చర్చా పేజీలను ఇతర వాడుకరులు పర్యవేక్షించరు. బాగా అభివృద్ధి చెందిన వ్యాసాల చర్చా పేజీల్లో ఏళ్ళ తరబడి అసలు చర్చలే జరక్కపోవచ్చు.. అలాంటి పేజీలకైతే ఇది మరింతగా వర్తిస్తుంది.
మీరు అలాంటి అరుదైన వ్యాసాలను సవరించాలనుకుంటే, వెనకాడకుండా, చేసెయ్యండి. అయితే, మార్పు చేసేముందు మరొక అభిప్రాయం తీసుకుందామని అనుకున్నా, లేదా సహాయం కోరాలన్నా దాని చర్చా పేజీలో చర్చను ప్రారంభించండి. ఆ చర్చ గురించి మరింత జనాదరణ ఉండే పేజీలో ప్రకటించవచ్చు.
ఇది చెయ్యాలంటే, ముందు వ్యాసపు చర్చ పేజీకి పైన అనుబంధ వికీప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఆప్రాజెక్టులు చురుగ్గానే ఉంటే, చర్చలో చేరమని కోరుతూ ఆ ప్రాజెక్టు చర్చ పేజీలో ఆహ్వానం పెట్టండి. {{subst:Please see|చర్చ:పేజీ పేరు#విభాగం పేరు}} అనే మూసను ఇందుకు వాడవచ్చు. లేదా ఆహ్వానాన్ని మీరే రాసెయ్యొచ్చు. కానీ ఒకే చర్చను అనేక చోట్ల మొదలుపెట్టవద్దు. వికీప్రాజెక్టులేమీ చురుగ్గా లేవనిపిస్తే, ఎవరూ సమాధానం ఇవ్వకపోతే, రచ్చబండలో రాయండి.