సలీల్ అంకోలా
సలీల్ అశోక్ అంకోలా (జననం 1 968మార్చి 1) భారతదేశం తరపున 1989 నుండి 1997 వరకు ఒక టెస్ట్ మ్యాచ్, 20 వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు) ఆడిన అంతర్జాతీయ క్రికెటర్. రైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలరైన అంకోలా, ముంబై తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. ముంబై జట్టు కోసం అంకోలా నిలకడ ఆట కారణంగా 1989-90లో భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించినపుడు అందులో అతనికి స్థానం లభించింది. కరాచీలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ తర్వాత, అతను గాయాల కారణంగా సిరీస్‌లోని తదుపరి మ్యాచ్‌లలో ఆడలేదు. కొంత కాలం పాటు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన తర్వాత, 1993లో అంకోలాకు భారత వన్‌డే జట్టులో చోటు దొరికింది. చివరికి 1996 క్రికెట్ ప్రపంచ కప్ జట్టులో భాగమయ్యాడు. పేలవమైన ఫీల్డింగు కారణంగా అతన్ని, తదుపరి సిరీస్ తర్వాత జట్టు నుండి తొలగించారు. 28 సంవత్సరాల వయస్సులో అంకోలా, అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరై, నటనను చేపట్టాడు. అప్పటి నుండి అతను అనేక భారతీయ సోప్ ఒపెరాలలో, కొన్ని బాలీవుడ్ సినిమాలలో కనిపించాడు. 2020లో ముంబై క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యాడు. [1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సలీల్ అశోక్ అంకోలా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | అంకోలా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక | 1968 మార్చి 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 185 cమీ. (6 అ. 1 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 186) | 1989 నవంబరు15 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 72) | 1989 డిసెంబరు 18 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 ఫిబ్రవరి 13 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1988–1990 | మహారాష్ట్ర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990–1997 | ముంబై | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 మార్చి 11 |
క్రికెట్ కెరీర్
మార్చుప్రారంభ విజయాలు
మార్చుకర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా పట్టణంలో, కొంకణి మాట్లాడే కుటుంబంలో 1968లో జన్మించిన సలీల్ అంకోలా 1988-89లో మహారాష్ట్ర తరపున 20 ఏళ్ల వయసులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ప్రవేశం చేశాడు.[2] గుజరాత్‌పై ఆడిన తొలి మ్యాచ్‌లో 43 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్‌తో సహా ఆరు వికెట్లు తీసుకున్నాడు. [3] [4] తరువాతి మ్యాచ్‌లో బరోడాపై 51 పరుగులకు ఆరు వికెట్లు తీసుకున్నాడు.[5] మొత్తంమీద, అతను సీజన్‌లో మూడు ఐదు వికెట్ల పంటలతో సహా 20.18 సగటుతో 27 వికెట్లు తీసుకున్నాడు. సీజన్‌లో స్థిరమైన ప్రదర్శనల కారణంగా, 1989-90లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు ఎంపికయ్యాడు. BCCP ప్యాట్రన్స్ XIతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతను మొదటి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకు ఆరు వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లను సేకరించాడు, తద్వారా అతని సంఖ్య ఎనిమిది వికెట్లకు చేరుకుంది. [6]
