శివుని వేయి నామములు- 901-1000

శివ సహస్ర నామ స్తోత్రం
శివ సహస్ర నామములు : 01-100  • 101-200  • 201-300  • 301-400  • 401-500  • 501-600  • 601-700  • 701-800  • 801-900  • 901-1000

శివ సహస్రనామ స్తోత్రములోని తరువాతి నూరు నామముల అర్ధాలు:

శివుడు

శ్లోకము 91 మార్చు

శిరోహారీ = (దక్షుని) శిరస్సును ఖండించినవాడు

సర్వలక్షణ లక్షితః = సమస్తమైన మంచి లక్షణముల చేత గుర్తింపబడినవాడు

అక్షః = సృష్టి చక్రమునకు ఇరుసు వంటివాడు

రథయోగీ = రథమును కూర్చువాడు

సర్వయోగీ = సమస్తమును సమకూర్చువాడు

మహాబలః = గొప్ప బలము కలవాడు.

శ్లోకము 92 మార్చు

సమామ్నాయః = వేదముతో సమానమైనవాడు

అసమామ్నాయః = వేదములకు అతీతుడు

సీరదేవః = భూమిని పంటలు పండుటకు అనువుగా చేయువాడు

మహారథః = రథకులలో గొప్పవాడు

నిర్జీవః = నిర్జీవమైన వస్తువుల ఆకారము తానైనవాడు

జీవనః = ఉత్తమ జీవనము కలవాడు

మంత్రః = మంత్ర స్వరూపుడు

శుభాక్షః = శుభమైన దృష్టి కలవాడు

బహు కర్కశః = మిక్కిలి కఠినమైనవాడు.

శ్లోకము 93 మార్చు

రత్నప్రభూతః = రత్నములను సృష్టించినవాడు

రక్తాంగః = ఎఱుపు రంగు శరీరము కలవాడు

మహార్ణవ నిపానవిత్ = గొప్పదైన సముద్రపు నీటిని త్రాగుటలో నేర్పరి

మూలం = సృష్టికి మూలమైనవాడు

విశాలః = అతి విస్తారమైనవాడు

అమృతః = అమృత స్వరూపము తానైనవాడు

వ్యక్తావ్యక్తః = కనిపించి, కనిపించనివాడు

తపోనిధిః = తపస్సుకు స్థానమైనవాడు

శ్లోకము 94 మార్చు

ఆరోహణః = ఉన్నతస్థితికి పోవువాడు

అధిరోహః = ఆరోహించిన వాడు

శీలధారీ = సత్ప్రవర్తన కలిగినవాడు

మహాయశాః = గొప్ప కీర్తి కలవాడు

సేనాకల్పః = సేనను సృష్టి చేయువాడు

మహాకల్పః = గొప్పదైన సృష్టి చేసినవాడు

యోగః = యోగము తానైనవాడు

యోగకరః = యోగమును సృష్టించినవాడు

హరిః = విష్ణువు తానైనవాడు.

శ్లోకము 95 మార్చు

యుగరూపః = యుగముల రూపము తానైనవాడు

మహారూపః = గొప్పదైన ఆకారము కలవాడు

మహానాగహనః = గొప్పవాడైన గజాసురుని చంపినవాడు

అవధః = వధింపబడనివాడు

న్యాయ నిర్వహణః = న్యాయమును నిర్వహించువాడు

పాదః = పూజ్యుడు

పండితః = పండితుడు

అచలోపమః = పర్వతముతో సమానుడు.

శ్లోకము 96 మార్చు

బహుమాలః = అనేకమైన మాలలు ధరించినవాడు

మహామాలః = గొప్పవైన మాలలు కలవాడు

శశీ = చంద్రుడు తానైనవాడు

హరిసులోచనః = మంచి నేత్రములు కలవాడు

విస్తారః = మిక్కిలి వ్యాపించినవాడు

లవణః = ఉప్పు తానైనవాడు

కూపః = నూయి తానైనవాడు

త్రియుగః = గడిచిన మూడు యుగములు తానైనవాడు

సఫలోదయః = సిద్ధించిన ఫలముతో కూడియున్నవాడు.

శ్లోకము 97 మార్చు

త్రినేత్రః = మూడు కన్నులు కలవాడు

విషణ్ణాంగః = సర్వదా నిరాకారుడు

మణివిద్ధః = మణుల చేత ప్రకాశించువాడు

జటాధరః = జడలను ధరించినవాడు

బిందుః = అనుస్వారము రూపము తానైనవాడు

విసర్గః = విసర్గ రూపము తానైనవాడు

సుముఖః = మంచి ముఖము కలవాడు

శరః = బాణరూపము తానైనవాడు

సర్వాయుధః = సమస్తమైన ఆయుధముల రూపము తానైనవాడు

సహః = సహనము కలవాడు.

