సంత్ రామారావు మహారాజ్

సంత్ రామారావు మహారాజ్ (07 జూలై 1935 - 31 అక్టోబర్ 2020) మహారాష్ట్ర లోని వాసీం జిల్లా మనోరా తాలూకాలోని పౌరహాదేవి తీర్థ క్షేత్ర పీఠాధిపతి.సంత్ సేవాలాల్, జగదాంబ దేవి భక్తుడు.బంజారా సమాజపు ఆధ్యాత్మిక ధర్మ గురువు [1].

సంత్ రామారావు మహారాజ్
సంత్ రామారావు మహారాజ్ యొక్క చిత్రపటం
నిర్గుణ నిరంకారి తపస్వి సంత్ రామారావు మహారాజ్
జననంజూలై 07 , 1935 గురు పూర్ణిమా, శుక్రవారం
పౌరహాదేవి,తాలుకా; మనోరా జిల్లా;వాసీం ( మహారాష్ట్ర)
మరణంఅక్టోబర్ 31,2020 (కోజాగిరి పూర్ణిమ, శుక్రవారం ) లీలావతి ఆసుపత్రి
ముంబై లీలావతి ఆసుపత్రి ముంబై , మహరాష్ట్ర భారతదేశం
వృత్తి బంజారా సామాజిక సంస్కర్త
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆధ్యాత్మిక ధర్మ గురువు Spiritual Leader of Banjara Community, సంత్,రాజయోగి , బాల బ్రహ్మచారి సంత్ సేవాలాల్ మహారాజ్,జగదాంబ దేవి భక్తుడు,పౌరహాదేవి బంజారా కాశీ పిఠాధిపతి
తల్లిదండ్రులు
  • పరశురామ్ (తండ్రి)
  • పూతళాయాడి (తల్లి)

బాల్య జీవితం మార్చు

ఉప్పుబాల బ్రహ్మచారి తపస్వీ రామారావు మహారాజ్ గురు పూర్ణిమ రోజున మహారాష్ట్ర లోని వాసీం జిల్లా మనోరా తాలుకాలోని పావన భూమి పౌరహాదేవి అనే పుణ్య క్షేత్రంలో 07 జూలై 1935 శుక్రవారం రోజు న జన్మించారు. మహారాజ్ తండ్రి పేరు పరశురామ్ మహారాజ్ తల్లి పేరు పూతళా యాడి ‌రాథోడ్ గోత్రం లోని రామావత్ ఉప గోత్రానికి చెందిన సంత్ సేవాలాల్ మహారాజ్ వంశంలోని ఏడో తరానికి చెందినవాడు.పన్నెండేళ్ల వయసులో,సంత్ రామరావు మహారాజ్ తన పాఠశాల విద్యను విడిచిపెట్టి భక్తి మార్గాన్ని అనుసరించాడు. అప్పటి నుండి జీవితాంతం వరకు అతను ఆహారం మానేశాడు.వారి ఆహారం పండ్లు, ఆవు పాలు మాత్రమే. మహారాజ్ పెళ్ళి చేసుకోకుండా తన సమాజం కోసం బ్రహ్మచారిగా ఉండిపోయాడు.1948 లో అతను పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నపుడు మహారాష్ట్రలోని వివిద ప్రాంతాలలోని యాబై రెండు తాండలకు చెందిన నాయక్, కారోబారి, సమాజ ప్రముఖులు అందరు కలసి బంజారా సంప్రదాయం ప్రకారం అతనిని సంత్ సేవాలాల్ మహారాజ్ సింహాసనం మీద కూర్చో బెట్టి శుభ ముహూర్తంలో తేది:25 జూన్ 1948న పట్టాభిషేకము చేశారు. అప్పడు మహారాజ్ బంజారా సాంప్రదాయం ప్రకారం మహంత్ బిరుదును అందుకోని పుణ్యక్షేత్రమైన బంజారాల కాశీ పౌరహా దేవికి మఠాధిపతి గా ఏకగ్రీవంగా నియమించబడ్డాడు.

