సమ్మక్క-సారక్క (సినిమా)

సమ్మక్క-సారక్క 2000 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రోజా, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.[1]

సమ్మక్క-సారక్క
దర్శకత్వందాసరి నారాయణ రావు
తారాగణంరోజా,
సుమన్,
రమ్యకృష్ణ
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2000
భాషతెలుగు

మేడారం సమ్మక్క సారక్క జాతర ఎందుకు జరుపుకుంటారో తెలియజేస్తూ చిత్ర కథ ప్రారంభం అవుతుంది. ఆ జాతరలోనే భర్తను కోల్పోయిన ఒకామె ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిస్తుంది. వాళ్ళ బామ్మ వారికి సమ్మక్క సారక్క అని నామకరణం చేస్తుంది. అదే ఊర్లో ఉండే భూస్వామి కొడుకు కనిపించిన ఆడపిల్లలనంతా చెరబడతుంటాడు. సమ్మక్క సారక్కలు కూడా భూస్వామి నిర్భందానికి గురవుతారు. కానీ వాళ్ళ బామ్మ వారిని అక్కడి నుంచి తెలివిగా తప్పించి వేరే ఊర్లో పెంచుతుంది. వాళ్ళు పెద్దైన తర్వాత భూస్వామి దగ్గర పనిచేసే ఇద్దరు పనివాళ్ళు వాళ్ళను పెళ్ళి చేసుకుంటారు. కానీ భూస్వామి వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళ భర్తలను చంపి లొంగదీసుకోవాలనుకుంటాడు. కానీ సమ్మక్క సారక్కలు కలిసి భూస్వామిని చంపేస్తారు. సమ్మక్క భూస్వామి చెర నుంచి తప్పించుకుని పెద్దన్న బృందంలో నక్సలైట్లతో చేరుతుంది. సారక్కను మాత్రం భూస్వామి కుటుంబ సభ్యులు నానారకాలుగా హింసకు గురిచేస్తుంటారు.

నక్సలైట్ల బృందం భూస్వామి కూతురిని అపహరించి ఆమెను విడిచిపెట్టాలంటే బదులుగా సారక్కను విడిచిపెట్టాలని చెబుతారు. కానీ వాళ్ళు సారక్కను చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. ఆగ్రహించిన నక్సలైట్లు భూస్వామి బంగళాను సర్వనాశనం చేస్తారు. అప్పటికే పోలీసులు వచ్చి వారిని చుట్టుముడతారు. కానీ వాళ్ళు తెలివిగా తెప్పించుకుని భూస్వామి బంధువులను తమతో తీసుకెళ్ళి మేడారం జాతర దగ్గరకు తీసుకెళ్ళిపోతారు. చివరికి ఏం జరిగిందనేది మిగతా కథ.

తారాగణం

మార్చు

సంగీతం

మార్చు

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.

  • అందాల మా ఊరి అక్కా చెల్లెళ్ళే

మూలాలు

మార్చు
  1. "Idle Brain". www.idlebrain.com. Retrieved 2020-07-19.