కేరింత

సాయికిరణ్ అడవి దర్శకత్వంలో 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

కేరింత 2015, జూన్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు[2] నిర్మాణ సారధ్యంలో సాయికిరణ్ అడవి[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ[4] ప్రధానపాత్రల్లో నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. సాయికిరణ్ ఇంతకుముందు తీసిన వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కేరింత
Kerintha Telugu Movie Poster.jpg
కేరింత సినిమా పోస్టర్
దర్శకత్వంసాయికిరణ్ అడవి
రచనఅబ్బూరి రవి
నిర్మాతదిల్ రాజు
నటవర్గంసుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ
ఛాయాగ్రహణంవిజయ్ సి చక్రవర్తి
కూర్పుమధు
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీలు
2015 జూన్ 12 (2015-06-12)
నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

జై (సుమంత్ అశ్విన్), సిద్ధు (విశ్వనాథ్), నూకరాజు (పార్వతీశం), భావన (సుకృతి) చిన్ననాటి నుండి స్నేహితులు. ఒకే కళాశాలలో చదువుతుంటారు. అదే కళాశాలలో ప్రియ (తేజస్విని), నూకరాజు (పార్వతీశం) వచ్చి చేరుతారు. ఐదుగురు కలిసిమెలసి ఉంటుంటారు.

ఫోటోగ్రఫీలో ఎం.ఎ చేస్తున్న జై తొలిచూపులోనే మనస్విని (శ్రీదివ్య)ని ప్రేమిస్తాడు. డాక్టరైన మనస్విని ఆస్ట్రేలియా వెళ్లి రీసెర్చ్ చెయ్యాలన్న ఆశయంతో ఉంటూ, జై ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది.

శ్రీకాకుళంలో నిరుపేద కుటుంబం నుండి చదువుకోడానికి హైదరాబాదు వచ్చిన నూకరాజు, ఇక్కడి కొత్త వాతారణం చూసి, జల్సాలు చేస్తుంటాడు. ఇలాంటి నూకరాజును భావన ప్రేమిస్తుంది. కాని నూకరాజు అది అర్ధం చేసుకోలేడు. ప్రేమ విషయం తెలిసి దగ్గరకి వచ్చినా అతనంటే ఇష్టం ఉన్నాకూడా అతని ప్రవర్తన నచ్చక నూకరాజుని దూరంగా ఉంచుతుంది.

సంగీతంలో ఎం.ఎ. చేస్తున్న సిద్దార్థ్ (విశ్వనాథ్) ప్రతి విషయంలో అమ్మకి భయపడి తాను ఎం.సి.ఎ. చేస్తున్నట్టు చెప్పుకుంటాడు. అమెరికా నుండి వచ్చిన ప్రియ (తేజస్వి మదివాడ)ను ప్రేమించిన సిద్దార్థ్, ప్రేమ విషయం అమ్మకి చెప్పానని అబద్దం చెప్తాడు. అసలు విషయం తెలిసిన ప్రియ అతని నుండి దూరంగా వెళ్ళిపోతుంది.

చివరికి ఆ జంటలు ఎలా కలిసాయి అన్నది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

2015, మే 25న అల్లు అరవింద్ అతిథిగా విచ్చేసి ఆడియో సీడిని ఆవిష్కరించాడు.[5] రామజోగయ్య శాస్త్రి రచించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "స్వరంలో ఆగిందే కేరింత"  హరిచరణ్ 4:30
2. "మిల మిల"  కార్తీక్ 4:16
3. "జగదేక వీర"  అంజనా సౌమ్య 3:31
4. "థ్యాంక్స్ టూ జిందగీ"  రాహుల్ నంబియార్, దీపు, శిల్ప 3:27
5. "సుమగంధాల"  కార్తీక్ 4:31
6. "ఏ కథ"  జోనితా గాంధీ 3:37
23:52

నిర్మాణం - విడుదలసవరించు

దగ్గుబాటి వెంకటేష్, మహేష్ బాబు లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా, జూ. ఎన్టీయార్ తో రామయ్యా వస్తావయ్యా సినిమా, రామ్ చరణ్ తో ఎవడు సినిమా వంటి పెద్ద చిత్రాలు నిర్మించిన తరువాత సాయికిరణ్ అడవి దర్శకత్వంలో కొత్తవారితో తక్కువ బడ్జెటులో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.[6] ఈ చిత్రం 2015, జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.[7]

స్పందనసవరించు

ప్రధాన పాత్రల్లో సుమంత్, శ్రీదివ్య, తేజస్విని మినహా మిగతా ముగ్గురు కొత్తవారైన విశ్వనాథ్, పార్వతీశం, సుకృతిల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్కో పాత్రకూ ఒక్కో ఎమోషన్ ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు పాత్రలే కనిపించేలా నటీనటులు తమ నటనను ప్రదర్శించారు. తెలిసిన కథే అయినా, సన్నివేశాలు ఆసక్తి కలిగించేలా తనదైన కోణంలో చెప్పడంలో దర్శకుడు విజయం సాధించాడు. సందర్భానుసారంగా వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మంచి అనుభూతిని కలిగించింది. సినిమాలోని బేసిక్ ఎమోషన్‌ కనిపించేలా సినిమాటోగ్రఫీ అందంగా ఉంది.[8]

మూలాలుసవరించు

  1. "'Kerintha' Movie Review by Viewers: Live Update".
  2. "Kerintha stands on par with Bommarillu and KBL: Dil Raju". Archived from the original on 2019-10-17. Retrieved 2019-10-17.
  3. "Kerintha to go on floors on June 23".
  4. "Kerintha: Coming-of-age stories".
  5. "Kerintha audio launched".
  6. "Sai Kiran Adivi's Kerintha to roll out soon".
  7. "'Kerintha is a clean entertainer'".
  8. https://www.123telugu.com/telugu/reviews/kerintha-telugu-review.html

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కేరింత&oldid=3867577" నుండి వెలికితీశారు