షేక్‌పేట ఫ్లైఓవర్

షేక్‌పేట ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. షేక్‌పేట సెవెన్‌ టూంబ్స్‌ నుంచి రాయదుర్గం విస్పర్‌ వ్యాలీ వరకు 2.8 కిలోమీటర్ల మేర రూ.333.55 కోట్లతో నూతనంగా షేక్‌పేట ఫ్లైఓవర్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది.[1]

శంకుస్థాపన

మార్చు

షేక్‌పేట ఫ్లైఓవర్ కి ఏప్రిల్‌, 2018లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశాడు.

నిర్మాణ వివరాలు

మార్చు

షేక్‌పేట ఫ్లైఓవర్ ను 6 లేన్లతో 2.71 కిలోమీటర్ల పొడవున స్టాటిజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) సౌజన్యంతో రూ. 333.55 కోట్ల అంచనాతో పనులను 2018లో నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఆరులేన్ల ఎలివేటెడ్‌ కారిడార్లలో షేక్‌పేట ఫ్లైఓవర్ అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్కనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్‌ చిక్కుల్ని తొలగించే ఈ ఫ్లైఓవర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు – ఇన్నర్‌ రింగ్‌రోడ్డును కలపనుంది.

ఈ ఫ్లైఓవర్‌ వల్ల సెవెన్‌టూంబ్స్, ఫిల్మ్‌నగర్‌ మెయిన్‌రోడ్డు, ఓయూకాలనీ, విస్పర్‌వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ చిక్కుల్ని తొలగించి, నానల్‌నగర్‌ నుంచి ఖాజాగూడ, ఖాజాగూడ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 11 కి.మీ మేర సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం కానుంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్‌డికాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే వారికీ ఉపశమనం కలిగింది. ఈ ఫ్లైఓవర్‌ బయోడైవర్సిటీ జంక్షన్‌– జేఎన్‌టీయూ జంక్షన్‌ మార్గానికి అనుసంధానంగా ఉండడం వల్ల దాదాపు 17 కి.మీ మేర (లక్డీకాపూల్‌–జేఎన్‌టీయూ జంక్షన్‌) కు సులభంగా చేరుకోవచ్చు.[2] జిహెచ్ఎంసి అధ్వర్యంలో మొదటి సారిగా ఫ్లై ఓవర్ క్రింద ప్రత్యేక పార్కును ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్, కూర్చోవడానికి సీట్లతో పాటు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.

ప్రారంభం

మార్చు

షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను 2022 జనవరి 1న రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించాడు.ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.[3][4]

మూలాలు

మార్చు
  1. NavaTelangana (25 December 2021). "అందుబాటులోకి మరో రెండు ఫ్లై ఓవర్లు". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  2. Sakshi (25 December 2021). "జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్". Archived from the original on 25 December 2021. Retrieved 25 December 2021.
  3. HMTV (1 January 2022). "షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
  4. TV5 News (1 January 2022). "హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. షేక్‌‌పేట్ ఫ్లై ఓవర్ ప్రత్యేకత ఏంటంటే." (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)