సంతోష్ శ్రీనివాస్
తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్.
సంతోష్ శ్రీనివాస్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్. కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ పనిచేసిన సంతోష్ శ్రీనివాస్, రామ్ పోతినేని హీరోగా వచ్చిన కందిరీగ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]
సంతోష్ శ్రీనివాస్ | |
---|---|
జననం | 18 జూలై, 1980 |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్ |
జీవిత విషయాలు
మార్చుసంతోష్, విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నంలోనే పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తిచేశాడు.[2]
సినిమారంగం
మార్చు2006లో వచ్చిన ఖతర్నాక్ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన సంతోష్ శ్రీనివాస్, తరువాత టక్కరి, రెయిన్‌బో వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.[3] దర్శకుడిగా తొలిచిత్రం 2011లో కందిరీగ సినిమా. ఇందులో రామ్ పోతినేని, హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.రామారావు, సమంత ప్రధాన పాత్రలలో రభస సినిమా తీశాడు.[4]
మూలాలు
మార్చుసంవత్సరం | సినిమా | విభాగం | మూలాలు |
---|---|---|---|
2006 | ఖతర్నాక్ | సినిమాటోగ్రఫీ | |
2007 | టక్కరి | సినిమాటోగ్రఫీ | |
2008 | రెయిన్ బో | సినిమాటోగ్రఫీ | |
2011 | కందిరీగ | దర్శకత్వం | |
2014 | రభస | దర్శకత్వం | |
2016 | హైపర్ | దర్శకత్వం | |
2021 | అల్లుడు అదుర్స్ | దర్శకత్వం, రచన |
మూలాలు
మార్చు- ↑ "Movie review - Kandireega". www.idlebrain.com. Retrieved 20 April 2021.
- ↑ "Exclusive Interview with Kandireega Director". www.myfirstshow.com. Archived from the original on 27 నవంబరు 2015. Retrieved 20 April 2021.
- ↑ "Santosh Srinivas interview". www.idlebrain.com. Retrieved 20 April 2021.
- ↑ "NTR – Santosh Srinivas film launch". www.idlebrain.com. Retrieved 20 April 2021.