సహాయం:చర్చ పేజీల పరిచయం/1
చర్చ పేజీలు వాడుకరి చర్చ పేజీలు పేర్చే విధానం ఉదాహరణలు దృష్టిని ఆకర్షించడం సారాంశం |
వికీపీడియా వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న, ఆందోళన లేదా వ్యాఖ్య ఉంటే, ఆ వ్యాసపు 'చర్చ పేజీ' లో దాన్ని రాయవచ్చు. ![]() వ్యాసం ఎగువన ఉన్న "చర్చ" ట్యాబుపై నొక్కితే చర్చ పేజీకి చేరుకుంటారు. ట్యాబు ఎరుపు రంగులో కనిపిస్తే, దాని అర్థం ఆ పేజీలో ఇంకా ఎవరూ ఏమీ రాయలేదని; మీరే చర్చను ప్రారంభించడానికి సంకోచించకండి. మీరు క్రొత్త చర్చాంశాన్ని ప్రారంభించినప్పుడు, దాన్ని చర్చ పేజీలో అడుగున చేర్చండి. పేజీకి పైన ఉన్న "విషయాన్ని చేర్చు" ట్యాబును నొక్కడం కొత్త చర్చను మొదలు పెట్టడానికి అత్యుత్తమ మార్గం. క్రొత్త విభాగానికి శీర్షిక పెట్టి, మీ సందేశం రాయడానికి ఇది వీలు కలిగిస్తుంది. మీరు వేరొకరి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తుంటే, మీ వ్యాఖ్యను వారి వ్యాఖ్య కింద చేర్చండి. ఆ విభాగం యొక్క శీర్షికకు కుడి వైపున ఉన్న "[మార్చు]" లింకును నొక్కి, ఆపై క్రిందికి స్క్రోల్ చేసి మీ సందేశం రాయండి.
|