శ్రీకాళహస్తి కలంకారీ

శ్రీకాళహస్తి కలంకారీ అనేది చిత్తూరు జిల్లా లోని శ్రీకాళహస్తి లో నెలకొన్న కలంకారీ అద్ధక పరిశ్రమ.[1] [2] కేవలం సహజ, హానికారకాలు లేని రంగులతో చిత్రాలు వేయడం ఈ కళలో ప్రత్యేకత. ఈ రంగులను మొక్కలు, కూరగాయల నుంచి తయారు చేస్తారు కనుక వాతావరణానికి అనుకూలంగా వుంటాయి.[3]

ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

శ్రీకాళహస్తి కలంకారీ
శ్రీకాళహస్తి కలంకారీ
శ్రీకాళహస్తి కలంకారీ
వివరణచిత్తూరు జిల్లా లోని శ్రీకాళహస్తి లో నెలకొన్న కలంకారీ అద్ధక పరిశ్రమ.
రకంహస్తకళ
ప్రాంతంశ్రీకాళహస్తి
దేశంభారతదేశం
నమోదైంది2009

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

చరిత్ర మార్చు

శ్రీకాళహస్తి కలంకారీ కళ శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి మొదలయింది. ఆనాటి పాలకులు ఈ కళను సమాచారం అందించడానికి వాడేవారు.[4] అప్పటి నుండి అనేక మంది కళాకారులు సాంప్రదాయక డిజైన్లను తయారుచేసి నైపుణ్యంతో ఈ ప్రాంతానికి కీర్తి తెచ్చి పెట్టారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాలు జివనం సాగిస్తున్నాయి.

విశేషాలు మార్చు

శ్రీకాళహస్తి కలంకారీ అద్దకానికి అంకితమైన గొప్ప యాత్రా స్థలము. ఇది కలంకారీ కళకు పెట్టింది పేరు. ‘కలంకారీ’ పదంలో ‘కలం’ అంటే పెన్ను, ‘కారీ’ అంటే రాసే వ్యక్తి. ఇది అనేక మంది కళాకారుల కృషి వల్ల సజీవంగా వర్థిల్లుతోంది. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లలో మార్పులు చేస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు ఈ ప్రాంత కళాకారులు. ఈ కళ అత్యంత సంప్రదాయమైనది, శ్రమతో కూడినది, కళాత్మకమైనది. ఈ కలంకారీ ప్రక్రియ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా పెడనలో మాత్రమే ఈ కళాకారులున్నారు. పెడన కలంకారీ అద్దకాలకు కేంద్రస్థానమైతే, భగవంతుని బొమ్మలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధం. ఇప్పుడు కాళహస్తిలోనే రెండు వేల మంది మహిళలు కలంకారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు మూడు నుంచి పదివేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. [5] గతంలొ చీరలపై మాత్రమే బొమ్మలు గీసేవారు. కాలక్రమం లో థోవతి, కుర్తా, ఇతర వస్త్రాలపైనా చిత్రాలు గీయడం ప్రారంభించారు. ఐదు దశాబ్దాల వరకు ఈ ప్రాంతంలొ ఈ కళ రెండు కుటుంబాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. ఇప్పుడు ఈ వృత్తిపై వందల కుటుంబాలు ఆధార పడుతున్నాయి.[6]

తిరుపతి తిరుమల దేవాస్థానం యొక్క "శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రడిషినల్ స్కల్‌ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (SVITSA)" శ్రీకాళహస్తి కలంకారీ శైలులను బోధించి కళాకరులను తీర్చిదిద్దడానికి బిడ్ దాఖలు చేసింది. "కలంకారీ చిత్రాలు" అనే కోర్సును ప్రవేశపెట్టింది.[7]

స్త్రీలు కూడా... మార్చు

ఒకప్పుడు మగవారికే స్వంతమైన ఈ కళలో మహిళలు రాణించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతి కష్టమైన సాంప్రదాయ కళలో రాణించడమే కాక అపురూప చిత్రాలకు జీవం పోస్తున్నారు. తద్వారా ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

కలంకారీ విధానం మార్చు

కలంకారీ అనేది ఒక ప్రాచీన కళ. అనేక శతాబ్దాలపాటు సంప్రదాయకంగా కళాకారులు గట్టి బట్ట మీద పురాణాలలోను, ఇతిహాసాలలోను గల గాథలకు అనురూపంగా చిత్రాలు వేసి ఆ బట్టను దేవాలయాలలో తెరలుగాను, గోడలకు అలంకారాలుగానూ ఉపయోగించేవారు. దేవాలయాలలో శిల్పాలు, దేవతా విగ్రహాలు, వివిధ కుడ్య చిత్రాలు మొదలైన వాటినుంచి కలంకారీ కళాకారులు స్ఫూర్తిని కలిగించుకున్నారు. దేవతా విగ్రహాల శిల్పకళా నైపుణ్యాన్ని, విగ్రహాల ఆభరణాలను, బొమ్మలను చూచి అనేక విషయాలను గ్రహించారు. ఫ్రెస్కో పెయింటింగ్‌లాగే కలంకారీ అద్దకాలు రామాయణ, మహాభారత చిత్రాలతో అతిరమణీయంగా ఉంటాయి. దివ్యమైన కలంకారీ కళ కళాకారుల హస్తకళా నైపుణ్యం కాదు, చిత్రకళా చాతుర్యం కాదు, ఒక విధమైన అప్పొర్వ భగవద్భక్తి ప్రకతిస్తూ వుంటాయి. అంధ్ర దేశంలో ప్రత్యేకంగా కలంకారీ చిత్ర కళకు రెండే రెండు కేంద్రాలు ప్రసిద్ధి పొందాయి. మొదటిది శ్రీకాళహస్తి, రెండవది అద్దకాలకు ముఖ్య కేంద్రమైన మచిలీపట్టణం.

మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు. దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు. సుదీర్ఘమైన ఈ కలంకారీ విధానంలో ఇది మొదటిమెట్టు. ఈవిధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్ వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను పూర్తిచేస్తారు.

గిన్నిస్ రికార్డు మార్చు

శ్రీకాళహస్తి గ్రామానికి చెందిన శ్రీ రామచంద్రయ్య కలంకారీ కళలోని ప్రతిభకు గానూ గిన్నిస్ రికార్డును పొందారు.[8]

మూలాలు మార్చు

  1. "Geographical Indication". The Hans India. 23 January 2016. Retrieved 25 January 2016.
  2. శ్రీకాళహస్తి కలంకారీ అద్భుతం[permanent dead link]
  3. కొనుగోళ్ళు, కాళహస్తి[permanent dead link]
  4. "Design Resource - Kalamkari Painting - People and Place". www.dsource.in. Archived from the original on 27 అక్టోబరు 2015. Retrieved 25 January 2016.
  5. న్యూస్ ఫ్లాష్ ఆస్ట్రేలియాతో తొలి-20; కలంకారీ... కలర్‌ఫుల్ ఉపాధి
  6. సంప్రదాయ కలంకారీ కళకు తమ ఓర్పు నేర్పుతో మరింత వన్నె తెస్తున్నా శ్రీకాళహస్తి మహిళలు
  7. "TTD grooms artists in Srikalahasti-Kalamkari style". T. APPALA NAIDU. The HIndu. 24 November 2014. Retrieved 26 January 2016.
  8. "Kalamkari Painting". Archived from the original on 2015-10-27. Retrieved 2016-01-26.

ఇతర లింకులు మార్చు