సంత్ శ్రీ రామరావు మహారాజ్ పన్నెండేళ్లు మౌనంగా ఉన్నా తర్వాత ఇరువై నాల్గు ఏళ్ళ వయస్సులో దేశ పర్యటన ప్రారంభించారు. ఆ సమయంలో అతను భక్తులకు వివిధ మార్గాల్లో బోధించాడు దీక్ష చేశాడు.సంత్ సేవాలాల్ మహారాజ్ మాతా జగదాంబ దేవిని పూజిస్తున్నప్పుడు,నా పౌరహా దేవి మందిరంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదాంబ దేవికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తానని కలలు కన్నాడు. చిన్ననాటి కథ ఏమిటంటే, సంత్ శ్రీ రామరావు మహారాజ్ తండ్రి పరశురామ్ మహారాజ్ ఒక ఆచారం పూనుకున్నాడు. బంజారాల అరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ తల్లి జగదాంబ ఆలయానికి బంగారు కిరీటం ఉండాలని అతను కలలు కన్నాడు అతను జీవితంలో ఒక కథ ఎప్పుడూ చెప్పేవాడని పెద్దలు అంటుంటారు. పరశురామ మహారాజ్ భక్తుల నుండి వచ్చిన ధనాన్ని అగ్నిలో సమర్పించేవారు. చాలా మంది భక్తులు బాబా, మీరు ఇలా ఎందుకు చేసారు ? అని ప్రశ్నించే వారు అప్పుడు పరశురామ మహారాజ్ "నేను ఈ డబ్బును బ్యాంకు లో జమ చేస్తున్నాను. ఆ తర్వాత ఆ మహానుభావుడు రాగానే మాతృమూర్తి జగదాంబ,సంత్ సేవాలాల్ మహారాజ్‌ల గుడిలో బంగారు కిరీటం ప్రతిష్ఠించ బడుతుందని, నా సమాజం మొత్తం చూస్తుంది అని అనేవారు. అద్భుతమైన, దైవిక ఆలయం.అటువంటి శాశ్వతమైన ఆరాధన ! భగవంతుని పై ఉన్న భక్తి కారణంగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఈ దైవభక్తి వల్లే మహారాజ్ జన్మించాడని చెబుతారు.

సామాజిక సంస్కర్త మార్చు

సంత్ రామరావ్ మహారాజ్ ఇరువై నాల్లు ఏళ్ల వయస్సులో భారతదేశం లోని అన్ని బంజారా తాండలో వాడల్లో పర్యటించారు.బంజారా సమాజం యొక్క అనేక తాండవాడ-ఆవాసాలలో బంజారా ప్రజలు పేదరికం లో బతుకుతున్నా రని,మన సమాజ ప్రజలు పేదవారు, బలహీనులు మన సమాజాన్ని మనం ఉద్ధరించుకోవాలి దేవుడు మన సమాజాన్ని ఆశీర్వదిస్తాడు.దాని గురించి ఏదైనా ప్రయత్నం చేయాలనే గొప్ప ఆలోచనతో కంకణం కట్టుకున్నారు. సమాజంలో అజ్ఞానాన్ని పోగొట్టగలమా? సమాజంలో మూఢనమ్మకాలను తొలగించగలమా? ఇలా ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి.సమాజాన్ని కొత్త పురోగమనం వైపు నడిపించగలమన్న భావనతో ఆయన పనిచేశారు. సమాజంలోని నిరక్షరాస్యతను వీడి అక్షరాస్యత ను సద్వినియోగం చేసుకొని మిషనరీలు, మతమార్పిడి సమ్మేళనాల నుండి సమాజాన్ని రక్షించడానికి సంత్ రామారావు మహారాజ్ అవిశ్రాంతంగా కృషి చేశారు. రామరావు మహరాజ్ తాండ తాండకు వెళ్లి గోర్ బంజారా ప్రజలను చైతన్యం చేశారు.సంత్ సేవాలాల్ మహారాజ్ మాతా జగదాంబ దేవి ఆశీర్వాదంతో భారతదేశం మొత్తం పర్యటించడం ద్వారా అతను తన సమాజాన్ని కొత్త దిశకు తీసుకెళ్లి గొప్ప కీర్తిని చాటారు.రామరావ్ మహారాజ్ సామాజిక రాజకీయ వర్గాలను సమాన దృష్టితో చుశారు.

