సర్దార్ దండు నారాయణ రాజు

దండు నారాయణ రాజు (అక్టోబరు 15, 1889 - సెప్టెంబర్ 10, 1944) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.

దండు నారాయణ రాజు
దండు నారాయణ రాజు
జననందండు నారాయణ రాజు
అక్టోబరు 15, 1889
భీమవరం తాలూకా నేలపోగుల
మరణంసెప్టెంబర్ 10, 1944
తంజావూరు జైలు
ఇతర పేర్లుదండు నారాయణ రాజు
వృత్తిన్యాయవాది
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధులు
మతంహిందూ
భార్య / భర్తసుబ్బయమ్మ
తండ్రిభగవాన్ రాజు
తల్లివెంకాయమ్మ

జీవిత విశేషాలు మార్చు

శ్రీ దండు నారాయణ రాజు భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు, వెంకాయమ్మ దంపతులకు అక్టోబరు 15, 1889 న జన్మించారు. ఈయన నర్సాపురం తాలూకా పోడూరులో ప్రాథమిక విద్యను, తణుకు ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి, విద్యారంగంలోను, క్రీడారంగంలోను ప్రతిభతో 1907 సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులైయ్యారు. మద్రాసు ప్రెసిడెంషీ కళాశాలలో బి.ఎ పట్టా పొందారు. 1910 వ సంవత్సరంలో మహదేవపట్నం కాపురస్తులు శ్రీ కలిదిండి వెంకట్రామరాజుగారి కుమార్తె సుబ్బయమ్మను వివాహమాడారు. తణుకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా, బి.ఎల్ ఉత్తీర్ణులై హైకోర్టు వకీలుగా, ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు.

దండు నారాయణరాజు గారు 1921లో న్యాయవాద వృత్తిని పరిత్యజించి మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమంలో చేరారు. శ్రీ అల్లూరి సీతారామరాజు విప్లవం సందర్భంలో ప్రభుత్వంవారు నారాయణరాజుని కాకినాడలో అరెస్టు చేసి 17 రోజులు జైలులో ఉంచి తుదకు నిర్దోషి అని తెలుసుకొని విడుదల చేశారు. 1927 లో మద్రాసు శాసన సభకు పోటీ చేసి గెలిచారు. 1930 లో మహాత్మాగాంధీగారి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు నాయకుడై తన సహచరులతో ఏలూరు నుండి సముద్రతీరమున తూర్పుతాళ్ళు గ్రామం వరకూ నడచి ఉప్పుసత్యాగ్రహం చేశారు. అప్పుడే ఈయనకు సర్దార్ అను బిరుదు వచ్చింది. ఈ సందర్భంలో ప్రభుత్వం వీరిని ఒక సంవత్సరం పాటూ నిర్భందంలో ఉంచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈయన ఖద్దరు వ్యాప్తికై విశేష ప్రచారం చేశారు. ఖద్దరు బోర్డుకు 1923 నుండి 1926 వరకూ అధ్యక్షులుగా వ్యవహరించారు. హరిజన, రైతు ఉద్యమాల్లో పాల్గొని వారి అభ్యుదయానికై పాటుపడ్డారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్న వీరు తంజావూరు జైలులో సెప్టెంబర్ 10 1944 న స్వర్గస్తులైయ్యారు. ఈ విషయములు శ్రీ బుద్ధరాజు వరహాల రాజు గారి శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరములో ప్రచురితమైనవి.

సూచికలు మార్చు

యితర లింకులు మార్చు