సల్మా సుల్తాన్

భారతీయ టెలివిజన్ పాత్రికేయురాలు, దర్శకురాలు

సల్మా సుల్తాన్ (జననం 1944, మార్చి 16) భారతీయ టెలివిజన్ పాత్రికేయురాలు, దర్శకురాలు. 1967 నుండి 1997 వరకు దూరదర్శన్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేసి, ఆ తర్వాత టెలివిజన్ కార్యక్రమాలకు దర్శకత్వం వహించింది.[1] ఈమె ఎడమ చెవి కింద తన జుట్టులో ఒక గులాబిని ఉంచి, తన చీర అంచుని తన మెడ చుట్టూ ఆధునిక ఇంకా సాంప్రదాయ పద్ధతిలో వేసుకొని కొత్త ట్రెండ్ ను సృష్టించింది. తర్వాత దాదాపుగా మహిళా న్యూస్ రీడర్లందరూ దీనిని అనుకరించారు.[2][3][4]

సల్మా సుల్తాన్
జననం (1947-03-16) 1947 మార్చి 16 (వయసు 77)
విద్యఇంద్రప్రస్థ మహిళా కళాశాల
వృత్తిదూరదర్శన్ లో న్యూస్ యాంకర్
క్రియాశీలక సంవత్సరాలు1967–2005
భార్య / భర్తఅమీర్ కిద్వాయ్
పిల్లలు2

జననం, విద్య

మార్చు

సల్మా సుల్తాన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో పండితుడు, కార్యదర్శి మహమ్మద్ అస్గర్ అన్సారీ దంపతులకు రెండవ బిడ్డగా జన్మించింది. సల్మాకు అక్క మైమూనా సుల్తాన్ (భోపాల్ నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ సభ్యురాలు) ఉన్నది. సల్మా, మైమూనా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షా షుజా మునిమనవరాలు. సల్మా భోపాల్‌లో పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ మహిళా కళాశాల నుండి ఇంగ్లీష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 23 సంవత్సరాల వయస్సులో దూరదర్శన్‌లో అనౌన్సర్ కోసం ఆడిషన్ ఇచ్చింది.[5]

వృత్తిరంగం

మార్చు

1959, సెప్టెంబరు 15న తన కార్యకలాపాలను ప్రారంభించిన దూరదర్శన్‌లో ప్రతిమ పూరి, గోపాల్ కౌల్ సాధారణ ముఖాలు[6] దూరదర్శన్ 1965లో 5 నిమిషాల న్యూస్ బులెటిన్‌ను ప్రారంభించింది. సల్మా సుల్తాన్ ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన మొదటి వార్తను 1984, అక్టోబరు 31న దూరదర్శన్ సాయంత్రం వార్తలో, ఇందిర కాల్చి చంపబడిన 10 గంటల తర్వాత అందించింది.[7]

దర్శకురాలిగా

మార్చు

తన పదవీ విరమణ తర్వాత, సల్మా సుల్తాన్ తన ప్రొడక్షన్ హౌస్ లెన్స్‌వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దూరదర్శన్ కోసం సామాజిక అంశాలపై అనేక సీరియళ్ళకు దర్శకత్వం వహించింది.[8][9][10][11][12] పంచతంత్ర సే, సునో కహానీ, స్వర్ మేరే తుమ్హారే, జల్తే సవాల్ వంటి సీరియల్స్ జనం దృష్టిని ఆకర్షించాయి. 1989లో మహాభారతం తర్వాత పంచంత్ర సే చాలా బాగా ప్రసారం చేయబడింది.[13] జల్తే సవాల్ అనేది మహిళల సమస్యలపై ఒక సీరియల్, ఇది 2004లో డిడి న్యూస్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం చేయబడింది.[14]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఇంజనీర్స్ ఇండియాలో పనిచేసిన అమీర్ కిద్వాయ్ తో సల్మా సుల్తాన్ వివాహం జరిగింది. సుల్తాన్ కుమారుడు సాద్ కిద్వాయ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమీషనర్ కాగా, కుమార్తె సనా కొరియోగ్రాఫర్ గా రాణిస్తోంది. సల్మాకు ఇద్దరు మనవరాళ్లు.[15] సాద్ కిద్వాయ్ ఒక డిజైనర్ గెతి ఖాన్ కిద్వాయ్ (జననం 1978)ని వివాహం చేసుకున్నాడు, వారికి ఇద్దరు పిల్లలు (సమర్, మెహర్) ఉన్నారు. సాద్, గెటి ఇప్పుడు లూథియానాలోని బిఆర్ఎస్ నగర్‌లో స్థిరపడ్డారు.[16][17]

మూలాలు

మార్చు
  1. "The Doordarshan Divas". The Times of India. 6 January 2008. Retrieved 13 October 2013.
  2. "Metro Plus Madurai / Miscellany : Gracefully yours!". The Hindu. 25 February 2010. Archived from the original on 15 October 2013. Retrieved 13 October 2013.
  3. "The Sultan of news | Culture". Times Crest. 9 October 2010. Archived from the original on 15 అక్టోబరు 2013. Retrieved 13 October 2013.
  4. "We the eyeballs : Cover Story". India Today. 24 September 2007. Retrieved 13 October 2013.
  5. "Cycling down sepia-toned lanes of Chandni Chowk". The Indian Express. 5 April 1999. Retrieved 13 October 2013.
  6. "The Tribune, Chandigarh, India – Himachal PLUS". The Tribune. Retrieved 13 October 2013.
  7. "The riots that could not be televised". The Indian Express. 3 November 2009. Retrieved 13 October 2013.
  8. "Three Doordarshan-era anchors recall what a dignified era of television news looked like". 25 September 2017.
  9. Rana Siddiqui Zaman (22 February 2010). "Gracefully yours!". The Hindu. Retrieved 13 October 2013.
  10. "Age of innocence". The Hindu. 25 October 2009. Retrieved 13 October 2013.
  11. "Wide Angle Screen". The Indian Express. 22 September 2013. Retrieved 18 July 2014.
  12. "Lost And Found-ANNIVERSARY ISSUE: 30 LOST AND FOUND". India Today. 3 July 2006. Retrieved 3 July 2006.
  13. "The Queen of Roses". The Hindu. 25 March 2004. Archived from the original on 26 December 2004. Retrieved 13 October 2013.
  14. "The Tribune, Chandigarh, India – Punjab". The Tribune. Retrieved 13 October 2013.
  15. "Lost and found-Thirty newsmakers from the pages of Indian history and where they are now: Cover Story – India Today". India Today. 3 July 2006. Retrieved 3 July 2006.
  16. "She brought 'ghararas' to Ludhiana". The Times of India. 18 July 2012. Archived from the original on 16 October 2013. Retrieved 18 July 2012.
  17. "Geti wants to design clothes for Aishwarya". The Times of India. 15 January 2012. Archived from the original on 16 October 2013. Retrieved 15 January 2012.

బాహ్య లింకులు

మార్చు

[[వర్గం:భారతీయ మహిళా టెలివిజన్ దర్శకులు]]