ్రహపతిః = గ్రహములను పాలించువాడు,
వరః = శ్రేష్టుడు.
శ్లోకం 8
మార్చుఆది = మొదలు,
అంతః = చివర,
లయకర్తః = ప్రళయములను సృష్టించువాడు,
మృగబాణార్పణః = మృగమువంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు,
అనఘః = పాపరహితుడు,
మహాపాతః = గొప్ప తపస్సు చేసినవాడు,
ఘోరతపాః = భయంకరమైన తపస్సు చేసినవాడు,
అదీనః = ప్రాధేయపడు స్వభావము లేనివాడు,
దీన సాధకః = బాధలలో ఉన్నవారిని రక్షించువాడు.
శ్లోకం 9
మార్చుసంవత్సర కరః = సంవత్సర కాలమును సృష్టించినవాడు,
మంత్రః = మంత్ర స్వరూపము తానే అయినవాడు,
ప్రమాణం = ప్రమాణ స్వరూపుడు,
పరమంతపః = మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు,
యోగీ = యోగనిష్ఠ యందున్నవాడు,
యోజ్యః = సంయోజనము చేయుటకు తగినవాడు,
మహాబీజః = గొప్ప ఉత్పత్తి కారకమైనవాడు,
మహారేతః = గొప్ప వీర్యము కలవాడు,
మహాబలః = గొప్పశక్తి కలవాడు.
శ్లోకం 10
మార్చుసువర్ణరేతాః = బంగారపు తేజస్సు కలవాడు,
సర్వజ్ఞః = సమస్తము తెలిసినవాడు,
సుబీజః = ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు,
బీజవాహనః = సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు,
దశబాహుః = పది భుజాలు కలవాడు,
అనిమిషః = రెప్పపాటు లేనివాడు,
నీలకంఠః = నల్లని కంఠము కలిగియున్నవాదు,
ఉమాపతిః = పార్వతి భర్త