ఫస్ట్ క్లాస్ క్రికెట్
మార్చుసచిన్ టెండూల్కర్, వకార్ యూనిస్‌లతో కలిసి కరాచీలో జరిగిన పర్యటనలో మొదటి టెస్ట్ సందర్భంగా అంకోలా తన తొలి టెస్టు ఆడాడు.[7] ఆ ఇద్దరూ తమతమ కెరీర్లలో విజయవంతమైన క్రికెటర్లుగా మారారు.[8][9] డ్రా అయిన మ్యాచ్‌లో అంకోలా 128 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తగిలిన గాయాల కారణంగా సిరీస్‌లోని మిగిలిన టెస్టుల్లో ఆడలేదు.[2]
డ్రా అయిన ఆ టెస్ట్ సిరీస్ తరువాత అంకోలాకు వన్డే సిరీస్‌కి పిలుపొచ్చింది. అతను మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండోదానిలో వన్డే ప్రవేశం చేసాడు. బ్యాడ్ లైట్ల కారణంగా మొదటి వన్‌డే రద్దైంది. అంకోలా 26 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. భారత్‌కు ఒక ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన దశలో రెండో ఇన్నింగ్స్‌లో అతను 10వ స్థానంలో బ్యాటింగుకు వచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ బౌలింగులో తాను ఎదుర్కొన్న మొదటి బంతిని అంకోలా సిక్సర్ కొట్టాడు, కానీ భారత్ చివరికి ఆ మ్యాచ్ ఓడిపోయింది. [10] తర్వాతి మ్యాచ్‌లో, ప్రేక్షకుల అంతరాయం కారణంగా మ్యాచ్ రద్దు కావడానికి ముందు అతను కేవలం 2.3 ఓవర్లు (15 బంతులు) బౌలింగ్ చేశాడు. దేడీయ సిరీస్‌లు విదేశీ పర్యటనలలో టెస్టు జట్టులో ఎంపికైనప్పటికీ, అతనికి జట్టుకు ఆడే అవకాశం రాలేదు. ఒక్క గేమ్ కూడా ఆడకుండా జట్టు నుండి తొలగించబడడాన్ని క్రికెట్ సర్కిల్‌లలో "అంకోలాడ్" అని పిలుస్తారు. [11] అయితే, అంకోలా వన్డే క్రికెట్‌ను కొనసాగించాడు. 1990ల ప్రారంభంలో, అతను అబే కురువిల్లా, పారస్ మాంబ్రే, నీలేష్ కులకర్ణి, సాయిరాజ్ బహుతులే వంటి ఇతర బౌలర్లతో పాటు ఫ్రాంక్ టైసన్ దగ్గర శిక్షణ పొందాడు. అంకోలా ప్రధానంగా పేస్ కాకుండా తన శైలిని మార్చుకునే పనిలో పడ్డాడు. [12] [13]
ఈ కాలంలో, అంకోలా పరిణీతను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[11]
మూడు సంవత్సరాల వ్యవధి తర్వాత, అంకోలా స్వదేశంలో ఇంగ్లాండ్, జింబాబ్వేపై చార్మ్స్ కప్‌కు ఎంపికయ్యాడు.[14] 1993 హీరో కప్ సందర్భంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను, 33 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు, ఇది ODIలలో అతని కెరీర్-బెస్ట్ బౌలింగ్ గణాంకాలుగా మిగిలిపోయింది. [15]
1996లో, అంకోలా ప్రపంచకప్‌కు భారత జట్టులో ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో అతను కేవలం ఒక మ్యాచ్ మాత్రమే, శ్రీలంకతో, ఆడాడు. భారత్ ఓడిపోయిన ఆ మ్యాచ్‌లో అతను ఐదు ఓవర్లలో 28 పరుగులిచ్చి వికెట్ తీసుకోకుండా వెనుదిరిగాడు.[16] ప్రపంచ కప్ ముగిసిన కొద్దిసేపటికే, సెలెక్టర్లు వినోద్ కాంబ్లీ, ఆల్-రౌండర్ మనోజ్ ప్రభాకర్‌తో పాటు అంకోలాను తక్షణమే తొలగించారు. ఈ ముగ్గురూ అంతకుముందు సింగర్ కప్, పెప్సీ షార్జా కప్ కోసం జట్టులో ఉన్నారు.