1965, మే 8 న జన్మించిన షైనీ అబ్రహం (Shiny Abraham) భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. 800 మ్టర్ల పరుగుపందెంలో ఆమె 14 సంవత్సరాలపాటు జాతీయ చాంపియన్ గా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై 75 సార్లకు పైగా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 1985 లో జకర్తాలో జరిగిన ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీల నుంచి వరుసగా 6 సార్లు ఆసియా ట్రాక్ & ఫీల్డ్ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ సమయంలో ఆమె 7 బంగారు పతకాలను, 5 వెండి పతకాలను, 2 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అట్లే ఆమె పాల్గొన్న 7 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడలలో 18 బంగారు, 2 వెండి, పతకాలను సాధించింది.

షైనీ అబ్రహం
వ్యక్తిగత సమాచారం
జాతీయతIndian
జననం (1965-05-08) 1965 మే 8 (వయసు 58)
Thodupuzha, Idukki, కేరళ, India
క్రీడ
దేశం భారతదేశం
క్రీడTrack and field
పోటీ(లు)400 meters
800 meters
సాధించినవి, పతకాలు
వ్యక్తిగత అత్యుత్తమ(s)400 m: 52.12 s (1995)
800 m: 1:59.85 s (1995)

ప్రారంభ జీవితం మార్చు

షైనీ అబ్రహం 1965, మే 8 న కేరళలోని ఇడుక్కి జిల్లా థోడుపుఝా గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే షైనీకి అథ్లెటిక్స్ పై మక్కువ ఉన్ననూ కొట్టాయంలోని స్పోర్ట్స్ డివిజన్ లో ప్రవేశించిన పిదపే అందులో నైపుణ్యం సంపాదించింది. షైఇనీ అబ్రహం, పి.టి.ఉష, ఎం.డి.వల్సమ్మలు ఒకే డివిజన్ కు చెందిన వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందిననూ వారి ముగ్గురి కోచ్ పి.జె.దేవెస్లా.

క్రీడా జీవితం మార్చు

షైనీ అబ్రహం అంతర్జాతీయ క్రీడా జీవితం తన సహచరిణి అయిన పి.టి.ఉష తో సమానంగా ప్రారంభమైంది. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలతో వారిరువురి గమనం ఆరంభమైంది. షైనీ అంతకు ముందు ఏడాదే 800 మీటర్ల పరుగులో జాతీయ చాంపియన్ అయింది. అక్కడి నుంచి అథ్లెటిక్స్ నుంచి నిష్క్రమించేదాకా ప్రతీసారి షైనీ జాతీయ క్రీడలలో ఆ ఈవెంట్‌లో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆమె 4 ఒలింపిక్ క్రీడలతో పాటు 3 ఆసియా క్రీడలలో పాల్గొంది. 1984లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్ చేరి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 1986లో సియోల్ లో జరిగిన ఆసియా క్రీడలలో పరుగుపందెంలో తన ట్రాక్ లైన్‌ను దాటినందుకు అనర్హత పొందింది. ఆమె ఆ సమయంలో పతకం సాధించే దిశలో ఉండింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని పట్టుకొని ఒలింపిక్ క్రీడల మార్చ్‌ఫాస్ట్ లో జాతీయ పతాకాన్ని పట్టిన తొలి భారతీయ మహిళగా పేరు సంపాదించింది. ఆమె సాధించిన అత్యుత్తమ ప్రతిభ 1:58.8 నిమిషాలు. దీన్ని 1995లో చెన్నైలో జరిగిన దక్షిణాసియా క్రీడలలో నమోదు చేసింది. ఆమె ఆ సమయంలో తన కూతురు శిల్పాకు జన్మనిచ్చింది. అయినా మెరుగైన సమయాన్ని నమోదు చేయడం విషేశం. రెండు నిమిషాల లోపు సమయాన్ని నమోదుచేయడం కూడా ఇదే ప్రథమం.

వ్యక్తిగత జీవితం మార్చు

షైనీ అంతర్జాతీయ స్విమ్మింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత అయిన చెరియన్ విల్సన్ ను వివాహం చేసుకుంది. అతడు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ (క్రీడల)గా పనిచేస్తున్నాడు.

అవార్డులు మార్చు

 
పద్మశ్రీ పురస్కారం
  • షైనీ అబ్రహంకు 1985లో క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు లభించింది.
  • 1996 లో షైనీకు బిర్లా అవార్డు లభించింది
  • 1998లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రధానం చేసింది.
  • 1991లో చైనీస్ జర్నలిస్ట్ అవార్డు లభించింది.

వనరులు మార్చు