శోభన నారాయణ్

భారతీయ కథక్ నర్తకి

శోభన నారాయణ్ (1950 సెప్టెంబరు 2) పేరు పొందిన భారతీయ కథక్ నర్తకి. ఆమె ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్‌ ఆఫీసర్. ఆమె దేశంలోనే కాక అంతర్జాతీయంగా పలు ప్రదర్శనలు ఇచ్చింది. ఆమెను 1992లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[1] ఆమె బిర్జూ మహరాజ్ వద్ద శిక్షణ పొందింది.[2]

శోభన నారాయణ్
జననం (1950-09-02) 1950 సెప్టెంబరు 2 (వయసు 73)
వృత్తిడ్యాన్సర్, IA&AS ఆఫీసర్
క్రియాశీల సంవత్సరాలు1970 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిహెర్బర్ట్ ట్రాక్స్ల్
పిల్లలుఎర్విన్ ఇషాన్ ట్రాక్స్ల్
Dancesకథక్

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

శోభన నారాయణ్ నాలుగేళ్ల ప్రాయంలో కోల్‌కతాకు చెందిన సాధన బోస్, ముంబైకి చెందిన గురు కుండల్ లాల్ కథక్‌ను ప్రారంభించారు.[3]

ఆమె ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో చదువుకుంది. 1972లో ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె 2008లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి డిఫెన్స్ కమ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎం.ఫిల్ చేసింది. తిరిగి ఆమె 2001లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సోషల్ సైన్సెస్‌లో ఎం.ఫిల్ పూర్తి చేసింది.

కెరీర్

మార్చు

ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్స్ సర్వీస్ లో ఆఫీసర్‌గా కూడా విధులు నిర్వహించింది. 2010లో పదవీ విరమణ చేసింది.

వ్యక్తిగతం

మార్చు

ఆమె దేశంలోని ఆస్ట్రియన్ రిటైర్డ్ రాయబారి డాక్టర్ హెర్బర్ట్ ట్రాక్స్‌ను వివాహం చేసుకుంది.[4]

గుర్తింపు

మార్చు
  • 1992లో భారతప్రభుత్వంచే పద్మశ్రీ
  • 1999–2000 సంవత్సరానికి సంగీత నాటక అకాడమీ అవార్డు
  • ఢిల్లీ ప్రభుత్వ పరిషత్ సమ్మాన్
  • రాజీవ్ స్మృతి పురస్కారం
  • 1985లో బీహార్ గౌరవ్ పురస్కార్
  • ఇందిరా ప్రియదర్శిని సమ్మాన్
  • రాజధాని రత్న అవార్డు
  • శృంగార్ శిరోమణి అవార్డు
  • రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు
  • భారత్ నిర్మాణ్ అవార్డు
  • నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు
  • 1990–91 సంవత్సరానికి ఒయిస్కా అవార్డు (జపాన్)
  • 1993లో దాదాభాయ్ నౌరోజీ అవార్డు
  • కెల్వినేటర్ GR8 అవార్డు
  • FICCI FLO అవార్డు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Famous Kathak Dancers". Bhavalaya. Archived from the original on 23 ఏప్రిల్ 2012. Retrieved 25 జనవరి 2012.
  2. "Shovana Narayan Biography | Childhood, Family, Contribution to Kathak Dance, Facts". www.culturalindia.net (in ఇంగ్లీష్). Retrieved 2019-05-07.
  3. S. Sahaya Ranjit (November 13, 2006). "Kathak dancer Shovana Narayan unfolds her life in 'Meandering Pastures of Memories'". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-04-02.
  4. Chatterjee, Rupa (2007). Raising a Daughter. p. 127. ISBN 9788122308228.