దేశంలోని పెద్ద రాజకీయ,సామాజిక వ్యక్తులతో ఆయకున్న సంబంధం చాలా ముఖ్యమైనది.సాధు సంప్రదాయం ఉన్న వ్యక్తి కావడంతో పలువురు ప్రముఖులు ఆయనను దర్శించుకునేవారు.మహారాజ్ మొత్తం సమాజంలోని అట్టడుగు మూలాలకు వెళ్లి తన సనాతన హైందవ మతాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన భక్తి ధర్మాన్ని మన హిందూ ధర్మంగా సమర్థించారు. మంచి పనులు చేయండి, తద్వారా చెడు ఆలోచనలు తొలగిపోతాయి మనం ఎప్పుడు మంచి ఆలోచనలతో జీవించాలి. మనం జీవితంలో పురోగ మించాలంటే ఈ లోకాలలో జీవించి మంచి పనులు మాత్రమే చేయగలం మన అడుగుడుగునా జగదాంబ దేవి యొక్క అనుగ్రహం, అనుభూతిని పొందాలి. ప్రతి తాండలో సంత్ సేవాలాల్ మాహారాజ్,జగదాంబదేవి గుడి కట్టాలని ఆ మహానియుని జయంతిని పురస్కరించుకొని,భజన కీర్తన కార్యక్రమాలు,పారాయణ భాగవత్ కథ వంటి అనేక మార్గాలపై సమాజంలో అవగాహన కల్పించాలి.మొత్తంమీద రామరావు మహారాజ్ ఆధ్యాత్మిక భక్తి ధార్మిక కృషి, సామాజిక సేవ చాలా ముఖ్యమైనవిగా మారాయి.మహారాజ్ యాబై ఏళ్లలో లక్షల మందిని వ్యసనాల నుండి విముక్తి చేసాడు. ప్రతి తాండలో తిరుగుతూ బంజారా సమాజంలో అవగాహన కల్పించారు.సమాజాన్ని మూఢనమ్మకాల నుండి దూరం చేశాడు చెడువ్యసనాల వలన అనేక కుటుంబాలు నాశనం అయినాయని సమాజాన్ని హితోపదేశం చేశారు.దాని వలన పేదరికమే ప్రత్యామ్నాయం అని అన్నారు. అతను నిరంతరం ఒక బలమైన సమాజాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడు చెడు వ్యసనాలతో మనిషి బానిస కాకూడదు ప్రతి ఒక్కరు సమాజంలో సమానంగా కష్టపడి వ్యవసాయం చేస్తూ మన సంస్కృతిని పెంపొందించాలి.లక్షలాది మంది యువకుల జీవితాలు విద్యతో ప్రభావితమయ్యాయి మహారాజ్ విద్యను తప్పక చదవాలని పట్టుబట్టారు.గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించేవారు.

సామాజిక సేవా మార్చు

సంత్ రామరావ్ మహారాజ్ సామాజిక వర్గాలకను, రాజకీయ వర్గాలను సమాన దృష్టితో చూశారు. ఈ లోకంలో పెద్ద రాజకీయ, సామాజిక వ్యక్తులతో ఆయనకున్న సంబంధం చాలా ముఖ్య మైనది. సాధు సంప్రదాయం ఉన్న వ్యక్తి కావడంతో పలువురు ప్రముఖులు ఆయనను దర్శించుకునేవారు. మహారాజ్ మొత్తం సమాజంలోని అట్టడుగు మూలాలకు వెళ్లి తన సనాతన హైందవ మతాన్ని వ్యాప్తి చేశాడు. ఆయన భక్తి ధర్మాన్ని మన హిందూ ధర్మంగా సమర్థించారు. మంచి పనులు చేయండి, చెడు పనులు చేయకండి మంచి పనులు ద్వారా చెడు ఆలోచనలు తొలగిపోతాయి. మనం ఎప్పుడూ మంచి ఆలోచనలతో పాజిటివ్ థింకింగ్ జీవించాలి. మనం మన జీవితంలో పురోగమించాలంటే ఈ లోకంలో జీవించి మంచి పనులు మాత్రమే చేయాలి.మనం అడుగడుగునా జగత్ జననీ జగదాంబ దేవి యొక్క అనుగ్రహం అనుభూతిని పొందాలి. ప్రతి తాండలో సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి దేవాలయం కట్టాలి, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని, భజన కీర్తన కార్యక్రమాలు,భగవత్ కథ పారాయణం వంటి అనేక మార్గాలపై సమాజంలో అవగాహన కల్పించాలి.

