సమాజం, ఆచారాల అధ్యయనం
డాక్టర్ బ్రూస్ టేపర్, తన సమాజ పరిశోధనలను (Rivalry -Tribute) దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలోని గ్రామాలలో నివశిస్తున్న గ్రామీణ సమాజం, ఆచారాలను అధ్యయనం ఈ గ్రంధంలో (ఇంగ్లీష్) లో వివరించారు. ఈ గ్రంథం 1970 లో గ్రామ సమాజనికి దర్పణంలాంటింది.
ఈ గ్రంథంలో విశాఖపట్నం జిల్లా, సబ్బవరం మండలంలోని ఆరిపాకలో సమాజనికి సంస్కృతికి మధ్య ఉన్న సంబంధం పై అధ్యయనం చేసి వివరించబడింది. మనుష్యులు వారి పరివారం మధ్య ఉన్న పోటీ పధ్హతులను, వారి జీవితాలలో హిందూమతం గొప్ప తనాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో చెరకు పండించే గవర రైతుల జీవనంలో ధనం, ఆధికారాలలో కలిగిన చారిత్రిక, సమకాలీన (1970) మార్పులు వివరించబడ్డాయి.
ఈ గ్రంథంలో భూస్వామ్యం, వడ్డీ వ్యాపారం, ఆస్తి పాస్తులు, విడాకులు, తగువులు తీర్చడం, నాయకత్వం, కులాల మధ్య వ్యాపార సంబంధాలు గురించి ఉదాహరణలతో సహా వివరణలు ఇవ్వబడ్డవి. ఆన్నదమ్ముల మధ్య విభేదాలు, భార్య భర్తల మధ్య ఘర్షణలు, కులాల మధ్య ఆంతరాలు, గ్రామ అభివృద్ధిలో పోటీలు వివరించబడ్డాయి. పండుగల సంప్రదాయాలు, వాటిలో వచ్చే తగువులు గ్రంథస్తం చేయబడ్డవి. సమాజంలో ఉన్న వ్యవస్థ - క్రమం (వయస్సు, లింగ భేదాలు, కుల భేదాలు, పరస్పర బాధ్యతలు (కులాల మధ్య, పరివారాల మధ్య) గుర్తించబడ్దవి.
ఈ గ్రంథంలో నమ్మకాలు, దేవతల పట్ల విశ్వాసాలు, శక్తి (మహిళా) దేవతలు ఆరాధన, జ్యోతిష్యం, దిష్టి మొదలైన పద్ధతుల గొప్పదనాన్ని సామజిక దృక్పధంలో వివరించబడ్డవి. (దేవుని) పూజ గొప్పదనం సమాజ నిర్మాణికి, ఆరోగ్యానికి, అభివృద్ధికి ఉపయోగ పడే విధానం ఈ గంధమంతయులో కనపడుతుంది..
సంవత్సారాంతం జరిగే పండుగలు (ఋతువుల పండుగ లు, వ్యవసాయ పండుగలు), వాటినిగా పోటీగా జరిపే సమాజంపై వాటి మంచి ప్రభావాలు వివరించబడ్డాయి[1]
మూలాలు
మార్చు- ↑ Tapper, Bruce. Rivalry and Tribute: Society and Ritual in a Telugu Village in South India (in English). Hindustan Publishing Corporation. pp. Front cover. ISBN 81-7075-003-2.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)