సాయిఖోమ్ మీరాబాయి చాను

సైఖోమ్ మీరాబాయి చాను (జననం 1994 ఆగస్టు 8) ఒక భారతీయ క్రీడాకారిణి. గ్లాస్గోలో జరిగిన 2014 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది.[2][3][4]

సైఖోమ్ మీరాబాయి చాను
వ్యక్తిగత సమాచారం
జాతీయత భారతదేశం
జననం (1994-08-08) 1994 ఆగస్టు 8 (వయసు 30)
నివాసంమణిపూర్, భారతదేశం
ఎత్తు1.50 మీ. (4 అ. 11 అం.)
బరువు49 కి.గ్రా. (108 పౌ.)
క్రీడ
దేశంభారత్
క్రీడవెయిట్‌లిఫ్టింగ్‌
పోటీ(లు)49 kg
కోచ్విజయ్ శర్మ[1]

బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా 2022 మార్చిలో ‘బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు మీరాబాయి చానుకి ప్రకటించారు.[5] కాగా బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్ ను 2021లో కోనేరు హంపి (చదరంగం), 2020లో పి.వి. సింధు (బ్యాడ్మింటన్) సొంతం చేసుకున్నారు.

బాల్యం

మార్చు

మీరాబాయి చాను 1994 ఆగస్టు 8 న మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా నాంగ్పోక్ కాచింగ్ లో ఒక మైటీ కుటుంబంలో జన్మించింది. ఆమె 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు తన ప్రతిభని గుర్తించారు.

కెరీర్

మార్చు

2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 48 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది.

2018 కామన్వెల్త్ క్రీడల్లో 196 కిలోలు, స్నాచ్‌లో 86 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కిలోలు ఎత్తడం ద్వారా చాను భారత తొలి బంగారు పతకాన్ని సాధించింది. దీనితో పాటు 48 కేజీల కేటగిరీలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును కూడా బద్దలు కొట్టింది.

టోక్యోలో 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో మొత్తం 202 కిలోల లిఫ్ట్‌తో 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోల బరువును ఎత్తగలిగిన చాను, కరణం మల్లేశ్వరి తరువాత ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోల విజయవంతమైన లిఫ్ట్‌తో కొత్త ఒలింపిక్ రికార్డును మీరాబాయి చాను నమోదు చేశారు.[6][7][8][9][10]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Kaushik Deka (19 July 2021). "Lifting hope Saikhom Mirabai Chanu". India Today. Retrieved 24 July 2021.
  2. "Sensational Mirabai Chanu snatches silver at Tokyo Olympics". The Economic Times. 24 July 2021. Retrieved 24 July 2021.
  3. "Tokyo Olympics: Indian weightlifter Saikhom Mirabai Chanu wins silver medal". Web News Observer (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-24. Retrieved 2021-07-24.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Tokyo Olympics 2021 Live: Mirabai Chanu wins silver, India's first medal at Tokyo 2020". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-24.
  5. "మల్లీశ్వరికి 'బీబీసీ లైఫ్‌ టైమ్‌' అవార్డు". andhrajyothy. 2022-03-29. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
  6. "PM Modi Congratulates Mirabai Chanu on Her Winning the Silver Medal in ... - Latest Tweet by ANI | 📰 LatestLY". LatestLY (in ఇంగ్లీష్). 2021-07-24. Retrieved 2021-07-24.
  7. "Mirabai Chanu wins Silver in weightlifting, India opens medal account in Tokyo". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-07-24.
  8. ""India Is Elated": PM Modi Cheers Mirabai Chanu's Silver Olympic Medal Win". NDTV.com. Retrieved 2021-07-24.
  9. "మీరాబాయి చానుకి 'రజతం'; భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త చరిత్ర". Sakshi. 2021-07-24. Retrieved 2021-07-24.
  10. Namasthe Telangana (24 July 2021). "మీరాబాయ్ చాను.. క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.