శివుని వేయి నామములు- 601-700

శివ సహస్ర నామ స్తోత్రం
శివ సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శివుడు

శ్లోకము 61

మార్చు

అధర్వ శీర్షః = అధర్వణ వేదము శిరస్సుగా కలవాడు

సామాస్యః = సామ వేదము ముఖముగా కలవాడు

ఋక్సహస్రామితేక్షణః = ఋగ్వేదమును పరిమితిలేని కన్నులుగా కలవాడు

యజుఃపాదభుజః = యజుర్వేదము పాదములు, భుజములుగా కలవాడు

గుహ్యః = రహస్యమైనవాడు

ప్రకాశః = అందరకును వెలుగు రూపమున బహిరంగమైనవాడు

జంగమః = కదలిక కలిగినవాడు

శ్లోకము 62

మార్చు

అమోఘార్థః = వ్యర్ధము కాని ప్రయోజనము కలవాడు

ప్రసాదః = అనుగ్రహించువాడు

అభిగమ్యః = అందరికి సులభముగా పొందతగినవాడు

సుదర్శనః = అందరకు సులభముగా (దర్శనము) కనిపించువాడు

ఉపకారప్రియః = ఉపకారము చేయుటయందు ప్రీతి కలవాడు

సర్వః = సమస్తమునందు వ్యాపించియుండువాడు

కనకః = బంగారము తానే అయినవాడు

కాంచనచ్ఛవిః = బంగారపు కాంతి కలవాడు

శ్లోకము 63

మార్చు

నాభిః = ప్రపంచమునకు నాభిస్థానము వంటివాడు

నందికరః = ఆనందము కలుగజేయువాడు

భావః = అందరి మనస్సు తానైనవాడు

పుష్కరః = అన్ని నదులను పవిత్రము చేయువాడు

స్థపతిః = దేవాలయ నిర్మాణశాస్త్రము తెలిసినవాడు

స్థిరః = స్థిరమైనవాడు

ద్వాదశః = ద్వాదశ రూపములు కలవాడు

త్రాసనః = భయమును కలుగజేయువాడు

ఆద్యః = ఆదియైనవాడు

యజ్ఞః = యజ్ఞపురుషుడు తానే అయినవాడు

యజ్ఞసమాహితః = యజ్ఞము అనే కర్మతో కూడియుండువాడు

శ్లోకము 64

మార్చు

నక్తం = రాత్రి రూపమైనవాడు

కలిః = కలి పురుషుడు తానే అయినవాడు

కాలః = కాలపురుషుని రూపము తానే అయినవాడు

మకరః = మొసలి రూపము తానే అయినవాడు

కాలపూజితః = కాలము (కాలుని) చేత పూజింపబడినవాడు

సగణః = గణములతో కూడినవాడు

గణకారః = సైన్య సమూహములను సృష్టిచేయువాడు

భూతవాహనసారథిః = ప్రాణుల యొక్క వాహనములను నడిపించువాడు

శ్లోకము 65

మార్చు

భస్మాశయః = భస్మము (బూడిద) ను ఎల్లప్పుడు ధరించువాడు

భస్మగోప్తా = భస్మమును ధరించిన వారిని రక్షించువాడు

భస్మభూతః = భస్మరూపమును ధరించినవాడు

తరుః = జీవులను తరింపజేయువాడు

గుణః = మంచి గుణము కలవాడు

లోకపాలః = లోకములను పరిపాలించువాడు

లోకః = తానే లోకములైనవాడు

మహాత్మా = ఆత్మస్వరూపం తానే అయినవాడు; గొప్పదైన ఆత్మ కలవాడు

సర్వపూజితః = అందరిచే పూజింపబడువాడు

శ్లోకము 66

మార్చు

శుక్లః = శుద్ధ స్వరూపము తానే అయినవాడు

త్రిశుక్లః = త్రికరణములచే శుద్ధుడు

సంపన్నః = సంపూర్ణ సంపదలచే కూడియున్నవాడు

శుచిః = శుచియైనవాడు; అగ్ని రూపములో ఉన్నవాడు

భూత నిషేవితః = ప్రాణుల చేత సేవింపబడినవాడు

ఆశ్రమస్థః = ఆశ్రమమున నివసించువాడు

క్రియావస్థః = కర్మలతోను వాటి పరిస్థితులతోను కూడియున్నవాడు

విశ్వకర్మమతిః = ప్రపంచమందలి కర్మములను గురించి బాగుగా తెలిసినవాడు

వరః = శ్రేష్ఠుడు.

శ్లోకము 67

మార్చు

విశాలశాఖః = అనేకమైన విజ్ఞాన శాస్త్ర శాఖలు తెలిసినవాడు

తామ్రోష్ఠః = తామ్ర+ఓష్ఠ అనగా ఎర్రనైన పెదవులు కలవాడు

అంబుజాలః = సముద్ర రూపమైనవాడు

సునిశ్చలః = మిక్కిలి చలనము లేకుండ ఉండువాడు

కపిలః = నల్లనివాడు

కపిశః = వానరరూపము అనగా నలుపు, పసుపు వర్ణములు కూడియున్నవాడు

శుక్లః = తెల్లనైనవాడు

ఆయుః = మానవుల ఆయువు రూపము తానే అయినవాడు

పరః = ఉత్కృష్టమైనవాడు

అపరః = తనతో సమానమైన ఇతరులు లేనివాడు

శ్లోకము 68

మార్చు

గంధర్వః = దేవతలలో గంధర్వులను ఒక జాతికి చెందినవాడు

అదితిః = అదితి సంతానమైనవాడు

తార్ క్ష్యః = గరుడుని రూపము తానే అయినవాడు

సువిజ్ఞేయః = బాగుగా తెలియదగినవాడు

సుశారదః = మంచి పండితుడు

పరశ్వధాయుధః = పరశువు (గండ్ర గొడ్డలి) ఆయుధంగా కలవాడు

దేవః = దేవుడైనవాడు

అనుకారీ = అనుసరించి పోవువాడు

సుబాంధవః = మంచి బంధువైనవాడు

శ్లోకము 69

మార్చు

తుంబవీణః = పెద్దదైన వీణ కలవాడు

మహాక్రోధః = మిక్కిలి కోపం కలవాడు

ఊర్ధ్వరేతా = ఊర్ధ్వముగా ప్రవహించు రేతస్సు కలవాడు

జలేశయః = జలమునందు శయనించువాడు

ఉగ్రః = తీక్షణమైనవాడు

వంశకరః = వంశమును వృద్ధిచేయువాడు

వంశః = తానే వంశమును ఏర్పాటు చేసినవాడు

వంశనాదః = వెదురులోని నాదం తానే అయినవాడు

అనిందితః = నింద లేనివాడు

శ్లోకము 70

మార్చు

సర్వాంగరూపః = సమస్త అవయవ రూపము కలవాడు

మాయావీ = మాయ చేయువాడు

సుహృదః = మంచి స్నేహితుడు

అనిలః = వాయు రూపమైనవాడు

అనలః = అగ్ని రూపమైనవాడు

బంధనః = బంధించువాడు

బంధకర్తా = బంధమును కలుజేయువాడు

సుబంధ విమోచనః = బాగుగా బంధముల నుండి విముక్తి కలిగించువాడు