సరబ్‌జిత్ సింగ్ ఖల్సా

సరబ్‌జిత్ సింగ్ ఖల్సా భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

సరబ్‌జిత్ సింగ్ ఖల్సా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు మహ్మద్ సాదిక్
నియోజకవర్గం ఫరీద్‌కోట్

వ్యక్తిగత వివరాలు

జననం (1979-11-01) 1979 నవంబరు 1 (వయసు 44)
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు బియాంత్ సింగ్, బిమల్ కౌర్ ఖల్సా
బంధువులు బాబా సుచా సింగ్ (తాత)
నివాసం మొహాలి

సరబ్‌జిత్ సింగ్ ఖాల్సా మాజీ ప్రధానమంత్రిని ఇందిరా గాంధీని ఆమె నివాసంలో చంపడానికి కారణమైన ఇద్దరు హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు. ఆయన తల్లి బిమల్ కౌర్ 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రోపర్ నియోజకవర్గం నుండి, తాత బాబా సుచా సింగ్ బటిండా నుండి పార్లమెంటు సభ్యులుగా పని చేశారు.[2][3][4]

రాజకీయ జీవితం

మార్చు

సరబ్‌జిత్ సింగ్ ఖల్సా 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో బదౌర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 15,702 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బటిండా లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 1,13,490 ఓట్లు సాధించి ఓడిపోయాడు. సరబ్‌జిత్ సింగ్ ఖల్సా 2009లో బటిండా నియోజకవర్గం నుండి, 2014లో ఫతేగఢ్ సాహిబ్ (రిజర్వ్డ్) నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]

సరబ్‌జిత్ సింగ్ ఖల్సా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి కరంజీత్‌ అనుమోల్‌పై 70,053 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. The Times of India (6 June 2024). "Sarabjit Singh Khalsa's grandfather, mother had won parliamentary elections in 1989". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  3. Mint (11 April 2024). "Lok Sabha polls: Who is 12th dropout Sarabjit Singh Khalsa, son of Indira Gandhi's assassin, contesting from Punjab?". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  4. The Economic Times (6 June 2024). "Father didn't care and laid down his life, Sikh community pulled family through troubled times: Sarabjit Singh Khalsa". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  5. The Economic Times (9 March 2014). "Indira Gandhi assassin's son Sarabjit Singh Khalsa joins BSP". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Faridkot". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.
  7. V6 Velugu (5 June 2024). "ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు గెలుపు". Archived from the original on 17 June 2024. Retrieved 17 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)