రామకృష్ణ మఠం

ఆధ్యాత్మిక సంస్థ
(శ్రీరామకృష్ణ మఠము నుండి దారిమార్పు చెందింది)

రామకృష్ణ మఠం, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్కు చెందిన ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన రామక్రిష్ణ మిషన్, ఆయన ప్రియశిష్యుడైన స్వామీ వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు పశ్చిమ బెంగాల్ లోని బేలూర్ మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను మే 1, 1897లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా, ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. దీనికి భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.[1]

widthpx

గురించిసవరించు

 
హైదరాబాదులో గల రామకృష్ణ మఠం

రామకృష్ణ మఠం అనేది రామకృష్ణ పరమహంస పురుషులకు కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం. రామకృష్ణ మిషన్ ఆయన శిష్యుడైన స్వామీ వివేకానంద శ్రీరామ కృష్ణ తత్వమును వ్యాప్తి చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒక సేవా సంస్థ. ఇవి రెండూ న్యాయపరంగా, ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చురామకృష్ణ మఠానికి చెందిన సన్యాసులు, భక్తులు కలిసి ప్రధానంగా భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ప్రధాన లక్ష్యాలుసవరించు

  • ప్రతీ మానవునిలో దివ్యత్వాన్ని గురించి ప్రచారం చెయ్యడం
  • అన్ని మతాల లక్ష్యం ఒకటే నని ప్రపంచానికి చాటడం
  • పనిని దైవంగా భావించి నిర్వర్తించడం, మానవసేవయే మాధవ సేవయని తెలియజేయడం
  • విద్య, వైద్య సేవల ద్వారా సామాన్యుల సమస్యలను తీర్చడం
  • జ్ఞాన, భక్తి, కర్మ రాజయోగాలను పాటించడం ద్వారా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దడం మొదలైనవి.
 
హైదరాబాదులో గల రామకృష్ణ మఠం

సామాజిక సేవసవరించు

వైద్య సేవలుసవరించు

  • క్షయ, కుష్టు వ్యాధి వంటి వాటికి ప్రత్యేక చికిత్సలు
  • కంటికి, నరాలకు సంబంధించిన వ్యాధులకు వైద్యం
  • మానసిక వ్యాధులకు ప్రత్యేక ట్రీట్‌మెంట్లు
 
హైదరాబాదులో గల రామకృష్ణ మఠం ప్రచురణాలయము

విద్యా సేవలుసవరించు

హైదరాబాదు మఠంలో విద్యార్థులకు అత్యంత తక్కువ ఫీజులతో ఆంగ్లము నేర్పేందుకు అతిపెద్ద విద్యాలయము ఉంది.

  • దీనిలో పదవతరగతిలో అత్యంత కనిష్ఠ మార్కులతో పాసయిన విద్యార్థులకు మొదటి అవకాశం కల్పిస్తారు.
  • మూడు విభాగాలలో శిక్షణ కల్పిస్తారు.

ప్రచురణలుసవరించు

పత్రికలు
× పేరు ప్రచురణ జరుగుతున్న
సంవత్సరం
భాష ప్రచురణ కాలం కేంద్రం
1 ప్రబుద్ధ భారత 110th ఇంగ్లీష్ ప్రతి మాసం Mayavati
2 ఉద్బోధన్ 107th బెంగాలీ ప్రతి మాసం Kolkata Bagbazar
3 వేదాంత కేసరి 92nd ఇంగ్లీష్ ప్రతి మాసం Chennai Mylapore
4 ప్రబుద్ధ కేరళం 90th మలయాళం ప్రతి మాసం Thrissur Kerala
5 శ్రీ రామకృష్ణ విజయం 85th తమిళం ప్రతి మాసం Chennai Mylapore
6 శ్రీ రామకృష్ణ ప్రభ 62nd తెలుగు ప్రతి మాసం Hyderabad, Domalguda Archived 2008-05-14 at the Wayback Machine
7 బుల్లెటిన్ 56th ఇంగ్లీష్ ప్రతి మాసం Kolkata Golpark
8 జ్యోతి 53rd ఇంగ్లీష్ 3 నెలలకు ఒకమారు Durban, South Africa
9 జీవన్ వికాస్ 49th మరాఠీ ప్రతి మాసం Nagpur Maharasthra
10 సమాజ్ శిక్ష 48th బెంగాలీ ప్రతి మాసం Kolkata Narendrapur
11 వివేక్ జ్యోతి 43rd హిందీ ప్రతి మాసం Raipur
12 వేదాంత 39th ఫ్రెంచ్ 3 నెలలకు ఒకమారు France Gretz
13 ఆశ్రమవాణి 23rd హిందీ ప్రతి మాసం Indore
14 శ్రీ రామకృష్ణ జ్యోత్ 18th గుజరాతీ ప్రతి మాసం Rajkot
15 దివ్యయాన్ సమాచార్ 13th హిందీ ప్రతి మాసం Ranchi Morhabadi
16 నిర్వణ 13th ఇంగ్లీష్ 3 నెలలకు ఒకమారు Singapore Archived 2012-03-25 at the Wayback Machine
17 వివేకప్రభ 6th కన్నడ ప్రతి మాసం Mysore

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-05. Retrieved 2008-10-09.

ఇవికూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.