శ్లోకము 98 మార్చు

నివేదనః = అన్నిటిని ఇచ్చువాడు

సుఖాజాతః = సుఖములను కలుగజేయువాడు

సుగంధారః = మంచి సంగీత జ్ఞానం కలిగినవాడు

మహాధనుః = గొప్పదైన ధనుస్సు కలవాడు

గంధపాలీ = మంచి సువాసనను కలుగజేయువాడు

భగవాన్ = భగవంతుడు

సర్వకర్మణామ్ = సమస్త కర్మలకు

ఉత్థానః = ఫలశ్రుతి కలుగజేయువాడు.

శ్లోకము 99 మార్చు

మంథానః = సమస్త సృష్ఠిని మధించువాడు

బహుళః = సమస్తమందు ఉన్నవాడు

వాయుః = వాయు రూపమై ఉన్నవాడు

సకలః = సమస్తమైన వాడు

సర్వలోచనః సమస్తమైన కన్నులు కలవాడు

తలః = సమర్థత కలిగినవాడు

తాలః సంగీతములో తాళరూపము తానైనవాడు

కరస్థాలీ = చేతియందు పాత్ర కలవాడు

ఊర్ధ్వ సంవహనః = పైకి తీసుకొని పోవువాడు

మహాన్ = గొప్పవాడు.

శ్లోకము 100 మార్చు

ఛత్రం = సృష్టి కంతటికి గొడుగు వంటివాడు

సుచ్ఛత్ర విఖ్యాతః = మంచి ఛత్రముతో ప్రసిద్ధి చెందినవాడు

లోకః = లోకము తానే అయినవాడు

సర్వాశ్రయక్రమః = సమస్తమునకు తానే ఆశ్రయింపదగిన వరుసలో ఉన్నవాడు

ముండః = క్షురకర్మచే తలవెంట్రుకలు తీయబడినవాడు

విరూపః = వికారమైన స్వరూపము కలవాడు

వికృతః = వికృతమైన రూపము కలవాడు

దండీ = దండము కలవాడు

కుండీ = పాత్ర కలిగియున్నవాడు

వికుర్వణః = వికృతముగా చేయువాడు.

శ్రీ శివసహస్రనామావళి శ్లోకము 101

శ్లోకము 102

హర్యక్షః = సింహం కన్నుల దృష్టిని పోలిన స్వరూపం

కకుభో = దశ దిశలు లేదా దిక్కుల స్వరూపుడు.

వజ్రీ = వజ్రం వంటి శివుడు, దేవేంద్ర స్వరూపుడు

శత జిహ్వః = వంద నాలుకలు కలవాడు.

సహస్రపాత్ = వేయి (అనంతమైన) పాదాలు కలవాడు.

సహస్రమూర్ధా = వేయి (అనంతమైన) తలలు గలవాడు.

దేవేంద్రః సర్వదేవ మయో = దేవేంద్రుడు, ఇతర దేవతల స్వరూపుడు

గురుః = ప్రపంచంలోని అన్ని జీవులకు గురువు.

శ్లోకము 103

సహస్ర బాహు = వేయి ( అనంతమైన ) చేతులు కలవాడు

సర్వాంగః = అందరి భౌతిక అవయవాల స్వరూపుడు.

శరణ్యః = ఇతరుల రక్షణ చూసుకోగలరు.

సర్వ లోక కృత్ = సమస్త లోకాల రూపకర్త.

పవిత్రం = ఇతరులను పవిత్రం చేసేవాడు .

త్రికకున్మంత్రః = బీజం, శక్తి, కీలకం అనే మూడు భాగాలతో కూడిన మంత్ర స్వరూపుడు.

కనిష్ఠః = అతి సూక్ష్మమైన రూపంలో చిన్నవారు.

కృష్ణ పింగళః = నలుపు ఎరుపు యొక్క విశిష్ట రంగులో ఉన్నారు .

శ్లోకము 104

బ్రహ్మదండవినిర్మాతా = సృష్టి యొక్క కార్యాన్ని బ్రహ్మ ద్వారా నిర్మించిన శివుడు;

శతఘ్నీ = వందలమందిని మోసుకెళ్లేవాడు.

పాశ శక్తిమాన్ = పాశ, శక్తి మొదలైన ఆయుధాలను కలిగినవాడు .

పద్మగర్భో = కమలంలో పుట్టిన బ్రహ్మ స్వరూపుడు.

మహాగర్భో = విశ్వం తనలో ఉంచుకునేవాడు

బ్రహ్మగర్భో = సృష్టికర్త బ్రహ్మ, వేదాలను తనలో ఉంచుకునేవాడు

జలోద్భవః = ప్రళయ జలం నుండి లేచినవాడు,

శ్లోకము 105

గభస్తిః = వేలాది కాంతి కిరణాలు గలవాడు, సూర్యు ప్రకాశం .

