శివుని వేయి నామములు- 301-400
శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:
శ్లోకము 31
మార్చువ్యాళరూపః = సర్ప రూపమున ఉండువాడు
గుహావాసీ = గుహలో నివసించువాడు
గ్రహమాలీ = గ్రహములన్నింటిని నడిపించువాడు
తరంగవిత్ = జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు
త్రిదశః = ఎల్లప్పుడు మూడు పదులు సంవత్సరముల వయస్సు కలవాడు
కాలదృక్ = సకాలమును బాగుగా గుర్తించువాడు
కర్మ సర్వబంధ విమోచనః = కర్మముల యొక్క సమస్త బంధముల నుండి విముక్తి కలిగించువాడు
శ్లోకము 32
మార్చుఅసురేంద్రాణాం బంధనం = రాక్షస శ్రేష్ఠుల యొక్క బంధనరూపం అయివున్నవాడు
యుధి శత్రు వినాశనః = యుద్ధమునందు శత్రువులను నశింపజేయువాడు
సాంఖ్యప్రసాదః = ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు
దూర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయిననూ ధరించువాడు
సర్వసాధు నిషేవితః = సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు
శ్లోకము 33
మార్చుప్రస్కందః = శత్రువులను నశింపజేయువాడు
విభాగజ్ఞః = యజ్ఞ భాగములు తెలిసినవాడు
అతుల్యః = తనతో సమానుడు లేనివాడు
యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు
సర్వవాసః = సమస్తమును ధరించువాడు
సర్వచారీ = సమస్త ప్రదేశములందు చరించువాడు
దుర్వాసాః = మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు
వాసవః = ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు
అమరః = మరణము లేనివాడు
శ్లోకము 34
మార్చుహైమః = బంగారు మయమైనవాడు
హేమకరః = బంగారమును చేయువాడు
యజ్ఞః = యజ్ఞపురుష రూపము తానేఅయినవాడు
సర్వధారీ = సమస్తమును ధరించువాడు
ధరోత్తమః = ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు
లోహితాక్షః = ఎర్రని వర్ణముకల కన్నులు కలవాడు
మహాక్షః = గొప్పదైన దృష్టి కలవాడు
విజయాక్షః = విజయముపై దృష్టి కలవాడు
విశారదః = బాగుగా తెలిసినవాడు
శ్లోకము 35
మార్చుసంగ్రహః = మిక్కిలి గ్రహించువాడు
నిగ్రహః = ఆత్మనియంత్రణ కలిగినవాడు
కర్తా = సర్వకార్యములు చేయువాడు
సర్పచీర నివాసనః = పాము కుబుసము వస్త్రముగా ధరించువాడు
ముఖ్యః = ప్రధానమైనవాడు
అముఖ్యః = అప్రధానమైనవాడు; తనకంటె ఇతరమైన ప్రధానుడు లేనివాడు
కాహళిః = మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు
సర్వకామదః = సమస్తమైన కోరికలు ఇచ్చువాడు
శ్లోకము 36
మార్చుసర్వకాల ప్రసాదః = సమస్త కాలములందు అనుగ్రహించువాడు
సుబలః = మంచి బలము కలవాడు
బలరూపభృత్ = బలమైన రూపము ధరించువాడు
సర్వకామప్రదః = సమస్తమైన కోరికలు విశేషముగ ఇచ్చువాడు
సర్వదః = సమస్తమును ఇచ్చువాడు
సర్వతోముఖః = అన్ని ప్రక్కల ముఖము కలవాడు
శ్లోకము 37
మార్చుఆకాశ నిర్విరూపః = ఆకాశమువలె రూపము లేనివాడు
నిపాతః = శీఘ్రముగా గమ్యస్థానము చేరువాడు
అవశః = ఒకరి అధీనమున లేనివాడు
ఖగః = పక్షివలె శీఘ్ర గమనము కలవాడు
రౌద్రరూపః = తీవ్రకోపముతో కూడిన రూపము కలవాడు
అంశుః = కిరణ రూపమైనవాడు
ఆదిత్యః = సూర్యుడు తానైయున్నవాడు
బహురశ్మిః = ఎక్కువ కాంతి (కిరణములు) కలవాడు
సువర్చసీ = మంచి కాంతి కలవాడు
శ్లోకము 38
మార్చువసువేగః = కిరణముల యొక్క వేగము కలవాడు
మహావేగః = గొప్ప వేగము కలవాడు
మనోవేగః = మనస్సు వంటి వేగము కలవాడు
నిశాచరః = రాత్రియందు సంచరించువాడు
సర్వవాసీ = సమస్త ప్రదేశములందు నివసించువాడు
శ్రియావాసీ = శ్రీ శోభతో నివసించువాడు
ఉపదేశకరః = ఉపదేశము చేయువాడు
అకరః = ఏమియు చేయనివాడు
శ్లోకము 39
మార్చుమునిః = మౌనముగా ఉండువాడు
ఆత్మా = తానే అందరి ఆత్మ అయినవాడు
నిరాలోకః = దర్శనం లేనివాడు
సంభగ్నః = పలువిధములుగ విభజింప బడినవాడు
సహస్రదః = అనేకమైన వాటిని ఇచ్చువాడు
ప్లక్షీ = భూమి యందలి ప్లక్ష ద్వీపమున నివసించువాడు
ప్లక్షరూపః = జువ్వి చెట్టు యొక్క రూపము తానే అయినవాడు
అతిదీప్తః = మిక్కిలి ప్రకాశించువాడు
విశాంపతిః = మానవజాతి కంతటికీ అధిపతి
శ్లోకము 40
మార్చుఉన్మాదః = పిచ్చివాని వలె ఉన్నవాడు
మదనః = మన్మధరూపం తానైనవాడు
కామః = కోరికరూపము తానేఅయినవాడు
అశ్వత్థః = తానే రావిచెట్టు రూపమున ఉన్నవాడు
అర్థకరః = ప్రయోజనము సమకూర్చువాడు, సమస్త వస్తువులను సమకూర్చువాడు
యశః = కీర్తి రూపము తానే అయినవాడు
వామదేవః = ఎడమ భాగమునందు స్త్రీరూపము కలవడు
వామః = శ్రేష్టుడు
ప్రాక, దక్షిణ, ఉదజ్ఞ్ముఖః = తూర్పు, దక్షిణ, ఉత్తర ముఖములు కలవాడు