[17] అంకోలా స్థానంలో మీడియం-ఫాస్ట్ బౌలర్ ప్రశాంత్ వైద్య ఎంపికయ్యాడు.[17] అయితే, 1996-97లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత జట్టుకు అంకోలా ఎంపికయ్యాడు. జట్టులో భాగమైనప్పటికీ, అతను ఏ టెస్ట్ మ్యాచ్‌లోనూ ఆడే 11 మందిలో ఉండే అవకాశం దొరకలేదు. టెస్ట్ సిరీస్ తర్వాత, అతను స్టాండర్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ వన్‌డే టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు; [18] అతను దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో జరిగిన టోర్నమెంట్‌లో ఐదు ఆటలు ఆడాడు. [19] దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్‌లో భారత్ ఓడిపోయింది, అంకోలా తన చివరి మ్యాచ్‌లో ఏడు ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు; [15] ఈ స్పెల్‌లో ఒక వదిలేసిన క్యాచ్, నో-బాల్‌లో పట్టిన క్యాచ్ ఉన్నాయి.[20] అతను మళ్లీ జట్టుకు ఎంపిక కానందున అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పర్యటన అతని చివరిదిగా మిగిలి పోయింది. అంకోలా అదే సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. [2]
రిటైర్మెంట్ తర్వాత క్రికెట్‌కు విరాళాలు
మార్చుమార్చి 2010లో, ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సచిన్ టెండూల్కర్ XI, సౌరవ్ గంగూలీ XI మధ్య అంకోలాకు బెనిఫిట్‌గా ట్వంటీ20 మ్యాచ్‌ను BCCI మంజూరు చేసింది. [21] ఆ జట్టులో అప్పటి భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంకోలా కూడా ఉన్నాడు. [22] ఒక రచయిత ఇలా పేర్కొన్నాడు, "సలీల్ అంకోలా నిజంగా అదృష్టవంతుడు. ప్రస్తుత భారత కెప్టెన్ తన బెనిఫిట్ మ్యాచ్‌కు హాజరవడం ఒక చాలా మంది ఆటగాళ్ళు చూడలేనిది." [23] [22]
2020లో ముంబై క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సెలెక్టర్‌గా సలీల్ అంకోలా ఎంపికయ్యాడు. [1] అతను క్రికెట్‌కు తిరిగి రావాలనీ, ఆట తనకు ఎంతగానో అందించిన దానిని తిరిగి ఇవ్వాలనుకున్నాడు. 2020లో అతను ముంబై క్రికెట్ అసోసియేషన్ కోసం సెలక్షన్ కమిటీ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. డిసెంబరు 16న ముంబై సీనియర్ & U25 కమిటీ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2020 లో సలీల్ అంకోలాను ముంబై టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా నియమించినప్పటికి, జట్టు అంతగా రాణించడంలేదు. 6 సంవత్సరాలుగా ఒక్క ట్రోఫీని కూడా గెలవలేదు, అతనికి జట్టును పునర్నిర్మించి, ముంబై క్రికెట్ కోల్పోయిన కీర్తిని తిరిగి పొందే పనిని అప్పగించారు. అతని అధ్యక్షతన ముంబై చాలా విరామం తర్వాత 2021/22 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. 2022/23 సీజన్‌లో ముంబై సీనియర్ జట్టు రంజీ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేరుకుంది. U25 CK నాయుడు ట్రోఫీని కూడా గెలుచుకుంది, అలాగే 2022/23 సీజన్‌లో ముంబై సీనియర్ జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఛాంపియన్‌షిప్‌ను 2006/07 తర్వాత మొదటిసారిగా గెలుచుకుంది. అతని ఛైర్మన్‌షిప్‌లో ప్రస్తుత ముంబై జట్టు పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది.