బ్రహ్మకృద్ = వేదాల రూపంలో ఉద్భవించినవాడు, అత్యున్నత జ్ఞానం యొక్క వ్యక్తిత్వం.

బ్రహ్మీ = వేదాలు పఠించేవాడు.బ్రహ్మ రూపంలో ఉన్నవాడు

బ్రహ్మవిద్ = వేదాలు రూపొందించినవారు

బ్రాహ్మణో = బ్రాహ్మణ రూపంలో వేదాలు, వేదాంగాలు బోధించేవాడు

గతిః = ఎవరు శరణాగతి అంతిమ లక్ష్యం

అనంత రూపొ = అనంతమైన రూపాలు కలవాడు

నైకాత్మా = శరీరము లేనివాడు

తిగ్మ తేజాః స్వయంభువః = మహాదేవుని వైభవానికి ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు .

శ్లోకము 106

ఊర్ధ్వగాత్మా = సృష్టి-విశ్వం-బ్రహ్మ, అన్నింటినీ మించిన రూపం కలవాడు.

పశుపతిర్ = బ్రహ్మ నుండి సమస్త జీవులకు శివుడే పరమాత్మ .

వాతరంహా = వాయువేగం కంటే వేగవంతమైనవాడు

మనోజవః = బుద్ధి వేగం కలవాడు

చందనీ = గంధమును శరీరము పై పూసుకునేవాడు

పద్మమాలాగ్రః = విష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మ, విష్ణువు యొక్క ఔన్నత్యాన్ని సవాలు చేసినప్పుడు, అక్కడ లోతైన ఓంకార శబ్దంతో ఒక భారీ శివలింగం ఉద్భవించింది

సురభ్యుత్తరణో = తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు కామ ధేనువు ( సురభి ) కు శాపం ఇచ్చాడు.

నరః = బ్రహ్మ, విష్ణువు శివలింగం యొక్క పైభాగం, దిగువ గురించి తెలియదు, ఇంకా మానవులు ఏమి తెలియదు .

శ్లోకము 107

కర్ణికార మహాస్రగ్వీ = పరమ శివుడు మెడలో కర్ణికార పుష్పాలతో చేసిన మాల ధరించి ఉంటాడు

నీలమౌలిః = మహాదేవుడు నీలం రాయితో పొదిగిన కిరీటాన్ని ధరించి ఉంటాడు

పినాకథృత్ = పినాక అనే ధనుస్సును ధరించిన వాడు

ఉమాపతి = ఉమాదేవి భర్త శివుడు.

ఉమాకాంతో = పరమశివుడు దేవి ఉమా యొక్క ప్రకాశం .

జాహ్నవీధృత్ = గంగా దేవిని తన జటా జూటంలో ధరించినవాడు, గంగా దేవి జాహ్నవిగా ప్రసిద్ధి చెందింది

ఉమాధవః = ఉమా దేవి భర్త పరమశివుడు

శ్లోకము 108

వరో = శివుడు తన భక్తులకు అనుగ్రహ స్వరూపుడు

వరాహో = విష్ణువు యొక్క వరాహ అవతారం.

వరదో = శివుడు అనేక రూపాలలో దయ యొక్క స్వరూపుడు

వరేణ్యః = శివుడు వరాలను ప్రసాదించే వాడు.

సుమహాస్వనః = సంగీత స్వరం కలవాడు, ప్రతిధ్వనించే స్వరంతో ఎప్పుడూ వేదాలను పఠించేవాడు

మహాప్రసాదో = సంతోషంగా అనుగ్రహించేవారు.

దమనః = దుష్టులను, దుర్మార్గులను నాశనం చేసేవాడు

శత్రుహా = శత్రువులను నాశనం చేసేవాడు

శ్వేతపింగళః = శరీరంలో సగం తెల్లగా, మిగిలిన సగం ఎరుపు రంగులో ఉన్న అర్థనారీశ్వర స్వరూపం .

ప్రీతాత్మ = అందరిచే పూజింపబడేవాడు

పరమాత్మా = అంతటా ఉన్న ఆత్మ

ప్రయతాత్మా = నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన ఆత్మ

ప్రధానధృత్ = ప్రకృతి త్రిగుణాలను ధరించినవాడు

సర్వపార్శ్వముఖః = అన్ని వైపులా ముఖాలు కలిగినవారు .

త్య్రక్షః = మూడు కన్నులు కలవాడు

ధర్మసాధారణో వరః = ఒకరి స్వంత కర్మ లేదా గత పనుల ఆధారంగా మంచి పనులకు సరైన పరిహారం చూపించే వ్యక్తి