శివుని వేయి నామములు- 401-500

శివ సహస్ర నామ స్తోత్రం
శివ సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శివుడు

శ్లోకము 41 మార్చు

సిద్ధయోగీ = సిద్ధించిన యోగము కలవాడు

మహర్షిః = ఋషులలో గొప్పవాడు

సిద్ధార్థః = సిద్ధించిన ప్రయోజనము కలవాడు

సిద్ధసాధకః = సిద్ధమగునట్లు సాధించువాడు

భిక్షుః = భిక్షాటనము చేయువాడు

భిక్షురూపః = భిక్షుకుల రూపమున ఉన్నవాడు

విపణః = వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు

మృదుః = మెత్తనైనవాడు

అవ్యయః = నాశము లేనివాడు

శ్లోకము 42 మార్చు

మహాసేనః = గొప్ప సేన కలవాడు

విశాఖః = కుమారస్వామి (సేనాపతి) తానే అయినవాడు

షష్టిభాగః = కాలమును అరవై భాగములుగ విభజించినవాడు

గవాంపతిః = గోవుల యొక్క పతి (వృషభము) తానే అయినవాడు

వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు

విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు

చమూస్తంభః = సేనా సమూహమును నిరోధించువాడు

శ్లోకము 43 మార్చు

వృత్తావృత్తకరః = వృత్తం (యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పడటం), ఆవృత్తం (శత్రుసైన్యాన్ని నశింపజేసి ఎట్టి గాయం లేకుండా తిరిగిరావటం) రెంటిని నైపుణ్యంగా చేయువాడు

తాలః = తాళ స్వరూపము తానే అయినవాడు

మధుః = వసంత ఋతువు రూపము తానే అయినవాడు

మధుకలోచనః = తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు

వాచస్పత్యః = వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు

వాజసనః = శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు (వాజసనుడు) తానే అయినవాడు

నిత్యం ఆశ్రిత పూజితః = ఎల్లప్పుడు తనను ఆశ్రయించిన వారిచేత పూజింపబడినవాడు

శ్లోకము 44 మార్చు

బ్రహ్మచారీ = వేద మార్గమునందు సంచరించువాడు

లోకచారీ = లోకమునందు సంచరించువాడు

సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు

విచారవిత్ = ఆలోచనా పరిజ్ఞానము కలవాదు

ఈశానః = ఈశానుడు (శివుడు)

ఈశ్వరః = ఐశ్వర్యము కలవాడు

కాలః = మృత్యురూపము తానే అయినవాడు

నిశాచారీ = రాత్రులందు సంచరించువాడు

పినాకభృత్ = పినాకమను పేరుగల ధనుస్సును ధరించినవాడు

శ్లోకము 45 మార్చు

నిమిత్తస్థః = ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు

నిమిత్తం = ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు

నందిః = నందిరూపము తానే అయినవాడు

నాందీకరః = ఆనందము కలుగజేయువాడు

హరిః = విష్ణు రూపమైనవాడు

నందీశ్వరః = వృషభరూపము తానే అయినవాడు

నందీ = ఆనందరూపము తానే అయినవాడు

నందనః = ఆనందము కలుగజేయువాడు

నందివర్ధనః = ఆనంద స్థితిని వృద్ధి చేయువాడు

శ్లోకము 46 మార్చు

భగహారీ = ఐశ్వర్యమును హరించువాడు

నిహంతా = చంపువాడు

కాలః = కాలరూపము తానే అయినవాడు

బ్రహ్మా = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు

పితామహః = తానే బ్రహ్మ అయినవాడు

చతుర్ముఖః = నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు

మహాలింగః = గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు

చారులింగః = సుందరమైన లింగాకారమున ఉన్నవాడు

శ్లోకము 47 మార్చు

లింగాధ్యక్షః = లింగాకారములన్నిటికి అధిపతి

సురాధ్యక్షః = దేవతలకు అధిపతి

యోగాధ్యక్షః = సమస్త యోగశాస్త్రమునకు అధిపతి

యుగావహః = సమస్త కాలమును ఆవహించియుండువాడు

బీజాధ్యక్షః = సృష్టియొక్క మూలమునకు అధిపతి

బీజకర్తా = సృష్టియొక్క మూలమును కలుగజేయువాడు

అధ్యాత్మానుగతః = ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు

బలః = బలరూపము తానే అయినవాడు

శ్లోకము 48 మార్చు

ఇతిహాసః = పూర్వచరిత్ర కలవాడు

సకల్పః = సృష్టితో మొదటి నుండియు కలసియున్నవాడు

గౌతమః = గౌతమ ఋషి తానే అయినవాడు

నిశాకరః = చంద్రుడు తానే అయినవాడు

దంభః = మిక్కిలి అట్టహాసము కలిగినవాడు

అదంభః = అట్టహాసము లేనివాడు

వైదంభః = దంభము లేనివాడు

వశ్యః = భక్తులకు అధీనుడైనవాడు

వశకరః = ఆకర్షణ గుణము కలవాడు

కలిః = కలి పురుషుడు తానే అయినవాడు

శ్లోకము 49 మార్చు

లోకకర్తా = లోకమును నడిపించువాడు

పశుపతిః = నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి

మహాకర్తా = గొప్పవాడై లోకములను నడిపించువాడు

అనౌషధః = ఔషధములు అక్కరలేనివాడు

అక్షరం = నాశములేని

పరమం = శ్రేష్టమైన

బ్రహ్మ = జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్ధము తానే అయినవాడు

బలవాన్ = బలము కలవాడు

శక్తః = సమర్థుడైనవాడు

శ్లోకము 50 మార్చు

నీతిః = నియమ (ధర్మ) శాస్త్రము తానే అయినవాడు

అనీతిః = నియమము లేనివాడు

శుద్ధాత్మా = పరిశుద్ధమైన ఆత్మ కలవాడు

శుద్ధః = పరిశుద్ధమైన; శుచియైనవాడు

మాన్యః = గౌరవింప తగినవాడు

గతాగతః = జరిగినది, జరుగబోవునది తానే అయినవాడు

బహుప్రసాదః = మిక్కిలి అనుగ్రహము కలవాడు

సుస్వప్నః = మంచి కలగా కనిపించువాడు

దర్పణః = ప్రకృతియొక్క ప్రతిబింబము చూపించువాడు

అమిత్రజిత్ = శత్రువులను జయించినవాడు