వికీపీడియాకు తోడ్పడే ప్రతి ఒక్కరికీ వారి స్వంత "వాడుకరి చర్చ" పేజీ ఉంటుంది. ఈ పేజీలో ఎవరైనా మీకు సందేశాలు పంపవచ్చు, మిమ్మల్ని ప్రశ్నలు అడగవచ్చు లేదా మీకు సలహా ఇవ్వవచ్చు. కొన్ని అవసరమైన సందేశాలు పంపే కొన్ని స్వయంచాలక "బాట్లు" కూడా ఉన్నాయి.
లాగినై ఉన్న వాడుకరికి సందేశం వచ్చినపుడు, వారి తెరకు పైన ఒక గమనింపు వస్తుంది:
భాగస్వామ్య ఇంటర్నెట్ కనెక్షను ద్వారా వికీపీడియాకు వచ్చే లాగిన్ కాని వాడుకరులకు ఎవరైనా సందేశాన్ని పంపినట్లయితే, వారు ఏ పేజికి వెళ్ళినా ఆ పేజీలో పైన కింది విధంగా ఒక గమనింపు కనిపిస్తుంది.
ప్రత్యుత్తరం ఇవ్వడానికి, మీ స్వంత వాడుకరి చర్చ పేజీలో సందేశానికి క్రింద మీ సందేశాన్ని రాయండి. (మీ ప్రత్యుత్తరాన్ని {{ping|ఆ వాడుకరిపేరు}}
అని మొదలుపెట్టండి. అలా అయితే మీరు సమాధానం ఇచ్చినట్లుగా వారికి గమనింపు వెళ్తుంది).
సాధారణంగా, వాడుకరుల సందేశాల చివరన ఉండే సంతకంలో "చర్చ" అనే లింకును నొక్కితే, ఆ వాడుకరి చర్చ పేజీకి వెళ్ళవచ్చు. వారి సంతకంలో ఉండే పేరు పై నొక్కితే, వారి వాడుకరి పేజీకి వెళ్తారు. అక్కడ చర్చ ట్యాబుపై నొక్కితే కూడా వారి చర్చ పేజీకి వెళ్ళవచ్చు. వెతుకు పెట్టెలో "వాడుకరి చర్చ:" అని టైపించి, దాని తరువాత వాడుకరిపేరును టైపుచేస్తే కూడా ఆ వాడుకరి చర్చ పేజీకి వెళ్ళవచ్చు.