మాగంటి గోపీనాథ్
మాగంటి గోపీనాథ్ (1963 జూన్ 2 - 2025 జూన్ 8), తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు.[1] ఆయన జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మాగంటి గోపీనాథ్ | |||
![]()
| |||
పదవీ కాలం 2014 - 2025 జూన్ 8 | |||
ముందు | పి.విష్ణువర్ధన్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | జూబ్లీహిల్స్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 జూన్ 02 హైదర్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ | ||
మరణం | 2025 జూన్ 8 హైదరాబాదు | (వయసు: 62)||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | కృష్ణమూర్తి, మహానంద కుమారి | ||
జీవిత భాగస్వామి | సునీత | ||
సంతానం | మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు) |
జననం, విద్య
మార్చుగోపినాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని హైదర్‌గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు.[4]
వ్యక్తిగత జీవితం
మార్చుగోపినాథ్ కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ విశేషాలు
మార్చుమాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు.
గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[6] మాగంటి గోపినాథ్ 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7][8]
హోదాలు
మార్చు- 1987 - 1989: హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్
- 1988 - 1993: జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడు
నిర్మాతగా
మార్చు- పాతబస్తీ (1995)[9]
- రవన్న (2000)
- భద్రాద్రి రాముడు (2004)
- నా స్టైలే వేరు (2009)
మరణం
మార్చుమాగంటి గోపినాథ్ 2025 జూన్ 5న గుండెపోటు రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ జూన్ 8న ఉదయం 5.45 గంటలకు మరణించాడు.[10][11][12]
మూలాలు
మార్చు- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-13.
- ↑ "Maganti Gopinath | MLA | TRS | Jubilee Hills | Hyderabad | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-25. Retrieved 2021-09-13.
- ↑ Eenadu (4 December 2023). "హ్యాట్రిక్ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ admin (2019-01-07). "Jubilee Hills MLA Maganti Gopinath". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-09-13. Retrieved 2021-09-13.
- ↑ "Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-13.
- ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
- ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
- ↑ Andhrajyothy (27 January 2022). "హైదరా'బాద్‌షా' మాగంటి". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.
- ↑ "జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కథ!". Chitrajyothy. 5 June 2025. Archived from the original on 6 June 2025. Retrieved 8 June 2025.
- ↑ "జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత". Eenadu. 8 June 2025. Archived from the original on 8 June 2025. Retrieved 8 June 2025.
- ↑ "మాగంటికి కన్నీటి వీడ్కోలు". Andhrajyothy. 9 June 2025. Archived from the original on 9 June 2025. Retrieved 9 June 2025.
- ↑ "అందరివాడై.. అందని లోకాలకు". Eenadu. 9 June 2025. Archived from the original on 9 June 2025. Retrieved 9 June 2025.