మొత్తంమీద గోర్ బంజారా సమాజంలో సంత్ రామరావ్ మహారాజ్ ఆధ్యాత్మిక , ధార్మిక కృషి, సామాజిక సేవ చాలా ముఖ్యమైనవిగా మారాయి. మహరాజ్ యాబై ఏళ్లలో లక్షల మందిని వ్యసనాల నుండి విముక్తి చేసాడు. గ్రామ గ్రామాన తిరుగుతూ సమాజంలో అవగాహన కల్పించారు. సమాజాన్ని చైతన్యం చేశారు.బంజారా సమాజాన్ని మూఢనమ్మకాలతో దూరం చేశారు. మద్యపానం సేవించడం వలన అనేక కుటుంబాలు వ్యసనాలకు బానిసలై అనేక కుటుంబాలు నాశనం అయినాయి అని సమాజాన్ని హితోపదేశం చేశారు. అతను నిరంతరం ఒక బలమైన సమాజాన్ని సృష్టించడానికి ప్రయత్నించాడు ఎందుకంటే సమాజం సమానంగా కష్టపడి, వ్యవసాయ, సంస్కృతిని పెంపొందించింది. లక్షలాది మంది యువకుల జీవితాలు విద్యతో ప్రభావితమయ్యాయి, మహారాజ్ విద్యను తప్పక చదవాలని పట్టుబట్టారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు.

పురస్కారాలు మార్చు

సంత్ రామారావు మహారాజ్ సమాజం కోసం ఆయన చేసిన గొప్ప కృషికి గుర్తింపుగా కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం అతనికి డి.లిట్ ప్రధానం చేసింది. సన్మానాలతో పాటు పట్టా ప్రధానం చేశారు. ఆయనకు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్మానించి ఆయనను సత్కరించారు. మహారాష్ట్ర లోని ఎవత్మాల్ మాజీ పార్లమెంటు సభ్యులు హారిభావు రాథోడ్ సంత్ రామారావు మహారాజ్ బంజారా సమాజానికి చేసిన కృ‍షికి పద్మ భూషణ్ పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరణం మార్చు

సంత్ రామారావు మహారాజ్ (86) [2]గత కొంత కాలంగా శ్వాస సమస్యతో బాధపడుతు ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. నెలన్నర రోజులు గడిచినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో నే తేది:31 అక్టోబరు 2020 న కోజాగిరి పూర్ణిమ రోజు శుక్రవారము న రాత్రి పదకొండు గంటలకు తుదిశ్వాస విడిచారు[3].అయన భౌతికకాయాన్ని భక్తుల సందర్శన నిమిత్తం ఆదివారం రోజంతా ఉంచి సోమవారం రోజున పౌరహాదేవి తీర్థస్థలంలో ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు[4].

మూలాలు మార్చు

  1. "51801415 - Online Store". superbloov.life. Archived from the original on 2024-02-25. Retrieved 2024-03-10.
  2. "Ramraoji Maharaj, spiritual leader of Banjara community, dead". Financialexpress (in ఇంగ్లీష్). 2020-10-31. Retrieved 2024-03-13.
  3. DHNS. "Ramraoji Maharaj, spiritual leader of Banjara community, passes away". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-03-13.
  4. EDITOR (2020-11-01). "సంత్ శ్రీ రామారావు మహరాజ్ మృతి యావత్ బంజార జాతికి తీరనిలోటు" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-03-10.