భారతీయ మహిళా టెలివిజన్ దర్శకులు

భారతీయ టెలివిజన్‌ రంగంలో అనేక మహిళా దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు, అనేక పురస్కారాలను గెలిచారు. వారిలో కొంతమంది జాబితా:

  1. అను మల్హోత్రా: భారతీయ సినిమా నిర్మాత.[1] భారతదేశంలోని పర్యాటక శాఖ కోసం అనేక టెలివిజన్ ధారావాహికలు, కార్యక్రమాలు, సినిమాలు, ప్రకటనలకు రచన, దర్శకత్వం, హోస్ట్‌గా వ్యవహరించింది.[2]
  2. అనురాధ తివారీ: ముంబైకి చెందిన రచయిత్రి, సినిమా దర్శకురాలు, హిందీ చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నది.
  3. అరుణా రాజే: దర్శకురాలు, ఎడిటర్. హిందీ సినిమారంగంలో పనిచేసింది.[3] తన సినిమాలకు 6 జాతీయ అవార్డులను గెలుచుకుంది.
  4. తనూజ చంద్ర: దర్శకురాలు, రచయిత్రి. స్త్రీ పాత్రలు ప్రధాన పాత్రధారులుగా ముఖ్యంగా దుష్మన్ (1998), సంఘర్ష్ (1999) వంటి మహిళా-ఆధారిత సినిమాలకు దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధి చెందింది.
  5. నవ్నీంద్ర బెహ్ల్: నాటకరంగ, టెలివిజన్ దర్శకురాలు, రచయిత్రి, నటి.[4]
  6. నిత్యా మెహ్రా: సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత్రి. రొమాంటిక్ డ్రామా బార్ బార్ దేఖో (2016), నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)కి దర్శకత్వం వహించి గుర్తింపు పొందింది.[5][6][7][8]
  7. నీనా గుప్తా: సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. ఈమె ది వీకెస్ట్ లింక్, కమ్‌జోర్ కడీ కౌన్ వంటి టి.వి.క్విజ్ ప్రోగ్రాములను నిర్వహించింది.[9]
  8. రాజశ్రీ ఓజా: నిర్మాత, దర్శకురాలు. ఐషా (2010), చౌరాహెన్ (2007) సినిమాలకు దర్శకత్వం వహించింది.
  9. రీతూ కపూర్: మీడియా వ్యాపారవేత్త.[10]
  10. లీనా యాదవ్: దర్శకురాలు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్. లీనా మొదటి అంతర్జాతీయ చలనచిత్రం, పర్చెడ్, 2015లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[11]
  11. విజయ మెహతా: గుజరాత్ కు చెందిన నాటకరంగ, సినిమా నటి, దర్శకురాలు.[12] మరాఠీ సినిమాలు, నాటకరంగంలో పనిచేసింది.
  12. వైశాలి కాసరవల్లి: కర్ణాటకకు చెందిన సినిమా నటి, టెలివిజన్ సీరియల్ దర్శకురాలు, కాస్ట్యూమ్ డిజైనర్.[13] 1997లో తాయ్ సాహెబ్ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.
  13. సంగీతరావు: టెలివిజన్, సినిమా దర్శకురాలు. బడే అచే లాగ్తే హైన్ కార్యక్రమం కోసం ఉత్తమ దర్శకురాలిగా అవార్డు[14] గెలుచుకుంది. ఎస్ ఐ కెన్ అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహిచింది.[15]
  14. సల్మా సుల్తాన్: టెలివిజన్ పాత్రికేయురాలు, దర్శకురాలు.
  15. సాయి దేవధర్: హిందీ టెలివిజన్‌ నటి, దర్శకురాలు
  16. సాయి పరాంజపే: సినీ దర్శకురాలు, రచయిత. 2006లోభారత ప్రభుత్వం, సాయికి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.[16]
  17. సింపుల్ గొగోయ్: అస్సాంకు చెందిన దర్శకురాలు.[17]
  18. సిమి గరేవాల్: సినిమా నటి, దర్శకురాలు, నిర్మాత & టాక్ షో హోస్ట్.
  19. హేమా మాలిని: నటి, దర్శకుడు, నిర్మాత, నాట్యకళాకారిణి, రాజకీయ నాయకురాలు.[18]

మూలాలు

మార్చు
  1. "Anu Malhotra - IMDb". imdb.com. Retrieved 2014-01-25.
  2. "Anu Malhotra". soulsurvivors.in. Archived from the original on 29 October 2013. Retrieved 25 January 2014.
  3. "Aruna Raje". IMDB. Retrieved 10 July 2015.
  4. "Death of farmers' dreams". The Tribune. 4 November 2006. Archived from the original on 24 డిసెంబరు 2013. Retrieved 24 January 2013.
  5. Ghosh, Sankhayan (2016-09-05). "Why Nitya Mehra doesn't like reality". www.livemint.com/. Retrieved 2018-03-23.
  6. Reuters Editorial. "Interview: Nitya Mehra on 'Baar Baar Dekho'". IN. Archived from the original on 20 February 2018. Retrieved 2018-03-23. {{cite news}}: |last= has generic name (help)
  7. "Baar Baar Dekho: The film is a person's life story from 18-60, says Ritesh Sidhwani".
  8. "Made In Heaven writers Zoya, Reema, Nitya, Alankrita on their debut series that 'unmasks' big, fat Indian weddings". Firstpost. 2019-03-11.
  9. Bold and dutiful Archived 2011-09-25 at the Wayback Machine MALA KUMAR, The Hindu, 16 December 2005.
  10. "Ritu Kapur | Reuters Institute for the Study of Journalism". reutersinstitute.politics.ox.ac.uk (in ఇంగ్లీష్). Retrieved 2018-08-29.
  11. "Playing Teen Patti with Leena Yadav". starboxoffice.com. Archived from the original on 6 June 2012. Retrieved 17 March 2012. Editing intrigued, so I learnt it. I have never assisted anybody, so I have learnt everything about direction and writing from editing. While I was editing, I got the offer to direct something for television, post which I directed fiction and non-fiction shows on TV for 12 years
  12. Abhijit Varde: Daughters of Maharashtra: Portraits of Women who are Building Maharastra : Interviews and Photographs, 1997, p. 87
  13. "Vaishali Kasaravalli passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 2010-09-27. Retrieved 2023-03-25.
  14. Hungama, Bollywood. "Winners of 7th Chevrolet Apsara Film and Television Producers Guild Awards | Latest Movie Features - Bollywood Hungama". Bollywood Hungama. Archived from the original on 29 January 2012. Retrieved 2016-04-10.
  15. "Bade Achhe Lagte Hain filmmaker to direct a Marathi film - Times of India". The Times of India. Retrieved 2016-04-10.
  16. Padma Bhushan Awardees Ms. Sai Paranjpye, Arts, Maharashtra, 2006.
  17. "rupali parda news". on Rupaliparda. Retrieved 6 November 2012.
  18. Hemamalini, ever dream girl turned 65. Archived 2019-08-25 at the Wayback Machine cinemanewstoday.com.