సాహెబుల్ని గ్రామీణ ప్రజలు ఇలా పిలుస్తారు. ఉర్దూ మాట్లాడే ముస్లిముల్ని తురక సాయిబులనీ, తెలుగు మాట్లాడే వాళ్ళను దూదేకుల సాయిబు లనీ చెప్పుకుంటారు.

తురక సాయిబుల మీద సామెతలు

మార్చు
  • తురకా దూదేకుల తగాదాలో మురిగీ ముర్దార్ [మంచిదాన్నీ చెడ్డదనుకుంటారు]
  • మేకలు తప్పిపోతే తుమ్మల్లో, తురకలు తప్పిపోతే ఈదుల్లో (ఈతచెట్లలో) [ఆ అనుబంధం అలాంటిది]
  • తురకా కరకా రెండూ భేదికారులే. మొదటిది దగ్గరకు వస్తేనే చాలు, రెండోది లోపలికి పోవాలి. [అంత బెదురన్నమాట]
  • తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా? [కుండలేదని వండుకుతింటం మానేస్తామా?]
  • తురక దయ్యము మంత్రించినట్లు [ఏ కులందయ్యం ఎవర్ని పడుతుందోమరి]
  • తురకదాసరికి ఈతమజ్జిగ [బాంచేతు దేవుడికి మాదర్చోదు పత్రిలాగా]
  • తురకమెచ్చు గాడిదతన్ను [రెండూ అంతగట్టిగా ఉంటాయన్నమాట]
  • తురకలసేద్యం పెరిక లపాలు [రాజులసొమ్ము రాళ్ళపాలు లాగా]
  • తురకవాడకు గంగెద్దు పోతే కోసుకు తిన్నారట [అవసరం అసుంటిది ఎవరి అలవాటు వారిది ]
  • ఇదేందోయ్ పెంట తినే కోమటీ అంటే, పోవోయ్ బెల్లంతినే సాయిబా అన్నాడట.అట్లా అంటావేంటి కోమటీ అంటే ఎవరి అలవాటు వారిది అన్నాడట
  • తురక వీధిలో సన్యాసి భిక్షలాగా [కుంటోడైనా ఇంటోడు మేలు]
  • తురక వీధిలో విప్రుడికి పాదపూజ చేసేమి చెయ్యకేమి?[విప్రుల వీధిలో తురకాయనకు చేస్తే సరి]
  • తురక మరకా తిరగేసి నరకా [ఎల్లిశెట్టిలెక్క ఏకలెక్క]
  • తురకలలో మంచిఎవరంటే తల్లికడుపులో ఉన్నవాడూ, గోరీలో ఉన్నవాడు [పగవాణ్ణి పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట]
  • తురక ఎంతగొప్పవాడైనా ఇంటికి పేరులేదు, తలకు జుట్టు లేదు, మొలకు తాడు లేదు [ఎంత పెద్దకులస్తులకైనా ముడ్డి పీతికంపే]
  • పాకీదానితో సరసం కంటే అత్తరుసాయిబుతో కలహం మేలు [ గూని దున్న కంటే గుడ్డి దున్న మేలు]
  • సాయిబూ చిక్కిపోయావేంటంటే, ఇంకా చిక్కుతాం, మరీ చిక్కుతాం, మనసువస్తే చచ్చిపోతాం నీకేం అన్నాడట [ ఒంటేలుకి పోయి ఇంతసేపేంటిరా అంటే రెండేళ్ళుకు వచ్చింది అన్నాడట]
  • సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్లే నాకినా కుదా తోడు అన్నాడట
  • ఆవో అంటేనే అర్ధంగాక అగోరిస్తుంటే కడో అనేదాన్ని అంటగట్టావా? [ఒకరుంటే దేవులాట ఇద్దరుంటే తన్నులాట ]

సాయిబులపై సామెతలు

మార్చు

దూదేకుల సాయిబుల మీద సామెతలు

మార్చు
  • దూదేకులవానికి తుంబ తెగులు [ఇక ఏకే వృత్తి ఏం నడుస్తుంది పాపం?]
  • దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? [ఏంలోటూ లేదు ఇంకో పని చేసుకొని బ్రతకొచ్చు]
  • తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా [ఏచెట్టూలేనిచోట ఆముదంచెట్టులాగా]
  • కాకర బీకర కాకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. [ఉర్దూరాక పాట్లు]

ఇలాంటి సామెతలు వీళ్ళ మీద అపహాస్యంగా చులకన భావంతో పుట్టించినా, అనాటి సాంఘిక పరిస్థితులు ఆయా కులాలు మతస్థుల మధ్య చాలా వివక్షతో కూడుకొని ఉండేవని అర్ధంఅవుతుంది.ఇప్పుడు జనం ఈ సామెతలు బయటికి అనలేరు.కానీ మన గత చరిత్ర ఎలా నడిచిందో మన పూర్వీకులు ఎదుర్కొన్న అనుభవాలను ఈ సామెతలు కళ్ళకు కడతాయి.

సాయిబుల మీద జానపద గీతాలు

మార్చు
  • అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తర మొచ్చింది... అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తర మొచ్చింది

ఉత్తర మొచ్చినరోజు నా మొగుడు ఊర్లో లేడమ్మో... అత్తరు సాయిబో రారా అందాల మారాజో రారా

"https://te.wikipedia.org/w/index.php?title=సాయిబులు&oldid=3189497" నుండి వెలికితీశారు