నటనా వృత్తి
మార్చుక్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అంకోలా సినిమాల వైపు దృష్టి సారించాడు. అతను 2000 హిందీ చలనచిత్రం కురుక్షేత్ర ద్వారా తన సినీ రంగ ప్రవేశం చేసాడు.[24] అందులో అతను సంజయ్ దత్ పోషించిన తన సీనియర్ అధికారితో పాటు ఒక పోలీసు పాత్రను పోషించాడు. [24] ఆ తరువాత పితాహ్ (2002), [25] తన చివరి ప్రధాన చిత్రం చురా లియా హై తుమ్నే (2003)తో అతను ఈషా డియోల్, జాయెద్ ఖాన్‌లతో కలిసి నటించాడు. [26] ఆ తర్వాత ఏడాది సైలెన్స్ ప్లీజ్, డ్రెస్సింగ్ రూమ్ లలో నటించాడు. [27] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు, అయినప్పటికీ అంకోలా నటనకు ప్రశంసలు లభించాయి. [27] అతను 2006లో రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పాల్గొన్నాడు. అంతకు ముందు, అతను కరమ్ అప్నా అప్నా అనే భారతీయ సోప్ ఒపెరాలో నటించాడు. అక్కడ అతను బాలాజీ టెలిఫిల్మ్స్‌తో "[అంకోలా] బాలాజీ ఫిల్మ్స్ నిర్మించినవి కాకుండా ఏ ఛానెల్‌లోనూ నటించకూడదు" అనే ఒప్పందం కుదుర్చుకున్నాడు.[28] 2006 జూన్ నుండి ఒక సంవత్సరం ఒప్పందం ముగియకముందే అతను బిగ్ బాస్‌లో కనిపించాడు కాబట్టి , సోనీ టెలివిజన్‌కు ప్రత్యర్థులుగా పరిగణించబడే ఇతర ఛానెల్‌లలో ఏ టీవీ షోలలో నటించవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. [29]
2008–12 మధ్యది అంకోలాకు చెడ్డ కాలం. అతని క్రికెట్ కెరీర్ లేదా అతని నటనా జీవితం నుండి పెరుగుతున్న కుటుంబ ఖర్చులకు సరిపడేంత ఆదాయం రాలేదు. ఆర్థిక సమస్యలు, చిరాకు, మద్య వ్యసనానికి, వైవాహిక సంబంధాల విచ్ఛిన్నానికీ దారితీసింది. అతని ఆర్థిక స్థితిని చక్కదిద్దడానికి BCCI 2010లో అతని కోసం ఒక బెనిఫిట్ మ్యాచ్‌ని ఏర్పాటు చేసింది. కానీ దానివలన ఒనగూడినది పెద్దగా లేదు. 19 సంవత్సరాల (1992-2011) వైవాహిక బంధం 2011 లో విడాకులతో ముగిసింది, ఆ తర్వాత అతను టెలివిజన్‌లో నటనను కొనసాగించి, నెమ్మదిగా కోలుకున్నాడు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Former India pacer Salil Ankola named Mumbai chief selector". The Indian Express (in ఇంగ్లీష్). 2020-12-17. Retrieved 2020-12-17. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "indianexpress.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 2.0 2.1 2.2 "Salil Ankola". ESPNcricinfo. Archived from the original on 7 August 2015. Retrieved 17 August 2015. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "profile" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Maharashtra v Gujarat". CricketArchive. Archived from the original on 20 December 2014. Retrieved 10 March 2013.
- ↑ Marar, Jaideep (15 October 1996). "Selection solace for Salil Ankola". The Indian Express. Archived from the original on 24 April 1997. Retrieved 13 October 2018.
- ↑ "Baroda v Maharashtra". Cricket Archive. Archived from the original on 20 December 2014. Retrieved 10 March 2013.
- ↑ "BCCP Patron's XI v Indians". Cricket Archive. Archived from the original on 11 November 2012. Retrieved 10 March 2013.
- ↑ "Pakistan v India". Cricket Archive. Archived from the original on 3 December 2012. Retrieved 10 March 2013.
- ↑ "You are seeing the best of Tendulkar: Waqar". Rediff.com. 21 April 2004. Archived from the original on 17 January 2011. Retrieved 28 March 2013.
