శివుని వేయి నామములు- 501-600

శివ సహస్ర నామ స్తోత్రం
శివ సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శివుడు

శ్లోకము 51 మార్చు

వేదకారః = వేదములను తెలియపరచినవాడు

మంత్రకారః = మంత్రములను తెలిపినవాడు

విద్వాన్ = అన్ని విషయములు తెలిసినవాడు

సమరమర్దనః = యుద్ధమునందు శత్రువులను నాశనము చేయువాడు

మహామేఘనివాసీ = గొప్పదైన మేఘమండలములో నివసించువాడు

మహాఘోరః = గొప్ప భయంకరమైనవాడు

వశీకరః = అందరను ఆకర్షించువాడు

శ్లోకము 52 మార్చు

అగ్నిజ్వోలః = అగ్ని యొక్క జ్వాలయే తానైనవాడు

మహాజ్వాలః = గొప్పదైన మంట యొక్క ఆకారము తానైనవాడు

అతిధూమ్రః = మిక్కిలి ధూమ్రవర్ణము (నలుపు, ఎరుపు కలసియున్న రంగు) పొగవర్ణములో ఉన్నవాడు

హుతః = అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానైనవాడు

హవిః = హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానైనవాడు

వృషభః = వాహనమగు ఎద్దు రూపము తానైనవాడు

శంకరః = సుఖమును కలుగజేయువాడు

నిత్యంవర్చస్వీ = ఎల్లప్పుడు వర్చస్సు కలవాడు

ధూమకేతనః = ధూమవర్ణము కల జెండా కలవాడు

శ్లోకము 53 మార్చు

నీలః = నల్లనైనవాడు

అంగలుబ్ధః = మన్మథుని యందు ఆసక్తి కలవాడు

శోభనః = శుభములను కలుగజేయువాడు

నిరవగ్రహః = ప్రతిబంధములు లేనివాడు

స్వస్తిదః = శుభములను ఇచ్చువాడు

స్వస్తిభావః = శుభమైన భావములు కలవాడు

భాగీ = యజ్ఞభాగములను కలిగినవాడు

భాగకరః = విభాగములు చేయువాడు

లఘుః = తేలిక అయినవాడు.

శ్లోకము 54 మార్చు

ఉత్సంగః = అందరకును ఒడియై ఉండువాడు

మహాంగః = గొప్పనైన అవయవములు కలవాడు

మహాగర్భపరాయణః = తన గర్భస్థులను జాగ్రత్తగా చూచుకొనువాడు

కృష్ణవర్ణః = నల్లని వర్ణము కలవాడు

సువర్ణః = బంగారు వర్ణము కలవాడు; బంగారం తానే అయినవాడు

సర్వదేహినాం ఇంద్రియం = సమస్త ప్రాణులకు ప్రధానమైన అవయవము వంటివాడు

శ్లోకము 55 మార్చు

మహాపాదః = విస్తారమైన పాదములు కలవాడు

మహాహస్తః = గొప్పనైన చేతులు కలవాడు

మహాకాయః = గొప్ప శరీరము కలవాడు

మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు

మహమూర్ధాః = గొప్ప శిరస్సు కలవాడు

మహామాత్రః = గొప్ప పరిమాణము కలవాడు

మహానేత్రః = గొప్పవైన నేత్రములు కలవాడు

నిశాలయః = రాత్రి నివాసముగా కలవాడు

శ్లోకము 56 మార్చు

మహాంతకః = గొప్పవాడైన నాశకుడు

మహాకర్ణః = గొప్పవైన చెవులు కలవాడు

మహోష్ణః = గొప్ప వృషభము కలవాడు

మహాహనుః = గొప్ప దవడలు కలవాడు

మహానాసః = గొప్ప ముక్కు కలవాడు

మహాకంబుః = గొప్ప శంఖము వంటివాడు

మహాగ్రీవః = గొప్ప ముఖము కలవాడు

శ్మశానభాక్ = స్మశానములో ఉండువాడు

శ్లోకము 57 మార్చు

మహావక్షాః = గొప్పదైన వక్షస్థలము కలవాడు

మహోరస్కః = గొప్పదైన హృదయము కలవాడు

అంతరాత్మా = ఆత్మ యొక్క లోపలి భాగము అయినవాడు

మృగాలయః = సామాన్య జంతువులకు నిలయమైనవాడు

లంబనః = అందరకును పట్టుకొమ్మ అయినవాడు

లంబితోష్ఠః = నోరు తెరచి ఉన్నవాడు; వ్రేలాడుచున్న పెదవులు కలవాడు

మహామాయః = గొప్ప మాయ కలిగినవాడు

పయోనిధిః = సముద్రుని వంటివాడు

శ్లోకము 58 మార్చు

మహాదంతః = గొప్పవైన దంతములు కలవాడు

మహాదంష్ట్రః = గొప్పవైన కోరలు కలవాడు

మహాజిహ్వః = గొప్పదైన నాలుక కలవాడు

మహాముఖః = గొప్పదైన ముఖము కలవాడు

మహానఖః = గొప్పవైన గోళ్ళు కలవాడు

మహారోమః = గొప్పవైన వెండ్రుకలు కలవాడు

మహాకేశః = గొప్పవైన తలవెండ్రుకలు కలవాడు

మహాజటః = గొప్పవైన జడలు కలవాడు

శ్లోకము 59 మార్చు

ప్రసన్నః = అనుగ్రహించువాడు

ప్రసాదః = అనుగ్రహరూపము కలవాడు

ప్రత్యయః = విశ్వాసము తానే అయినవాడు

గిరిసాధనః = కొండలను సాధించువాడు

స్నేహనః = స్నేహము కలవాడు

అస్నేహనః = శత్రుత్వము తానే అయినవాడు

అజితః = జయింపబడనివాడు

మహామునిః = గొప్ప మౌనము కలవాడు

శ్లోకము 60 మార్చు

వృక్షాకారః = వృక్షము యొక్క ఆకారము కలవాడు

వృక్షకేతుః = వృక్షము తన జెండాగా కలిగినవాడు

అనలః = అగ్ని ఆకారము తానే అయినవాడు

వాయువాహనః = వాయువు వాహనముగ కలవాడు

గండలీ = గుహలో నివసించువాడు

మేరుధామా = బంగారు కొండ నివాసముగా కలవాడు

దేవాధిపతిః = దేవతలకు అధిపతి అయినవాడు