శివుని వేయి నామములు- 201-300
శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:
శ్లోకము 21
మార్చుసహస్రహస్తః = అనేకమైన (వేయి) హస్తములు కలవాడు
విజయః = విజయమును సాధించువాడు
వ్యవసాయః = ఎల్లప్పుడు ప్రయత్నము చేయువాడు
అతంద్రితః = తొట్రుపాటు లేనివాడు
అమర్షణః = దుష్టత్వమును కోపగించుకొనువాడు
మర్షణాత్మా = సహనముతో కూడిన ఆత్మకలవాడు
యజ్ఞహా = దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు
కామనాశకః = మన్మథుని నశింపచేసినవాడు
శ్లోకము 22
మార్చుదక్షయాగాపహారీ = దక్ష యజ్ఞమును నాశనము చేసినవాడు
సుసహః = మిక్కిలి సహనము కలవాడు
మధ్యమః = మధ్యేమార్గమున ఉండువాడు
తేజః అపహారీ = ఇతరుల తేజస్సును హరించువాడు
బలహా = ఇతరుల బలమును హరించువాడు
ముదితహా = ఎల్లప్పుడు సంతోషంతో ఉండువాడు
అర్ధః = ప్రయోజనము యొక్క రూపము ధరించువాడు
అజితః = జయింపబడనివాడు
వరః = అందరికంటే ఉత్తముడు
శ్లోకము 23
మార్చుగంభీరఘోషః = గంభీరమైన కంఠధ్వని కలవాడు
గంభీరః = లోతైన స్వభావము కలవాడు
గంభీర బలవాహనః = పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు
న్యగ్రోధరూపః = వటవృక్షము యొక్క రూపమైనవాడు
న్యగ్రోధః = తానే వటవృక్షమువలె వ్యాపించియుండువాడు
వృక్షకర్ణస్థితిః = చెట్టు యొక్క ఆకులపై నివసించువాడు
విభుః = సమస్తమునకు అధిపతి
శ్లోకము 24
మార్చుసుతీక్షణ దశనః = మిక్కిలి పదునైన దంతములు కలవాడు
మహాకాయః = గొప్ప శరీరము కలవాడు
మహాననః = గొప్పదైన ముఖము కలవాడు
విశ్వక్సేనః = విష్ణుసేనాధిపతియైన విశ్వక్సేనుని రూపము తానే అయినవాడు
హరిః = విష్ణువే తానైనవాడు
యజ్ఞః = తానే యజ్ఞపురుషుడైనవాడు
సంయోగపీడ వాహనః = యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు
శ్లోకము 25
మార్చుతీక్షణతాపః = తీక్షణమైన వేడిమి కలుగజేయువాడు
హర్యశ్వః = పచ్చని కాంతిగల గుర్రములు కలిగియున్న సూర్యునివంటివాడు
సహాయః = ఎల్లప్పుడు మనతో ఉండువాడు
కర్మకాలవిత్ = కర్మముల గురించియు, కాలముల గురించియు తెలిసినవాడు
విష్ణుప్రసాదితః = విష్ణువు యొక్క అనుగ్రహము పొందినవాడు
యజ్ఞః = యజ్ఞము యొక్క రూపము తానేఅయినవాడు
సముద్రః = సముద్రము యొక్క రూపము తానేఅయినవాడు
బడబాముఖః = సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపము తానే అయినవాడు
శ్లోకము 26
మార్చుహుతాశన సహాయః = అగ్ని సహాయముగా కలవాడు
ప్రశాంతాత్మా = శాంతమైన ఆత్మ కలవాడు
హుతాశనః = తానే అగ్ని రూపమైయున్నవాడు
ఉగ్రతేజాః = తీవ్రమైన తేజస్సు కలవాడు
మహాతేజాః = గొప్పదైన తేజస్సు కలవాడు
జన్యః = సమస్త జంతువుల రూపము తానే అయినవాడు
విజయకాలవిత్ = విజయము పొందు కాలము తెలిసినవాడు
శ్లోకము 27
మార్చుజ్యోతిషాం అయనం = నక్షత్రములకు మూలస్థానమైనవాడు
సిద్ధిః = కార్యసిద్ధి రూపము తానే అయినవాడు
సర్వవిగ్రహః = సమస్తమైన విగ్రహరూపములు తానే అయినవాడు
శిఖీ = శిఖలు కలవాడు
ముండీ = కేశరహితమైన శిరస్సు కలవాడు
జటీ = జడలు కలిగినవాడు
జ్వాలీ = అగ్నిజ్వాలా రూపమైనవాడు
మూర్తిజః = విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు
మూర్దగః = శిరస్సును పొందినవాడు
బలీ = బలము కలవాడు
శ్లోకము 28
మార్చువైష్ణవః = విష్ణుశక్తి కలిగినవాడు
ప్రజవీ = మిక్కిలి వేగము కలవాడు
తాళీ = సంగీత శాస్త్రము నందలి లయజ్ఞానము కలవాడు
ఖేళీ = మిక్కిలిగా నటించువాడు
కాలకటంకటః = యముని నియంత్రించువాడు
నక్షత్రవిగ్రహమతిః = నక్షత్రములు, గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు
గుణబుద్ధిః = మంచి గుణములను గురించి తెలిసినవాడు
లయః = తానే ప్రళయరూపమై ఉన్నవాడు
అగమః = తేలికగా పొందుటకు వీలులేనివాడు
శ్లోకము 29
మార్చుప్రజాపతిః = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు
విశ్వబాహుః = ప్రపంచమునే తన భుజములుగా కలవాడు
విభాగః = ప్రపంచం యొక్క భాగము తానే అయినవాడు
సర్వతోముఖః = అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు
విమోచనః = విముక్తి కలుగజేయువాడు
సుసరణః = తేలికగా ప్రసరించువాడు
హిరణ్య కవచోద్భవః = బంగారు కవచముతో పుట్టినవాడు
శ్లోకము 30
మార్చుమేఘజః = మేఘమునుండి పుట్టినవాడు
బలచారీ = బలముతో సంచరించువాడు
మహీచారీ = భూమియందు సంచరించువాడు
స్తుతః = స్తుతి చేయబడినవాడు
సర్వతూర్య వినోదీ = సమస్తమైన తూర్య వాద్యములచేత వినోదించువాడు
సర్వవాద్య పరిగ్రహః = సమస్త వాద్యములను ఉపయోగించువాడు.