కామన్వెల్త్ క్రీడలు - 2018
కామన్వెల్త్ క్రీడలు - 2018 ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో ఏప్రిల్ 4, 2018 నుంచి ఏప్రిల్ 15, 2018 వరకు జరిగాయి. 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 18 క్రీడలు, 7 పారా స్పోర్ట్స్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా, తొలిసారిగా ఈ ఈవెంట్లో మహిళలకు, పురుషులకు సమానంగా పతకాలు ఉన్నాయి. పారా ట్రయథ్లాన్, విమెన్స్ రగ్బీ సెవెన్స్, బీచ్ వాలీబాల్ క్రీడాంశాలను కూడా తొలిసారిగా ప్రవేశపెట్టారు. కామన్వెల్త్ క్రీడలను ఆస్ట్రేలియాలో నిర్వహించడం ఇది ఐదవ సారి. [1]
చరిత్ర
మార్చుఈ క్రీడల్లో కామన్వెల్త్ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలను బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్‌గ పిలిచేవారు. ఈ క్రీడలను తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. 1942, 1946 సంవత్సరాల్లో ప్రపంచ యుద్ధాల కారణంగా వీటిని నిర్వహించలేదు. 1930-1950 కాలంలో బ్రిటీష్ ఎంపైర్ గేమ్స్‌గాను , 1954-1966 మధ్య బ్రిటీష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌గాను , 1970-1974 కాలంలో బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 లో ఈ క్రీడలకు కామన్వెల్త్ క్రీడలుగా నామకరణం చేసారు. కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, వేల్స్ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగు సార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో ఈ క్రీడలకు అతిథ్యం ఇచ్చింది.
పాల్గొన్న దేశాలు
మార్చుభారతీయ క్రీడాకారులు
మార్చుఈ క్రీడల్లో భారతదేశం తరపున 218 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈసారి పి.వి. సింధు భారతదేశ పతాకధారిగా వ్యవహరించింది. 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో షూటర్ విజయ్ కుమార్, 2010లో అభినవ్ బింద్రా, 2006లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పతాకధారులుగా వ్యవహరించారు. [2]
ప్రారంభ వేడుక
మార్చుఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలోని కరారా స్టేడియంలో ప్రారంభ వేడుక జరిగింది. ఈ వేడుకకు బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, క్వీన్స్ లాండ్ ప్రీమియర్ అన్నాస్టేసియా పలాస్జక్, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయీ మార్టిన్, కామన్వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ( 2018 ) ఛైర్మన్ పీటర్ బీటీ, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కమిల్లా, గోల్డ్ కోస్ట్ మేయర్ టామ్ టేట్‌లు హాజరయ్యారు.
ముగింపు వేడుక
మార్చుఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలోని కరారా స్టేడియంలో ముగింపు వేడుక జరిగింది. ముగింపు వేడుకలకు భారత బృందానికి పతాకధారిగా బాక్సర్ మేరీ కోమ్ వ్యవహరించారు.
మరిన్ని విశేషాలు
మార్చుఈ క్రీడలో మొత్తం 6600 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. మొత్తం 1500 పతకాల్లోను 250 స్వర్ణాలున్నాయి. 18 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ఇందులో భారత్ 17 క్రీడాంశాల్లో పోటీ పడింది.
పట్టిక
మార్చుఈ క్రీడలో 26 పసిడి పతకాలు, 20 రజత, 20 కాంస్యాలు గెలిచిన భారత బృందం, 66 పతకాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 198 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానం లో ఉండగా, 136 పతకాలతో ఇంగ్లండ్ రెండోస్థానంలో ఉంది. కెనడా 82, న్యూజిలాండ్ 46, దక్షిణాఫ్రికా 37, వాలేస్ 36, స్కాట్లాండ్ 44, నైజిరియా 24, సైప్రస్ 14, జమైకా 27, మలేసియా 24, కెన్యా 17, నార్త్ ఐర్లాండ్ 12 వంటి దేశాలు తరువాతి వరుసలో ఉన్నాయి.
విజేతలు
మార్చు- షూటింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి పిన్నవయస్కుడు అనీష్ భన్వాలా
- తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు చెందిన రాగాల వెంకట రాహుల్ 85 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని, రాగాల వరుణ్ 78 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించారు.
అధికారిక వెబ్సైట్
మార్చు- GC2018.com Archived 2017-08-15 at the Wayback Machine
మూలాలు
మార్చు- ↑ "పసిడి పంట పండిస్తారా!". ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Retrieved 3 April 2018.[permanent dead link]
- ↑ "త్రివర్ణ పతాకధారి... పీవీ సింధుకు అరుదైన గౌరవం!". telugu.samayam.com. Retrieved 3 April 2018.