శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా వంశీ సినిమాలలోకన్నిటికంటే సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించబడినది. గోదావరి ప్రాంత భాష, యాసలను అక్కడి అలవాట్లు కట్టు బొట్టులను, పల్లెటూళ్ళ అందాలను మరింత అందంగా తెరకెక్కింఛారు. రాజోలు, నర్సాపురం, మోరి, మానేపల్లి, శివకోడు, తాటిపాక, పాసర్లపూడి ఈ గ్రామాలలో దాదాపు పూర్తి సినిమాను తెరకెక్కింఛారు.
కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వంశీ |
---|---|
నిర్మాణం | పి.రమేష్ రెడ్డి, పి.విజయకుమార్ రెడ్డి |
రచన | వంశీ, తనికెళ్ళ భరణి |
తారాగణం | నరేష్, మాదురి, కోట శ్రీనివాసరావు, వై.విజయ, తనికెళ్ళ భరణి, మల్లిఖార్జునరావు, రాళ్ళపల్లి |
సంగీతం | ఇళయరాజా |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ తేజా ఆర్ట్స్ మూవీస్ |
భాష | తెలుగు |
కథ
మార్చురాజమండ్రి పట్టణంలో పాపారావు (కోట శ్రీనివాస రావు) తన మేనల్లుడు దొరబాబు (తనికెళ్ళ భరణి) తో కలసి శ్రీ కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ నడుపుతుంటారు. అందులో సభ్యులుగా ఆకుల అనంతలక్ష్మి (వై.విజయ), గోపాలం(నరేష్), పట్టు పద్మిని (సంధ్య), మల్లికార్జునరావు, ధమ్, ఆనందమోహన్ మరికొందరు ఉంటారు. అదే ఊళ్ళో గోపాలం (నరేష్) మావయ్య హొటల్ నడుపుతుంటాడు. హొటల్ కోసం రోజూ పాలు తెచ్చేందుకుగాను గోపాలం పాడి సుందరమ్మ (నిర్మల) ఇంటికి వెళుతుంటాడు. సుందరమ్మ మనుమరాలైన సీతమాదురి గోపాలాన్ని ప్రేమిస్తూ పిరికి వాడైన అతడిని ఆటపట్టిస్తూ ఉంటుంది. తన ట్రూపులో హీరోయిన్ గర్భవతి అవడంతో మరో కొత్త హీరోయిన్ను వెతికే పని గోపాలానికి అప్పగిస్తాడు పాపారావు. ఆ విషయం సీతకు తెలుస్తుంది. గోపాలాన్ని ప్రేమించేలా చేసుకోవాలంటే తను వాళ్ళ ట్రూపులో చేరితే అతనికి దగ్గరవచ్చు అనుకొని తన బామ్మకు డాన్స్ స్కూలులో చేరుతున్నానని చెప్పి రికార్డింగ్ ట్రూపులో చేరిపోతుంది. సీత ఆశించినట్టుగా గోపాలం ఆమెను ప్రేమించడం మొదలెడతాడు. సీత గోపాలం దైర్యం గురించి వేళాకోళం చేయడంతో ఒక రాత్రి ఆమె నిద్ర పోతున్నపుడు మెళ్ళో తాళి కట్టేస్తాడు. మరో వైపు కేవలం గోపాలమే కాక దొరబాబు కూడా సీతను ప్రేమించడం మొదలెట్టీ తన మామయ్యతో చెపుతాడు సీతతో తన పెళ్ళి చేయమని. పాపారావు సుందరమ్మతో తన మేనల్లుడి పెళ్ళి విషయం మాట్లాడుతాడు. సీత మెడలో తాళి ఉండటం చూసిన సుందరమ్మ ఎవడు కట్టాడో చెప్పమని సీతను నిలదీస్తుంది. సీత తను గోపాలాన్ని ప్రేమించానని అతడినే పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో సీత మెడలో తాళిని తెంచి పడేస్తుంది సుందరమ్మ. పాపారావుకు కబురు పంపి పెళ్ళికి తను ఒప్పుకొంటున్నానని వెంటనే మూహూర్తం పెట్టమంటుంది. పాపారావు తాగి తన ఉంపుడు గత్తె అయిన అనంతలక్ష్మితో సీతకు పెళ్ళి పేరుకు మాత్రమే దొరబాబుతోనని సీతతో సంసారం సాగించేది నేనేనని చెప్తాడు. అది చాటుగా వింటాడు దొరబాబు. చివరకు ట్రూపులో అందరూ పాపారావును చీకొట్టి గోపాల్ంతో సీత పెళ్ళిచేయడంతో కథ ముగుస్తుంది.
నటవర్గం
మార్చు- నరేష్ గోపాలం
- మాధురి సీత
- కోట శ్రీనివాసరావు పాపారావు
- Tanikella Bharani as Dorababu
- Mallikarjuna Rao as Abbulu
- Rallapalli as Cylone Subbarao
- Nirmalamma as Sita's grand mother as Paadi Sundaramma
- Y. Vijaya as Anantha Lakshmi
- Bheemaraju as Gavarraju
- Dham
- Sandhya as Pattu Padmini
- Rambabu as N.T.R.
- Veerraju as A.N.R.
- Venkatesh as Chiranjeevi
పాటలు
మార్చుPadma Vibhushan Ilaiyaraja.
క్రమసంఖ్య | పేరు | Artist(s) | నిడివి |
---|---|---|---|
1. | "Kalalaa Karagaalaa" | S. P. Balasubrahmanyam, S.Janaki | 4:50 |
2. | "Mallikaa Pogadaku" | S. P. Balasubrahmanyam, S.Janaki | 4:30 |
3. | "Nuvvu Naa Mundhunte" | S. P. Balasubrahmanyam, S.Janaki | 4:10 |
4. | "Siggesthondhaa" | S. P. Balasubrahmanyam, S.Janaki | 3:47 |
5. | "Thelisindhile(Bit)" | S.Janaki | 2:06 |
6. | "Thelisindhile" | S.Janaki | 4:00 |
7. | "Vennelai Paadanaa" | S. P. Balasubrahmanyam, S.Janaki | 4:34 |
8. | "Yenaadu Vidiponi (Instrumental)" | Ilayaraja | 4:32 |
9. | "Yenaadu Vidiponi" | S. P. Balasubrahmanyam, S.Janaki | 4:31 |