ఇండెంటింగ్ వలన చర్చను చదవడానికి వీలవుతుంది. ఒక వాడుకరి సందేశం ఎక్కడ ముగిసిందో, తరువాతి వాడుకరి సందేశం ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవడం దీనివలన చాలా సులభమౌతుంది. మీ ప్రత్యుత్తరాన్ని మీరు సమాధానమిస్తున్న వ్యక్తి సందేశం కంటే ఒక స్థాయి లోపలికి ఇండెంట్ చేయండి. ఇండెంట్ చేయడానికి ఉత్తమ మార్గం పంక్తి ప్రారంభంలో ఒక కోలన్ (:) పెట్టడమే. ఎన్ని ఎక్కువ కోలన్లను ఉపయోగిస్తే, పాఠ్యం అంత లోపలికి జరుగుతుంది.
ఇలా టైపు చేస్తే
|
ఇలా కనిపిస్తుంది
|
ఈ వాక్యం ఎడమ చివరి నుండి మొదలౌతోంది.
: దీన్ని కొద్దిగా ఇండెంటు చేసాం.
:: దీన్ని మరింతగా ఇండెంటు చేసాం.
|
ఈ వాక్యం ఎడమ చివరి నుండి మొదలౌతోంది.
- దీన్ని కొద్దిగా ఇండెంటు చేసాం.
- దీన్ని మరింతగా ఇండెంటు చేసాం.
|
జాబితా తయారు చేసేందుకు ప్రతి పాయింటుకూ ముందు ఒక ఏస్టెరిస్కు (*) ను చేర్చండి. ఇది, దాని ముందు పాయింటులో వాడిన మార్కప్ ఏదైనా ఉంటే (:, *, #) దాని తరువాత చేరుతుంది. ఇది ప్రతీ లైనుకూ ముందు ఒక బులెట్ పాయింటును చేరుస్తుంది -ఇలా:
ఇలా టైపు చేస్తే
|
ఇలా కనిపిస్తుంది
|
* జాబితా లోని మొదటి అంశం
* జాబితా లోని రెండవ అంశం
** రెండవ అశం కింద ఉన్న ఉప అంశం
* జాబితా లోని మూడవ అంశం
|
- జాబితా లోని మొదటి అంశం
- జాబితా లోని రెండవ అంశం
- రెండవ అశం కింద ఉన్న ఉప అంశం
- జాబితా లోని మూడవ అంశం
|