సదా మీ సేవలో నీలకంఠ దర్శకత్వంలో 2005 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో వేణు, శ్రీయ ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట శ్యాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు. షో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న నీలకంఠ మూడో ప్రయత్నం ఈ సినిమా. సైకాలజీలో నిపుణుడైన కథా నాయకుడు, ఓ లాయరు, మాజీ పోలీసుతో కలిసి తెలివిగా ప్రజలకు న్యాయ సహాయం చెయ్యడమన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం.

సదా మీ సేవలో
దర్శకత్వంనీలకంఠ
రచననీలకంఠ (కథ, చిత్రానువాదం, సంభాషణలు)
నిర్మాతవెంకట శ్యాంప్రసాద్
తారాగణంతొట్టెంపూడి వేణు
శ్రేయ
ఛాయాగ్రహణంకె. ప్రసాద్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఎస్. పి. ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
మార్చి 25, 2005 (2005-03-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

తిలక్ (వేణు) తన స్నేహితులైన ఓ లాయర్ (సునీల్), ఓ మాజీ పోలీసు (మల్లికార్జున రావు) లతో కలిసి న్యాయపరమైన సమస్యలను తీర్చడానికి సదా మీసేవలో అనే ఒక కన్సల్టింగ్ సంస్థను నడుపుతుంటాడు. తిలక్ మానసిక శాస్త్రంలో నిపుణుడు. మైండ్ గేం ఆడి తన తెలివి తేటలతో కోర్టు బయటే సమస్యలను పరిష్కరించడం ద్వారా ఇతరులకు సహాయపడుతుంటాడు. అసహాయ పరిస్థితుల్లో ఉన్న జనాలకు సహాయం చేయడానికి ఎలాంటి ట్రిక్కులు ప్లే చేసినా పరవాలేదని అతని అభిప్రాయం. తిలక్ సూర్యకాంతం (శ్రీయ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వాళ్ళను ఎదిరించి అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. కానీ పెళ్ళైన తరువాత తిలక్ న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడనీ, రౌడీల నుంచి గూండాల నుంచి అతని ప్రాణాలకు ముప్పు ఉందని తెలుస్తుంది. అతను పరులకు సహాయం చేసి తన నెత్తిమీదకు తెచ్చుకోవడం ఆమెకు నచ్చదు. సదా మీ సేవలో మూసేయమని భర్తతో పోరాడుతుంది. ఇంతలో తిలక్ విరోధులు కొంతమంది ఆమెను అపహరిస్తారు. తిలక్ ఆమెను ఎలా కాపాడుకున్నాడో, వ్యక్తిగత స్వార్థం కంటే ఇతరులకు సాయపడటం ఎంత మంచిదో ఆమెకు తెలియజెప్పడం మిగతా కథ.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • ఈ దూరం , రచన: కందికొండ , గానం.సోనూ నిగమ్, శ్రేయా ఘోషల్
  • ఏం నవ్వులివీ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కె కె . శ్రేయా ఘోషల్
  • హాల్లో హాల్లో , రచన: కందికొండ , గానం.అభిజీత్ భట్టాచార్య
  • ఓ మేఘమాల , రచన: కందికొండ , గానం.ఉదిత్ నారాయణ, ఉష
  • లబ్ డబ్ , రచన: చైతన్య ప్రసాద్ , గానం.శంకర్ మహదేవన్
  • చెలీ చేరుమరి, రచన: కందికొండ , గానం. కార్తీక్, కౌసల్య.

విడుదల, స్వీకారం

మార్చు

మార్చి 25, 2005న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది. ఐడిల్ బ్రెయిన్ సమీక్ష దీన్ని ఒక సగటు సినిమాగా భావించి 3/5 రేటింగ్ ఇచ్చింది. రెడిఫ్ ఈ సినిమాను ఓ విఫల ప్రయోగంగా పేర్కొనింది.[2]

మూలాలు

మార్చు
  1. జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో సదా మీ సేవలో సినిమా సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 22 November 2016.
  2. బి., అనురాధ. "రెడిఫ్.కాం లో సదా మీ సేవలో సినిమా సమీక్ష". rediff.com. rediff.com. Retrieved 28 November 2016.

బయటి లింకులు

మార్చు