- ↑ Lokendra Pratap Sahi (31 March 2011). "Sachin's has been a very different story: Waqar". The Telegraph (Calcutta). Archived from the original on 14 August 2013. Retrieved 28 March 2013.
- ↑ "Which Indian hit a six off his first ball in ODIs?". ESPNcricinfo. 11 July 2001. Archived from the original on 4 October 2012. Retrieved 5 January 2013.
- ↑ 11.0 11.1 Deshpande, Swati (29 January 2010). "Ankola wants out, wife says no". The Times of India. Archived from the original on 31 March 2013. Retrieved 5 January 2013. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "desh" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Viswanath, G. (12 October 2007). "Fast bowlers need guidance from expert". The Hindu. Archived from the original on 24 October 2008. Retrieved 14 March 2013.
- ↑ Murzello, Clayton (26 July 2012). "Contractor can rebuild the edifice". Mid-Day. Retrieved 14 March 2013.
- ↑ "ODI Matches Played by Salil Ankola". Cricket Archive. Archived from the original on 1 March 2014. Retrieved 16 March 2013.
- ↑ 15.0 15.1 "Statistics / Statsguru / SA Ankola / One-Day Internationals / Innings by innings list". ESPNcricinfo. Archived from the original on 29 March 2014. Retrieved 5 January 2013. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "inns" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Wills World Cup – 24th match, Group A: India v Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 13 November 2012. Retrieved 5 January 2013.
- ↑ 17.0 17.1 "The Headlines (for Mar 96)". ESPNcricinfo. Archived from the original on 14 March 2014. Retrieved 16 March 2013.
- ↑ Panicker, Prem (13 January 1997). "Jadeja, Joshi, Robin, Ankola return to the Indian side". Rediff.com. Archived from the original on 2 March 2014. Retrieved 10 March 2013.
- ↑ "Statistics / Statsguru / SA Ankola / One-Day Internationals / 1996—97". ESPNcricinfo. Archived from the original on 29 March 2014. Retrieved 16 March 2013.
- ↑ "Standard Bank International One-Day Series – Final". ESPNcricinfo. Archived from the original on 2 November 2013. Retrieved 16 March 2013.
- ↑ Kenkre, Hemant (7 March 2010). "Dhoni makes Salil Ankola's benefit game special". Mid-Day. Archived from the original on 3 November 2013. Retrieved 16 March 2013.
- ↑ 22.0 22.1 Gupta, Amit (27 May 2010). "2-crore googly for Salil Ankola". Mumbai Mirror. Archived from the original on 2 July 2010. Retrieved 16 March 2013.
- ↑ Lalwani, Vickey (8 November 2008). "Salil Ankola admitted to rehabilitation centre". Mumbai Mirror. Archived from the original on 2 October 2012. Retrieved 15 March 2013.
- ↑ 24.0 24.1 Anna M.M. Vetticad (3 April 2000). "Big screen boy – Ex-cricketer Salil Ankola set to move from small-screen to movies". Indiatoday.in. Archived from the original on 24 December 2013. Retrieved 14 March 2013.
- ↑ "Playing for Bollywood". Hindustan Times. 1 October 2012. Archived from the original on 27 December 2013. Retrieved 14 March 2013.
- ↑ Sukanya Verma; Ronjita Kulkarni. "Star son Zayed Khan debuts in Chura Liyaa Hai Tumne". Rediff.com. Archived from the original on 24 December 2013. Retrieved 14 March 2013.
- ↑ 27.0 27.1 Adarsh, Taran (9 April 2004). "Silence Please – The Dressing Room". Bollywood Hungama. Archived from the original on 31 March 2013. Retrieved 16 March 2013.
- ↑ Janwalkar, Mayura (8 November 2006). "Reality bites Salil Ankola". Daily News and Analysis. Retrieved 14 March 2013.
- ↑ "'Bigg Boss' shows Ankola the door". Daily News and Analysis. 10 November 2006. Retrieved 14 March 2013.